బీసీలను మోసగిస్తే గుణపాఠం తప్పదు | BC leaders meeting | Sakshi
Sakshi News home page

బీసీలను మోసగిస్తే గుణపాఠం తప్పదు

Published Sat, Nov 5 2016 11:58 PM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM

బీసీలను మోసగిస్తే గుణపాఠం తప్పదు

బీసీలను మోసగిస్తే గుణపాఠం తప్పదు

విజయవాడ (గాంధీనగర్‌) : బీసీలను మోసగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు తగిన రీతిలో బుద్ధి చెబుతామని పలు బీసీ సంఘాల నాయకులు హెచ్చరించారు. స్థానిక ఎంబీ విజ్ఞాన కేంద్రంలో బీసీ సమస్యల పరిష్కారం కోరుతూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది.

సమావేశానికి అధ్యక్షత వహించిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట మహేష్‌ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు కాపాడుకునేందుకు ఎంతటి ఉద్యమానికైనా వెనుకాడబోమన్నారు. అన్నిరంగాల్లో ముందున్న అగ్రకులాలను బీసీ జాబితాలో చేర్చితే బాబు భరతం పడతామని హెచ్చరించారు. బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు డా. జి గంగాధర్‌ మాట్లాడుతూ రాయితీల కోసం కాదు, రాజ్యాధికారం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. బట్రాజు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోటంరాజు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే బీసీ ఆట్రాసిటీ యాక్ట్‌ తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

అంగిరేకుల వరప్రసాద్‌ మాట్లాడుతూ బీసీలను అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. బీసీ కార్పొరేషన్‌కు నిధుల కేటాయింపులో అంకెల గారడీ తగదన్నారు. సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి కె. శివాజీ, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్, అన్నం శివరాఘవయ్య, పలగాని సుధాకర్,  నూకాలమ్మ, 40కి పైగా బీసీ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement