హోదా కోసం త్యాగాలకు సిద్ధం
నెల్లూరు (టౌన్) : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేందుకు త్యాగాలకు సిద్ధమని పలువురు నాయకులు చెప్పారు. ఆదివారం నెల్లూరులోని దర్గామిట్టలో ఉన్న ఎన్‌జీఓ హోంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా జేఏసీ వివిధ సంఘాల నాయకులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా కన్వీనర్ అంజయ్య మాట్లాడుతూ హోదా విషయంలో నాటకాలు ఆపాలన్నారు. ఈనెల 5వ తేదీన రాజ్యసభలో హోదాపై పెట్టే ఓటింగ్‌లో రాజకీయాలకు అతీతంగా ఓటు వేయాలని డిమాండ్ కోరారు. ఓటింగ్‌కు దూరంగా ఉన్న పార్టీలకు తగిన బుద్ధిచెబుతామని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చిన బంద్‌కు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఆయా సంఘాల నాయకులు అల్లాడి గోపాల్, శేఖర్, చంద్రశేఖరరెడ్డి, స్వర్ణ వెంకయ్య, ఫయాజ్, చంద్రశేఖర్, శంకరయ్య, నాగేంద్రకుమార్, ఆదినారాయణ, వంశీకృష్ణ, మనోహర్, నరసింహ, మురళీకృష్ణయాదవ్, అన్వర్‌బాష, శ్రీనివాసులు, వెంకటరమణలు పాల్గొన్నారు.