Extend Due Date ITR File Demand Income Tax Department Responds - Sakshi
Sakshi News home page

ITR Filing: ఐటీఆర్‌ ఫైలింగ్‌ గడువు పెంచండి.. ఐటీ శాఖ రెస్పాన్స్‌ ఇదే..

Published Sun, Jul 30 2023 5:15 PM | Last Updated on Sun, Jul 30 2023 5:32 PM

Extend Due Date ITR filer demands Income Tax Dept responds - Sakshi

ఐటీఆర్‌ ఫైలింగ్‌కు గడువు తేదీ సమీపించడంతో పన్ను చెల్లింపుదారులు రిటర్న్ ఫైలింగ్‌ హడావుడిలో ఉన్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం గడువు తేదీ పొడిగింపు ఉండబోదని ఐటీ శాఖ ఇదివరకే స్పష్టం చేసింది. అయితే ఐటీఆర్ ఫైలింగ్‌ సందర్భంగా ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో సమస్యలు ఎదురైనట్లు కొంతమంది పన్ను చెల్లింపుదారులు పేర్కొంటున్నారు. 

ఇదీ చదవండి Income Tax Refund: ట్యాక్స్‌ రీఫండ్‌ 12 గంటల్లోనే.. నమ్మబుద్ధి కావడం లేదా?

ఈ-ఫైలింగ్ పోర్టల్ గత ఐదు రోజులుగా సరిగా పనిచేయడం లేదంటూ ఓ ట్యాక్స్‌ పేయర్‌ ట్విటర్‌లో ఆదాయపు పన్ను శాఖ దృష్టికి తీసుకొచ్చారు. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో సమస్యల కారణంగా ఐటీఆర్ ఫైలింగ్‌ గడువును మారో 30 రోజుల పాటు పొడిగించాలని కోరారు. దీనిపై ఆదాయపు పన్ను శాఖ స్పందిస్తూ.. “ఈ-ఫైలింగ్ పోర్టల్ బాగానే పని చేస్తోంది. మీకు ఎదురైన నిర్దిష్ట సమస్యను వివరిస్తూ పాన్‌, మొబైల్ నంబర్, సమస్యకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌తో సహా orm@cpc.incometax.gov.inలో మాకు పంపించండి. మా బృందం మిమ్మల్ని సంప్రదిస్తుంది” అని పేర్కొంది. 

ఇదీ చదవండి  ITR filing: పన్ను రీఫండ్‌ను పెంచుకునేందుకు పంచ సూత్రాలు ఇవే.. 

ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోని డేటా ప్రకారం జులై 29 వరకు 5.73 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. వీటిలో 4.9 కోట్లకు పైగా రిటర్న్‌లను వాటిని దాఖలు చేసిన ట్యాక్స్‌ పేయర్లు వెరిఫై చేశారు. అలాగే 3.18 కోట్ల ఐటీఆర్‌లను ఆదాయపు పన్ను శాఖ ప్రాసెస్ చేసింది. ఆడిట్ అవసరం లేని ట్యాక్స్‌ పేయర్లందరూ జులై 31లోపు తమ రిటర్న్‌లను ఫైల్ చేయడం చాలా ముఖ్యం. గడువు తేదీ తర్వాత కూడా ఆలస్యంగా ఐటీఆర్‌ను ఫైల్ చేసే అవకాశం ఉంది. అయితే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234ఎఫ్ కింద రూ. 5000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇది రూ. 5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికైతే రూ. 1000. దీంతోపాటు గడువు తేదీలోపు ఐటీఆర్‌ను ఫైల్ చేయకపోతే అనేక ఇతర పరిణామాలు ఉంటాయి.

ఇదీ చదవండి  Beware of I-T notice: ఐటీ నోటీసులు రాకూడదంటే.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement