శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏపీ ఎడ్ సెట్-2015 దరఖాస్తుకు చివరి తేదీని ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 28వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు వీసీ ప్రొఫెసర్ డబ్ల్యూ రాజేంద్ర తెలిపారు.
తిరుపతి : శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏపీ ఎడ్ సెట్-2015 దరఖాస్తుకు చివరి తేదీని ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 28వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు వీసీ ప్రొఫెసర్ రాజేంద్ర తెలిపారు. వర్సిటీలోని వీసీ చాంబర్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రభుత్వం, ఉనత్న విద్యామండలి ఆదేశాల మేరకు చివరి తేదీని పొడిగిస్తున్నట్టు చెప్పారు. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా తేదీని పొడిగించినట్టు ఆయన చెప్పారు. బీఏ, బీఎస్‌సీ, బీకాం, బీఈ, బీటెక్ అభ్యర్థులు.. బీఈడీ ప్రవేశ పరీక్ష కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జనరల్ విద్యార్థులు రూ.300, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.150 చెల్లించి ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రూ.500 అపరాధ రుసుంతో మరో రెండు రోజులు (30 వ తేదీ వరకు) పొడిగించామన్నారు.