నేటి నుంచి ‘టెట్‌’ | TET Exam under CBT System at 120 Centers: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ‘టెట్‌’

Published Tue, Feb 27 2024 3:06 AM | Last Updated on Tue, Feb 27 2024 3:06 AM

TET Exam under CBT System at 120 Centers: Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(ఏపీ టెట్‌)–2024 షెడ్యూల్‌ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే 2,67,559 మంది అభ్యర్థులకు విద్యా శాఖ హాల్‌ టికెట్లను జారీ చేసింది. టెట్‌ మొదటి సెషన్‌ ఉదయం 9.30 నుంచి 12, రెండో సెషన్‌ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ) విధానంలో జరిగే ఈ పరీక్ష కోసం అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 120 సెంటర్లను సిద్ధం చేశారు. అభ్యర్థులకు అవసరమైన తాగునీరు, వైద్య సదు­పాయాలను సైతం కల్పించినట్టు కమిషనర్‌ సురేష్కుమార్‌ సోమవారం తెలిపారు.

పరీక్ష సరళిని పర్యవేక్షించేందుకు జిల్లాకు ఒక అధికారి చొప్పున 26 మందిని, 300 మంది అభ్యర్థులకు ఒక డిపార్ట్‌మెంటల్‌ అధికారిని నియమించినట్టు చెప్పారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, బరంపురంలోని పరీక్ష కేంద్రాలకు కూడా డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లను నియమించినట్టు తెలిపారు. పరీక్ష కేంద్రాల పర్యవేక్షణకు ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌నూ సిద్ధం చేశామన్నారు. వైకల్యం గల అభ్యర్థుల కోసం సహాయకులను అందించడంతో పాటు వారికి 50 నిమిషాల అదనపు సమయం ఇచ్చినట్టు వెల్లడించారు. గర్భిణులు సమీ­ప పరీక్ష కేంద్రాలకు హాజరయ్యేలా వెసులుబాటు కల్పిం­చినట్టు తెలిపారు.

అయితే వీరు పరీక్ష కేంద్రంలోని అధికారులకు పరీక్ష రాసే ముందుగా సమాచారం ఇవ్వాల్సి ఉంది. హైకోర్టు ఆదేశం మేరకు బీఈడీ అభ్యర్థులు స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు, డీఈడీ అభ్యర్థులు ఎస్‌జీటీ పోస్టుల టెట్‌ మాత్రమే రాయాల్సి ఉంది. టెట్‌ జరిగే అన్ని రోజు­లూ ఉద­యం 7.30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు కమిç­Ùనరేట్‌లో ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌ (95056 191­27, 97056 55349, 81219 47387, 81250 469­97) సేవలు అందించేలా చర్యలు తీసుకున్నారు.

టెట్‌ షెడ్యూల్‌ ఇదీ..
► పేపర్‌ 1ఏ: నేటి నుంచి మార్చి 1 వరకు  
► పేపర్‌ 2ఏ: మార్చి 2, 3, 4, 6 తేదీలు 
​​​​​​​► పేపర్‌ 1బి: మార్చి 5 (ఉదయం) 
​​​​​​​► పేపర్‌ 2బి: 05.03.2024 (మధ్యాహ్నం) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement