నివ్వెరబోయూరు..
► ఇంగ్లిష్‌లో బీఈడీ ప్రశ్నపత్రం
► ఆందోళన చెందిన విద్యార్థులు
► ఏం రాయూలో తెలియక అయోమయం
కమాన్‌చౌరస్తా : బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రశ్నపత్రం చూసిన విద్యార్థులు నివ్వెరబోయూరు. గతంలో మాదిరిగా కాకుండా కేవలం ఇంగ్లిష్‌లోనే ప్రశ్నపత్రం ఉండడంతో కొందరు విద్యార్థులు కేవలం హాల్‌టికెట్ నంబర్ మాత్రమే రాసి బయటకు వెళ్లిపోయూరు. ప్రశ్నాపత్రం గతంలో మాదిరిగా తెలుగులోనే ఇవ్వాలని కోరుతున్నారు.
5 కేంద్రాల్లో 1400 మంది బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 5 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరీంనగర్‌లో ఎస్సారార్ కళాశాల, వివేకనందా డిగ్రీ, పీజీ కళాశాల, వాగేశ్వరీ డిగ్రీ కళాశాల, జగిత్యాలలోని మహిళా డిగ్రీ కళాశాల, పెద్దపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా బీఈడీ కళాశాలలకు చెందిన 1400 మంది విద్యార్థులు హాజరయ్యూరు.
ఇక నుంచి ఇంతే !
శాతవాహన యూనివర్సిటీ బీఈడీ విద్యార్థులకు మొదటిసారిగా సెమిస్టర్ విధానం అమలు చేయడంతో నిబంధనలు మారారుు. బీఈడీ ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లోనే ఉంటుందని యూనివర్సిటీ అధికారులు పేర్కొంటున్నారు. మొదటి పరీక్షనే కాదు ఇక ముందు జరుగబోయే పరీక్షలన్నింటీ ప్రశ్నపత్రాలు ఆంగ్లమాధ్యమంలోనే వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు.
గతంలో మాదిరిగానే ఉండాలి
గతంలో బీఈడీ ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లిష్ రెండు భాషల్లో వచ్చేది. కానీ ఇప్పుడు సెమిస్టర్ విధానం అమలవడంతో కోర్సు నిబంధనలు మారి ఇంగ్లిష్ మీడియంలోనే వస్తున్నారుు. తెలుగు మీడియం విద్యార్థులు మాత్రం కేవలం హాల్‌టికెట్ నంబర్ రాసి పరీక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చారు. జిల్లా కేంద్రంలోని మరో సెంటర్‌లో ప్రశ్నపత్రాన్ని తెలుగులో అనువదించి చెప్పడంతో అక్కడి విద్యార్థులు గట్టెక్కారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో వచ్చినప్పటికీ సమాధానాలు మాత్రం తెలుగులో రాసుకునే వెసులుబాటు ఉందని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు.