- తక్షణం ప్రభుత్వం స్పందించాలి
- కాంట్రాక్టు అధ్యాపకులకు న్యాయం చేయాలి
- రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్
కాంట్రాక్టు అధ్యాపకులకు మద్దతుగా పోరాటం
Published Tue, Dec 27 2016 10:44 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 PM
కంబాలచెరువు :
(రాజమహేంద్రవరం) : ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ దీక్షలు చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు మద్దతుగా ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు తెలిపాయి. రాజమహేంద్రవరంలోని ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద దీక్షలు చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు మద్దతుగా ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మంగళవారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆ సంఘం జిల్లా కార్యదర్శి బి.పవ¯ŒS మాట్లాడుతూ ఏళ్ల తరబడి కళాశాలల్లో అధ్యాపక వృత్తినే నమ్ముకుని జీవించి, చివరికి వయసు మించిపోయి ఉద్యోగ అర్హత కోల్పోయిన కాంట్రాక్టు అధ్యాపకుల కుటుంబాలకు దిక్కెవరన్నారు. వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చి పదో పీఆర్సీ అమలు చేయాలని, పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. జేఏసీ నాయకుడు వి.కనకరాజు మాట్లాడుతూ కాంట్రాక్టు అధ్యాపకులకు ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ నాయకుడు పి.మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం కాంట్రాక్టు అధ్యాపకులను నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి న్యాయం చేయాలని కోరారు. చదువులు చెప్పే పంతుళ్లు ఇలా రోడ్డు పాలు కావడం బా«ధాకరమని ఎల్‌ఐసీ యూనియ¯ŒS నాయకులు పి.సతీష్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విద్యారంగానికి కీలకమైన కాంట్రాక్టు అధ్యాపకుల డిమాండ్లు పరిష్కరించాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జె.రూపస్‌రావు సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్.ఈశ్వరరావు, దేశిరెడ్డి బలరామానాయుడు, గంగాధరరావు, నల్లా రా>మారావు, వి.రాంబాబు, ఎం.ఎస్.ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement