రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కళాశాలల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఈనెల 11వ తేదీ వరకు సంబంధిత కళాశాలలో చేరవచ్చని కన్వీనర్ ఆచార్య నిమ్మ వెంకటరావు ఓ ప్రకటనలో తెలిపారు. రెండో దశ కౌన్సెలింగ్‌లో ప్రవేశాలు పొంది ఇంకాచేరని విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని గడువు పెంచామన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కళాశాలల్లో చేరని విద్యార్థులు సంబంధిత హెల్ప్‌లైన్ కేంద్రాల నుంచి ఈనెల 11 నుంచి సర్టిఫికెట్లు పొందవచ్చు.
11 నుంచి ‘మను’లో బీఈడీ కౌన్సెలింగ్
హైదరాబాద్, న్యూస్‌లైన్: మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం(మను)లో బీఈడీ మొదటి సంవత్సరం(దూరవిద్య) విద్యార్థులకు ఈ నెల 11 నుంచి 28 వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు వర్సిటీ వర్గాలు శుక్రవారం తెలిపాయి. అభ్యర్థులు క్యాంపస్‌లోని స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ భవనానికి 11న మధ్యాహ్నం 2 గంటలకు హజరుకావాలని పేర్కొన్నాయి.
11వరకు బీఎడ్ ప్రవేశ గడువు పెంపు
Published Sat, Nov 9 2013 2:09 AM | Last Updated on Wed, Sep 5 2018 8:36 PM
Advertisement