న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నుల దాఖలుకు చివరి రోజు అయిన సోమవారం పెద్ద సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు ముందుకు వచ్చారు. సోమవారం ఒక్కరోజే 36.91 లక్షల రిటర్నులు నమోదయ్యాయి. దీంతో గడిచిన ఆర్థిక సంవత్సరానికి దాఖలైన మొత్తం రిటర్నుల సంఖ్య 6.50 కోట్లకు చేరింది. వేతన జీవులు, ఆడిటింగ్ అవసరం లేని వారు రిటర్నులు దాఖలు చేసేందుకు జూలై 31 చివరి తేదీ కావడం గమనార్హం. గతేడాది జూలై 31 నాటికి దాఖలైన 5.83 కోట్ల ఐటీఆర్‌లతో పోలిస్తే 15 శాతం పెరిగినట్టు తెలుస్తోంది.
‘‘ఇప్పటి వరకు 6.50 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. ఇందులో 36.91 లక్షల ఐటీఆర్‌లు 31వ తేదీన సాయంత్రం 6 గంటల వరకు నమోదయ్యాయి’’అంటూ ఆదాయపన్ను శాఖ ట్వీట్ చేసింది.పన్ను ఎగవేతకు రెవెన్యూ యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలు, నిబంధనలను అనుసరించే వారు పెరగడంతో పన్ను చెల్లింపుదారుల బేస్ విస్తృతం అవుతున్నట్టు పన్ను నిపుణులు అభిప్రా యపడుతున్నారు. డేటా అనలైటిక్స్, ఇతర సమాచారం ఆధారంగా అధిక రిస్క్ కేసులను ఆదాయపన్ను శాఖ గుర్తించి, వారికి వ్యతిరేకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు చేపడుతుండడాన్ని ప్రస్తావిస్తున్నారు. నగదు డిపాజిట్లు, క్రెడిట్ కార్డు చెల్లింపులు, ప్రాపర్టీల కొనుగోలు, విక్రయాలు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో లావాదేవీల సమాచారాన్ని ఆదాయపన్ను శాఖ సమీకరించి, విశ్లేíÙస్తున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment