due date
-
ఐటీఆర్ ఫైలింగ్ గడువు పెంచండి.. ఐటీ శాఖ రెస్పాన్స్ ఇదే..
ఐటీఆర్ ఫైలింగ్‌కు గడువు తేదీ సమీపించడంతో పన్ను చెల్లింపుదారులు రిటర్న్ ఫైలింగ్ హడావుడిలో ఉన్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం గడువు తేదీ పొడిగింపు ఉండబోదని ఐటీ శాఖ ఇదివరకే స్పష్టం చేసింది. అయితే ఐటీఆర్ ఫైలింగ్ సందర్భంగా ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో సమస్యలు ఎదురైనట్లు కొంతమంది పన్ను చెల్లింపుదారులు పేర్కొంటున్నారు. ఇదీ చదవండి ➤ Income Tax Refund: ట్యాక్స్ రీఫండ్ 12 గంటల్లోనే.. నమ్మబుద్ధి కావడం లేదా? ఈ-ఫైలింగ్ పోర్టల్ గత ఐదు రోజులుగా సరిగా పనిచేయడం లేదంటూ ఓ ట్యాక్స్ పేయర్ ట్విటర్లో ఆదాయపు పన్ను శాఖ దృష్టికి తీసుకొచ్చారు. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో సమస్యల కారణంగా ఐటీఆర్ ఫైలింగ్ గడువును మారో 30 రోజుల పాటు పొడిగించాలని కోరారు. దీనిపై ఆదాయపు పన్ను శాఖ స్పందిస్తూ.. “ఈ-ఫైలింగ్ పోర్టల్ బాగానే పని చేస్తోంది. మీకు ఎదురైన నిర్దిష్ట సమస్యను వివరిస్తూ పాన్, మొబైల్ నంబర్, సమస్యకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌తో సహా orm@cpc.incometax.gov.inలో మాకు పంపించండి. మా బృందం మిమ్మల్ని సంప్రదిస్తుంది” అని పేర్కొంది. ఇదీ చదవండి ➤ ITR filing: పన్ను రీఫండ్‌ను పెంచుకునేందుకు పంచ సూత్రాలు ఇవే.. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోని డేటా ప్రకారం జులై 29 వరకు 5.73 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. వీటిలో 4.9 కోట్లకు పైగా రిటర్న్‌లను వాటిని దాఖలు చేసిన ట్యాక్స్ పేయర్లు వెరిఫై చేశారు. అలాగే 3.18 కోట్ల ఐటీఆర్‌లను ఆదాయపు పన్ను శాఖ ప్రాసెస్ చేసింది. ఆడిట్ అవసరం లేని ట్యాక్స్ పేయర్లందరూ జులై 31లోపు తమ రిటర్న్‌లను ఫైల్ చేయడం చాలా ముఖ్యం. గడువు తేదీ తర్వాత కూడా ఆలస్యంగా ఐటీఆర్‌ను ఫైల్ చేసే అవకాశం ఉంది. అయితే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234ఎఫ్ కింద రూ. 5000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇది రూ. 5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికైతే రూ. 1000. దీంతోపాటు గడువు తేదీలోపు ఐటీఆర్‌ను ఫైల్ చేయకపోతే అనేక ఇతర పరిణామాలు ఉంటాయి. ఇదీ చదవండి ➤ Beware of I-T notice: ఐటీ నోటీసులు రాకూడదంటే.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు Dear @NeeleshTax, The e-filing portal is working fine. May we request you to write to us at orm@cpc.incometax.gov.in detailing the specific issue you've encountered (along with PAN, your mobile no. & a screenshot of the error). Our team will get in touch with you. — Income Tax India (@IncomeTaxIndia) July 30, 2023 -
ఐటీ రిటర్నులకు డెడ్‌లైన్ జూలై 31
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలుకు గడువు పెంచే యోచనేదీ లేదని కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి తరుణ్ బజాజ్ స్పష్టం చేశారు. జూలై 31 ఆఖరు తేదీగా ఉంటుందని, చాలా మటుకు రిటర్నులు తుది గడువులోగానే వస్తాయని అంచనా వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను జూలై 20 వరకూ 2.3 కోట్ల పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయని, ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోందని బజాజ్ వివరించారు. కోవిడ్ పరిణామాలు, ఐటీ పోర్టల్‌లో సమస్యలు తదితర అంశాల కారణంగా గతేడాది డిసెంబర్ 31 వరకూ గడువు పెంచిన సంగతి తెలిసిందే. ఈసారీ అలాగే జరుగుతుందనే ఉద్దేశంతో కొందరు నెమ్మదిగా ఐటీఆర్‌లు దాఖలు చేయొచ్చులే అని భావిస్తుండవచ్చని బజాజ్ పేర్కొన్నారు. కానీ ఈసారి డెడ్‌లైన్‌ను పొడిగించే యోచనేదీ లేదన్నారు. ప్రస్తుతం రోజువారీ 15–18 లక్షల రిటర్నులు వస్తుండగా .. రాబోయే రోజుల్లో 25 లక్షల నుంచి 30 లక్షల వరకూ పెరగవచ్చని వివరించారు. -
మే నెలాఖరు వరకు పీఆర్సీ గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: గత ఏడాది నియమించిన పదో వేతన సవరణ సంఘం (పీఆర్సీ) గడువును మే 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్సీకి సాధారణంగా ఆరు నెలలే గడువు ఇస్తారు. కానీ ఈ పీఆర్సీకి ఏడాది గడువు ఇచ్చారు. 2013 మార్చి 13న పి.కె.అగర్వా ల్ పీఆర్సీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. పీఆర్సీ గడువు ఈ ఏడాది మార్చి 13తో ముగిసింది. సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె చేపట్టడం.. తదితర కారణాల వల్ల కసరత్తు పూర్తి చేయలేకపోయామని, మరో 3 నెలలు గడువు పెంచాలని అగర్వాల్ ప్రభుత్వానికి లేఖ రాశారు. సానుకూలంగా స్పం దించిన ప్రభుత్వం.. మే 31 వరకు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రపతి పాలన ఉన్నా కూడా.. ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు, వ్యక్తిగత కార్యదర్శులకు ప్రతులు పంపించినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. కానీ వాటిల్లో సీఎం ప్రస్తావన లేదు. ముఖ్యమంత్రి లేకుండా ఉపముఖ్యమంత్రి, మంత్రులు ఎలా ఉంటారనే విషయాన్ని పట్టించుకోలేదు. పీఆర్సీ, -
పీఆర్సీ గడువు పొడిగింపు!
ఒకటి..రెండు రోజుల్లో ఆదేశాలు వెలువడే అవకాశం సాక్షి, హైదరాబాద్: పదో వేతన సవరణ సంఘం(పీఆర్సీ) గడువును మరో 3 నెలలు పొడిగించాలన్న ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదముద్ర వేసినట్టు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో ఆదేశాలు వెలువడతాయని అధికారవర్గాల సమాచారం. పి.కె.అగర్వాల్ నేతృత్వంలోని పదో పీఆర్సీకి ఇచ్చిన గడువు శుక్రవారంతో ముగిసింది. కమిషన్‌కు సకాలంలో సిబ్బందిని ఇవ్వకపోవడం, రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె చేయడం ఫలితంగా గడువులోగా నివేదికను పూర్తి చేయలేకపోయింది. ‘‘ఉద్యోగుల సమ్మె వల్ల 2 నెలలు పని సాగలేదు. కమిషన్‌కు దాదాపు 1200 వినతులు, ప్రతి పాదనలు అందాయి. పూర్తి స్థాయి కసరత్తు డిసెంబర్ రెండోవారంలోనే మొదలైంది. ఉద్యోగ సంఘాలతో 800కుపైగా సమావేశాలు నిర్వహించాం. నివేదిక రూపకల్పనలో భాగంగా సుదీర్ఘ కసరత్తు చేయాల్సి వచ్చింది. గడువు పొడిగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. గడువు పొడిగింపు ఫైలు గవర్నర్ నుంచి ఇంకా కమిషన్‌కు చేరలేదు’’ అని పీఆర్సీ చైర్మన్ అగర్వాల్ ‘సాక్షి’కి చెప్పారు. -
11వరకు బీఎడ్ ప్రవేశ గడువు పెంపు
రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కళాశాలల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఈనెల 11వ తేదీ వరకు సంబంధిత కళాశాలలో చేరవచ్చని కన్వీనర్ ఆచార్య నిమ్మ వెంకటరావు ఓ ప్రకటనలో తెలిపారు. రెండో దశ కౌన్సెలింగ్‌లో ప్రవేశాలు పొంది ఇంకాచేరని విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని గడువు పెంచామన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కళాశాలల్లో చేరని విద్యార్థులు సంబంధిత హెల్ప్‌లైన్ కేంద్రాల నుంచి ఈనెల 11 నుంచి సర్టిఫికెట్లు పొందవచ్చు. 11 నుంచి ‘మను’లో బీఈడీ కౌన్సెలింగ్ హైదరాబాద్, న్యూస్‌లైన్: మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం(మను)లో బీఈడీ మొదటి సంవత్సరం(దూరవిద్య) విద్యార్థులకు ఈ నెల 11 నుంచి 28 వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు వర్సిటీ వర్గాలు శుక్రవారం తెలిపాయి. అభ్యర్థులు క్యాంపస్‌లోని స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ భవనానికి 11న మధ్యాహ్నం 2 గంటలకు హజరుకావాలని పేర్కొన్నాయి.