
సాక్షి, హైదరాబాద్: బీసీలకు చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య మంగళవారం సీఎం కేసీఆర్, స్పీకర్ మధుసూదనచారిని కలిసి విజ్ఞప్తి చేశారు. గతంలో బీసీ సమస్యలపై చర్చించడానికి రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చిన సీఎం ఎలాంటి చర్య తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల సమస్యలు, డిక్లరేషన్‌పై అసెంబ్లీలో చర్చించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కలిసిన వారిలో గుజ్జ కృష్ణ, భూపేశ్ సాగర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment