బీఈడీ అడ్మిషన్లు ఫుల్
Published Mon, Nov 11 2013 3:49 AM | Last Updated on Fri, Aug 17 2018 3:08 PM
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: సిక్కోలు జిల్లాలో బీఈడీ కోర్సుకు ఆదరణ తగ్గలేదు. ఉన్నత విద్యామండలి రెండో విడత నిర్వహించిన కౌన్సెలింగ్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అనుబంధ పైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లు శతశాతం భర్తీ అయ్యూయి. మొదటి విడత కౌన్సెలింగ్‌లో కన్వీనర్ కోటాలో 83.45 శాతం మాత్రమే నిండాయి. జిల్లాలో 14 కళాశాలలు ఉండగా 1460 సీట్లు ఉన్నాయి. వీటిలో కన్వీనర్ సీట్లు 1088 కాగా 908 సీట్లు మొదటి కౌన్సెలింగ్‌లో నిండాయి. రెండో కౌన్సెలింగ్‌కు కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకున్న సెయింట్‌మాక్సు(మందస)లో కూడా 75 కన్వీనర్ సీట్లు నిండి పోయాయి. 25 శాతం మేనేజ్ మెంట్‌సీట్లు నేరుగా యూజ మాన్యాలు భ ర్తీ చేసుకుంటాయి.
గత ఏడాది మొదటి విడత కన్వీనర్ కోటా కౌన్సెలింగ్‌లో 1110 సీట్లకు 924 (83.24శాతం) సీట్లు నిండాయి. అనంతరం రెండో కౌన్సెలింగ్‌లో మొత్తం సీట్లు నిండటంతో పాటు, మేనేజ్ మెంట్ కోటా సీట్లు కూడా శతశాతం భర్తీ అయ్యూయి. ఈ ఏడాది కూడా జిల్లాలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ అడ్మిషన్లు తగ్గుతూ వస్తున్నాయి. కొన్ని జిల్లాలో 70 శాతానికి మాత్రమే ఈ ఏడాది పరిమితమయ్యాయి. డీఎస్సీలో ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ వారిని అనుమతించక పోవడం, కళాశాలు ఒక్కసారిగా పెరిగిపోవడం, ఎడ్‌సెట్ రాస్తున్న వారి సంఖ్య తగ్గడం వంటివి ప్రవేశాలకు ప్రతిబంధకంగా మారారుు. ఈ ఏడాది సీట్లు నిండవని ప్రైవేటు యాజమాన్యాలు ఆందోళన చెందాయి. పూర్తిస్థాయిలో అడ్మిషన్లు జరగడంతో ఊపిరి పీల్చుకున్నాయి.
ఒక్క కళాశాలకే అనుమతి లేదు
గతంలో వర్సిటీ పరిధిలో జిల్లాలో 16 బీఎడ్ కళాశాలలు ఉండేవి. కొన్ని కారణాలు వల్ల నేషనల్ కౌన్సెల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ సంస్థ 120 సీట్లు ఉన్న పలాస కాశీబుగ్గలోని సాయశిరీష కు అనుమతులు ఇవ్వలేదు. దీంతో ఈ కళాశాలలో ఈ ఏడాది అడ్మిషన్లు నిర్వహించలేదు. ఈ ఏడాది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలోని స్సెషల్ బీఈడీ మెంటల్లీ రిటార్డ్ కోర్సులో అడ్మిషన్లు ఎడ్‌సెట్ ర్యాంకులు ద్వారానే ప్రవేశాలు కల్పించారు. 25 సీట్లకు మొత్తం నిండి పోయాయి. బీఈడీ కన్వీనర్ సీట్లు భర్తీలో మొదటి విడత కౌన్సెలింగ్‌లో సోషల్ స్టడీస్ 30, గణితం 25, బయోలాజికల్ సైన్సు 25, ఫిజకల్ సైన్సు 15, ఇంగ్లిష్ 5 శాతం కోటాలో భర్తీచేశారు. రిజర్వేషన్ ప్రాతిపదికన ప్రవేశాలు కల్పించడంతో మొదటి విడతలో బయోలాజికల్ సైన్సు, ఫిజికల్ సైన్సు, ఇంగ్లిష్ సబ్జెక్టులలో ర్యాంకర్లు తగినంతగా లేకపోవడంతో కన్వీనర్ కోటా సీట్లు మిగిలిపోయూయి. రెండో విడత కౌన్సెలింగ్‌లో సబ్జెక్టు కన్వర్షన్‌కు వీలుండటంతో అడ్మిషన్లు మెరుగు పడ్డాయి. గత ఏడాది వెబ్ కౌన్సెలింగ్‌కు 1691 మంది హాజరు కాగా, ఈ ఏడాది ఎడ్‌సెట్ 4532 మంది రాయగా 1569 మంది హాజరయ్యారు. రెండో కౌన్సెలింగ్‌కు 32 మంది హాజరయ్యారు. 90 మంది వరకు సీట్లురాక వారి ధ్రువపత్రాలను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ సహాయ కేంద్రానికి వచ్చి తీసుకెళ్లారు.
మారిన ఫీజు స్ట్రక్చర్...
ఈ ఏడాది నుంచి బీఈడీ కళాశాలల ఫీజు స్ట్రక్చర్ కూడా ఇంజినీరింగ్ కళాశాలలు మాదిరిగా మారాయి. ఫీజుల నియంత్రన మండలి నిర్ణయిస్తుంది. గతంలో ప్రైవేటు కళాశాలలన్నింటి ఫీజు ఒకేలా ఉండేది. ప్రస్తుతం కళాశాలల వసతి బట్టి 17 వేలు నుంచి 22 వేల వరకు నిర్ణయించారు. కామన్ ఫీజు, స్పెషల్ ఫీజులతో కలిపి రూ.15వేల వరకు ప్రభుత్వం అర్హత గల వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ అందజేస్తుంది. కళాశాలలు తమ భవనాలు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు ఫీజుల నియంత్రణ కమిటీకి అందజేయూల్సి ఉంటుంది.
మేనేజ్‌మెంట్ సీట్లకు తగ్గిన డిమాండు
బీఈడీ కళాశాలల్లో 25 శాతం మేనేజ్ మెంట్ కోటాలో సీట్లు నింపుతారు. ప్రస్తుతం మేనేజ్ మెంట్ కోటా సీట్లకు గతంతో పోల్చితే డిమాండు తగ్గింది. గతంలో రూ.లక్ష నుంచి రూ.50 వేల మధ్య సబ్జెక్టు బట్టి సీట్లకు డిమాండు ఉండేది. సోషల్ స్టడీస్‌కు డిమాండు ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం గిరాకీ తగ్గింది. కళాశాల బట్టి రూ. 30వేల నుంచి 40వేల మధ్య మేనేజ్ మెంట్‌లు వసూలు చేస్తున్నారుు. వాస్తవంగా కన్వీనర్ ఫీజులకు సమానంగా మాత్రమే వసూలు చేయాలి. ఈ నిబంధన ఎక్కడా అమలుకావడంలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలో శతశాతం మేజేజ్ మెంట్ సీట్లు నిండే అవకాశం ఉంది. అయితే, అధిక మొత్తంలో డబ్బులు చెల్లించేందుకు విద్యార్థులు సిద్ధంగాలేనట్టు కనిపిస్తోంది.
అనధికార వసూళ్లు!
ఉన్నత విద్యామండలి హెచ్చరికలు జారీ చేస్తు న్నా ప్రైవేటు బీఈడీ కాలేజీల్లో అనధికార వసూ ళ్లు తగ్గడంలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. దాదాపుగా అన్ని ప్రైవేటు కళాశాలలు కూడా బిల్డింగ్, కాలేజ్ డెవలప్‌మెంట్ ఫండ్ పేరుతో అనధికార వసూళ్లకు పాల్పడుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు అనధికార భారం వేస్తున్నారని వాపోతున్నారు. ఉన్నత విద్యామండలి మాత్రం ఈ వసూళ్లపై ఎప్పటి నుంచే నిఘా పెట్టింది. అయినా కళాశాలలు మాత్రం పెడచెవిన పెడుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి.
Advertisement