8 నుంచి ఏపీ ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ | AP edset counseling form 8th | Sakshi
Sakshi News home page

8 నుంచి ఏపీ ఎడ్‌సెట్ కౌన్సెలింగ్

Published Wed, Aug 3 2016 7:15 PM | Last Updated on Sat, Aug 18 2018 7:58 PM

AP edset counseling form 8th

రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో ప్రవేశానికి ఈ నెల 8 నుంచి ఏపీ ఎడ్‌సెట్-2016 కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను బుధవారం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఎడ్‌సెట్ అడ్మిషన్ల ప్రక్రియ వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఆరు హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు.

 

అభ్యర్థులు ఇందులో ఏ కేంద్రానికైనా వెళ్లి తమ సర్టిఫికెట్లను పరిశీలింప చేసుకోవచ్చు. ఎస్వీయూనివర్సిటీ(తిరుపతి), ఎస్కేయూ (అనంతపురం), జేఎన్‌టీయూ (కాకినాడ), ఆచార్య నాగార్జున యూనివర్సిటీ( గుంటూరు), అంబేద్కర్ యూనివర్సిటీ( శ్రీకాకుళం), ఆంధ్రాయూనివర్సిటీ( విశాఖపట్నం)లలో హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ఎడ్‌సెట్ కన్వీనర్ టి.కుమారస్వామి తెలిపారు. 8 వతేదీ గణితం, ఇంగ్లీషు, 9న ఫిజికల్ సైన్స్, బయాలజీ, 10 వతేదీ సోషియల్ సెన్సైస్ మెథడాలజీలకు సంబంధించిన సర్టిపికెట్‌ల పరిశీలన నిర్వహిస్తామన్నారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం మరుసటి రోజు అభ్యర్థులు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలని సూచించారు. ఈ ఆప్షన్స్ ఆధారంగా సీట్ల కేటాయిస్తామన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement