Andhra Pradesh EdCET
-
ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఈసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. పాలిటెక్నిక్ కోర్సు అనంతరం ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏపీ ఈసెట్) ఫలితాలను ఏపీ మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం విడుదల చేశారు. మొత్తం 98.37 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఆంధ్రప్రదేశ్ ఈసెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఏపీ ఈసెట్ ప్రవేశాలకు నోటిఫికేషన్
- జూన్ 29 నుంచి ధ్రువపత్రాల పరిశీలన - 30 నుంచి ఆప్షన్ల నమోదు... జూలై 5న సీట్ల కేటాయింపు సాక్షి, అమరావతి: ఏపీ ఈసెట్‌లో అర్హత సాధించిన (డిప్లొమా, బీఎస్సీ మేథ్స్) అభ్యర్థులకు ఇంజనీరింగ్,, ఫార్మా కాలేజీల్లో ప్రవేశాల కోసం రాష్ట్ర ఉన్నత విద్యామండలి బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. వీరు వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు వీలుగా 18 హెల్ప్‌లైన్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. వీరు ఒరిజినల్ ధ్రువపత్రాలను ఆయా కేంద్రాల్లో జూన్ 29 నుంచి పరిశీలింపచేసుకోవాలి. ధ్రువపత్రాల జిరాక్స్ పత్రాలను మాత్రమే కాలేజీల్లో అందించాలని కన్వీనర్ పండాదాస్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు రూ. 600, ఇతరులు రూ.1200 ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాలన్నారు. ఒకటవ ర్యాంకు నుంచి ఆరు వేల వరకు జూన్ 29న, 6,001 నుంచి 14 వేల వరకు జూన్ 30న, 14,001 నుంచి 22వేల వరకు జూలై ఒకటిన, 22,001 నుంచి చివరి ర్యాంకు వరకు జూలై 2న పరిశీలన చేస్తారు. దివ్యాంగులు ఇతర ప్రత్యేక కేటగిరీల వారు విజయవాడలోని బెంజ్సర్కిల్లో ఉన్న పాలిటెక్నిక్‌లోని కేంద్రంలో పరిశీనలకు రావాలి. అభ్యర్ధులు జూన్ 30 నుంచి జూలై 3న సాయంత్రం 6 గంటల వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ‘హెచ్‌టీటీపీఎస్://ఏపీఈసీఈటీ.ఎన్ఐసీ.ఐఎన్’ వెబ్సైట్లో ఆప్షన్లు ఇవ్వాలి. జూలై 5న సీట్ల కేటాయింపు వివరాలు వెబ్సైట్లో పొందుపర్చనున్నారు. -
ఏపీ ఎడ్‌సెట్-2016 కౌన్సెలింగ్ వాయిదా
తిరుపతి: రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో ప్రవేశానికి ఈ నెల 8 నుంచి ప్రారంభం కావాల్సిన ఏపీ ఎడ్‌సెట్-2016 కౌన్సెలింగ్ ప్రక్రియను వాయిదా వేసినట్లు ఎడ్‌సెట్ కన్వీనర్ టి.కుమారస్వామి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. కొత్తగా వచ్చిన బీఈడీ కళాశాలల వివరాలు, అడ్మిన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) నుంచి వివిధ కళాశాలలకు సంబంధించిన ఫీజు వివరాలు రావాల్సి ఉన్నందు వల్ల ఎడ్‌సెట్ కౌన్సెలింగ్‌ను ఈ నెల 16కు వాయిదా వేశామన్నారు. వివిధ హెల్ప్‌లైన్ సెంటర్లు, కళాశాలలు, అభ్యర్థులు కౌన్సెలింగ్ వాయిదా పడిన విషయాన్ని గుర్తించాలని సూచించారు. పూర్తి వివరాలను www.apedcet.apsche.ac.in వెబ్సైట్లో చూడాలని పేర్కొన్నారు. -
8 నుంచి ఏపీ ఎడ్‌సెట్ కౌన్సెలింగ్
రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో ప్రవేశానికి ఈ నెల 8 నుంచి ఏపీ ఎడ్‌సెట్-2016 కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను బుధవారం వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఎడ్‌సెట్ అడ్మిషన్ల ప్రక్రియ వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఆరు హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ఇందులో ఏ కేంద్రానికైనా వెళ్లి తమ సర్టిఫికెట్లను పరిశీలింప చేసుకోవచ్చు. ఎస్వీయూనివర్సిటీ(తిరుపతి), ఎస్కేయూ (అనంతపురం), జేఎన్టీయూ (కాకినాడ), ఆచార్య నాగార్జున యూనివర్సిటీ( గుంటూరు), అంబేద్కర్ యూనివర్సిటీ( శ్రీకాకుళం), ఆంధ్రాయూనివర్సిటీ( విశాఖపట్నం)లలో హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ఎడ్‌సెట్ కన్వీనర్ టి.కుమారస్వామి తెలిపారు. 8 వతేదీ గణితం, ఇంగ్లీషు, 9న ఫిజికల్ సైన్స్, బయాలజీ, 10 వతేదీ సోషియల్ సెన్సైస్ మెథడాలజీలకు సంబంధించిన సర్టిపికెట్ల పరిశీలన నిర్వహిస్తామన్నారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం మరుసటి రోజు అభ్యర్థులు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలని సూచించారు. ఈ ఆప్షన్స్ ఆధారంగా సీట్ల కేటాయిస్తామన్నారు. -
ఆగస్టు 8 నుంచి ఎపీ ఎడ్‌సెట్ కౌన్సెలింగ్
ఆగస్టు 8 నుంచి ఎపీ ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ యూనివర్సిటీక్యాంపస్(తిరుపతి): రాష్ట్రంలో బీఈడీ కళాశాలలో ప్రవేశానికి ఆగస్టు 8 నుంచి ఏపీ ఎడ్‌సెట్ –2106 వెబ్ కౌన్సెలింగ్ప్రక్రియ నిర్వహించనున్నట్టు ఎడ్సెట్కన్వీనర్ టి.కుమారస్వామి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా నిర్ణయించినట్టు ఈనెల చివరి వారంలో జరగాల్సిన కౌన్సెలింగ్‌ను ఆగస్టు 8వతేదికి వాయిదా వేశామన్నారు. రాష్ట్రంలోని వివిధ బీఈడీ కళాశాలల వివరాలను సంబంధిత యూనివర్సిటీలు పంపకపోవడం, కొన్ని కళాశాలలు పీ రెగ్యులేటరీ కమిషన్‌ను సంప్రదించకపోవడంతో కౌన్సిలింగ్వాయిదా పడిందన్నారు. ఆగస్టు 8 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. 8, 9, 10 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన, 9, 10, 11 తేదీల్లో వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. 16వతేది సీట్ల కేటాయింపు పూర్తి చేసి 17 నుంచి తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. కౌన్సెలింగ్ రోజుకు పీ రెగ్యులేటరీ కమిషన్‌ను సంప్రదించని కళాశాలలకు అడ్మిషన్ ప్రక్రియ నిలిపివేస్తామని చెప్పారు. -
ఏపీ ఈసెట్ కు ఏర్పాట్లు పూర్తి
-ప్రిలిమినరీ ‘కీ’ని ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం ఈసెట్ వెబ్సైట్లో ఉంచుతారు. -మే 16న ఫలితాలతో పాటు ఫైనల్ ‘కీ’ విడుదల చేసే అవకాశముంది. అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీఈసెట్)- 2016ను సోమవారం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కన్వీనర్ ఆచార్య పీఆర్ భానుమూర్తి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడు ప్రాంతీయ కేంద్రాల పరిధిలోని 68 కేంద్రాలలో పరీక్ష ఉంటుందని వెల్లడించారు. అనంతపురంలో 6, కాకినాడలో 16, విజయవాడలో 14, తిరుపతిలో 9, విశాఖపట్నంలో 13, గుంటూరులో 8, విజయనగరంలో 2 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 36,809 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. జేఎన్టీయూ (అనంతపురం)లో సోమవారం ఉదయం ఆరు గంటలకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఆచార్య హెచ్. వరదరాజన్ పరీక్ష సెట్ కోడ్‌ను విడుదల చేస్తారని వెల్లడించారు. -
మే 23న ఎడ్‌సెట్
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి) : రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే ఎడ్‌సెట్-2016ను మే 23న 18 పట్టణాల్లో నిర్వహించనున్నట్టు ఎడ్‌సెట్ కన్వీనర్ టి.కుమారస్వామి తెలిపారు. ఎస్వీ యూనివర్సిటీ ఏపీ ఎడ్‌సెట్-2016 ను నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రవేశ పరీక్ష కోసం ఫిబ్రవరి 10న నోటిఫికేషన్ విడుదల చేశామని తెలిపారు. ఓసీ, బీసీలు రూ.400, ఎస్సీ, ఎస్టీలు రూ.200 ఫీజు చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేయవచ్చునని తెలిపారు. ఏప్రిల్ 23వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. 2013-16 సంవత్సరాల్లో డిగ్రీ సిలబస్ ఆధారంగా ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. గణితం, ఫిజిక్స్, బయాలజీ, సోషల్ స్టడీస్, ఇంగ్లీషు సబ్జెక్టులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. మే 23న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, చిత్తూరు, తిరుపతి, కుప్పం, కడప, ప్రొద్దుటూరు, అనంతపురం, నంద్యాల, కర్నూలు పట్టణాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలను www.aped-cet-org వెబ్సైట్ నుంచి పొందవచ్చన్నారు. -
10 నుంచి ఏపీ ఎడ్‌సెట్ కౌన్సెలింగ్
తిరుపతి: బీఈడీ కళాశాలల్లో ప్రవేశానికి ఏపీ ఎడ్‌సెట్-2015 వెబ్ కౌన్సెలింగ్‌ను 10 నుంచి నిర్వహించనున్నట్టు ఎడ్‌సెట్ కన్వీనర్ టి.కుమారస్వామి మంగళవారం తెలిపారు. ఎస్కేయూ(అనంతపురం), ఎస్వీయూ(తిరుపతి), జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల(కాకినాడ), ఏఎన్‌యూ(గుంటూరు), అంబేద్కర్ యూనివర్సిటీ(శ్రీకాకుళం), ఏయూ ఇంజినీరింగ్ కళాశాల(విశాఖపట్నం)లో హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలన కోసం విద్యార్థులు సెంటర్లలో హాజరవ్వాలని ఆయన తెలిపారు. -
ఏపీ ఎడ్ సెట్ ఫలితాలు విడుదల
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్(ఏపీ) ఎడ్ సెట్ -2015 ఫలితాలను శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. ఉన్నతవిద్యామండలి చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి ఎడ్ సెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 94.91 శాతం ఉత్తీర్ణతతో 20,163 అర్హత సాధించినట్లు వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. బీఈడీ కోర్సును రెండేళ్లు చేయడం వల్లే ఎడ్ సెట్ కు ఆదరణ తగ్గినట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: -
ఈసెట్ ప్రాథమిక కీ విడుదల
అనంతపురం : రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 14 వ తేదీన నిర్వహించిన ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఈసెట్)-2015 ప్రాథమిక 'కీ'ని శనివారం విడుదల చేసినట్లు ఏపీ ఈ-సెట్ కన్వీనర్ ఆచార్య పీఆర్ భానుమూర్తి తెలిపారు. ఆన్సర్ కీ ని www.apecet.org అనే వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చునని సూచించారు. ఇందులో ఏమైనా సందేహాలుంటే apecet2015key@gmail.comకు గానీ, ఫ్యాక్స్ నెంబరు 08554-235678కు గానీ ఈ నెల 19వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు తెలియజేయాలని పేర్కొన్నారు. ఈ నెల 20న తుది 'కీ' విడుదల చేస్తామని వెల్లడించారు. -
మే 14వ తేదీన ఏపీ ఈసెట్
విశాఖపట్నం (ఆంధ్రా యూనివర్సిటీ) : ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2015ను గురువారం(మే 14) నిర్వహించనున్నట్లు ఆంధ్రా యూనివర్సిటీ కన్వీనర్ ఆచార్య పీఆర్ భానుమూర్తి మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు రీజనల్ సెంటర్లలోని 74 కేంద్రాలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. ఈ పరీక్షకు 39,248 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. గురువారం ఉదయం ఆరు గంటలకు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు జేఎన్టీయూ (అనంతపురం)లో ప్రశ్నపత్రాల కోడ్‌ను విడుదల చేస్తారని వెల్లడించారు. ఉదయం 9.15 గంటల నుంచి అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామన్నారు. ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. పరీక్షకు బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్ మాత్రమే వాడాలని సూచించారు. క్యాలికులేటర్లు, సెల్ఫోన్లు, డిజిటల్ వాచీలను అనుమతించబోమన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. మే 21, 22 వ తేదీల్లో ఫలితాలు ఏపీ ఈసెట్ రాత పరీక్ష ఫలితాలను ఈ నెల 21, 22 తేదీల్లో విడుదల చేయనున్నట్లు యూనివర్సిటీ కన్వీనర్ ఆచార్య పీఆర్ భానుమూర్తి తెలిపారు. 16న ప్రిలిమనరీ కీ, 20న ఫైనల్ కీని ఇస్తామన్నారు. -
ఏపీ ఎడ్‌సెట్ ఆన్లైన్ దరఖాస్తు గడువు పొడిగింపు
తిరుపతి : శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏపీ ఎడ్ సెట్-2015 దరఖాస్తుకు చివరి తేదీని ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 28వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు వీసీ ప్రొఫెసర్ రాజేంద్ర తెలిపారు. వర్సిటీలోని వీసీ చాంబర్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం, ఉనత్న విద్యామండలి ఆదేశాల మేరకు చివరి తేదీని పొడిగిస్తున్నట్టు చెప్పారు. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా తేదీని పొడిగించినట్టు ఆయన చెప్పారు. బీఏ, బీఎస్సీ, బీకాం, బీఈ, బీటెక్ అభ్యర్థులు.. బీఈడీ ప్రవేశ పరీక్ష కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జనరల్ విద్యార్థులు రూ.300, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.150 చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రూ.500 అపరాధ రుసుంతో మరో రెండు రోజులు (30 వ తేదీ వరకు) పొడిగించామన్నారు.