సాక్షి, హైదరాబాద్: గత ఏడాది నియమించిన పదో వేతన సవరణ సంఘం (పీఆర్సీ) గడువును మే 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్సీకి సాధారణంగా ఆరు నెలలే గడువు ఇస్తారు. కానీ ఈ పీఆర్సీకి ఏడాది గడువు ఇచ్చారు. 2013 మార్చి 13న పి.కె.అగర్వా ల్ పీఆర్సీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. పీఆర్సీ గడువు ఈ ఏడాది మార్చి 13తో ముగిసింది. సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె చేపట్టడం.. తదితర కారణాల వల్ల కసరత్తు పూర్తి చేయలేకపోయామని, మరో 3 నెలలు గడువు పెంచాలని అగర్వాల్ ప్రభుత్వానికి లేఖ రాశారు. సానుకూలంగా స్పం దించిన ప్రభుత్వం.. మే 31 వరకు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రపతి పాలన ఉన్నా కూడా.. ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు, వ్యక్తిగత కార్యదర్శులకు ప్రతులు పంపించినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. కానీ వాటిల్లో సీఎం ప్రస్తావన లేదు. ముఖ్యమంత్రి లేకుండా ఉపముఖ్యమంత్రి, మంత్రులు ఎలా ఉంటారనే విషయాన్ని పట్టించుకోలేదు.
పీఆర్సీ,