మాట్లాడుతున్న బీసీ నాయకులు
మిర్యాలగూడ టౌన్ : వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలకు సముచిత స్థానం కల్పించకుంటే తగిన బుద్ధి చెప్పుతామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ కమిటీ ప్రె సిడెంట్ మేకల వెంకన్న, తెలం గాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం బీసీ కులాల సంఘాల సమావేశానికి అతిథిగా హాజరయ్యారు. 2019 ఎన్నికల్లో 12 సీట్లల్లో 6 సీట్లు బీసీ జనా భా ప్రాతిపదికన సీట్లు పార్టీలు కేటాయిం చాలని డిమాండ్ చేశారు. మిర్యాలగూడ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కూడా బీసీకి ఎమ్మెల్యే టికెట్‌ను కేటాయించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. సమావేశంలో అంజి, శ్రీను గిరి, సత్యనారాయణ, లక్ష్మినారాయణ, కృష్ణ, , పుప్పాల సత్యం, రాచూరి మహేష్, పందిరి వేణు, కంచి సత్యనారాయణ, లోహిత్, ఆనంద్, ప్రశాంత్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment