సాక్షి, కాకినాడ: వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యానారాయణ తెలిపారు. అమరావతికి తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. గతంలో చేసుకున్న ఒప్పందాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వికేంద్రీకరణ అంశంపై కాకినాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఏపీ అభివృద్ధి-పరిపాలన వికేంద్రీకరణ అంశంపై చర్చించారు.
ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, ఎంపీలు సుభాష్ చంద్రబోస్, వంగా గీత, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రాజధాని ప్రతిపాదనలపై లోతైన అధ్యయనం చేసినట్లు పేర్కొన్నారు. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం కాకూడదన్నారు. ప్రభుత్వానికి 26 జిల్లాలు సమానమేనన్నారు. 29 గ్రామాల కోసం రాష్ట్రానికి సమస్య సృష్టించడం సరికాదని హితవు పలికారు.
చదవండి: వికేంద్రీకరణపై రౌండ్‌టేబుల్ సమావేశం: మేధావులు ఏమన్నారంటే
Comments
Please login to add a commentAdd a comment