దీక్షకు సంఘీభావం తెలుపుతున్న వైఎస్సార్ సీపీ చిత్తూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి
చిత్తూరు, యూనివర్సిటీ క్యాంపస్: నిరుద్యోగ భృతి, ఉద్యోగ నోటిఫికేషన్ల జారీలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగడుతూ ఎస్వీయూలో మంగళవారం ప్రారంభమైన 48 గంటల నిరుద్యోగ దీక్షకు జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగులు, యువత స్వచ్ఛం దంగా తరలివచ్చింది. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు ఎస్వీయూలో వైఎస్సార్ విద్యార్థి విభాగం తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్‌చార్జి వి.హరిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ దీక్ష ఏర్పాటు చేశారు. వైఎస్సార్ సీపీ చిత్తూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీని వాసులు ప్రారంభించిన ఈ దీక్షకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తిరుపతి మాజీ ఎంపీ వి.వరప్రసాద్‌రావు సంఘీభావం ప్రకటిం చారు. ముందుగా ఎస్వీయూ గోల్డన్ జూబ్లీ ఆర్చి ఎదురుగా ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి, అనంతరం దీక్ష శిబిరంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా జంగా లపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు ఇంటికో ఉద్యోగం, రూ.2 వేల భృతి ఇస్తానని హామీ ఇచ్చి నిలుపుకోలేదన్నారు. ప్రస్తుతం ఎన్నికల వస్తున్నందున కేవలం రూ.వెయ్యి భృతి ప్రకటించారని, అది కూడా అనేక ఆంక్షలు పెట్టి యువతకు దక్కకుండా మరోసారి మోసం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు చేస్తున్న మోసాలకు యువత పుల్‌స్టాప్ పెట్టాలని కోరారు. విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సలాం బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఉంటే కేవలం 2 లక్షల మందికి మాత్రమే రూ.వెయ్యి నిరుద్యోగ భృతి ఇస్తున్నారన్నారు.
షరతులు లేకుండా భృతి ఇవ్వాలి
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఏపీ సీఎం ఇప్పటివరకు బాకీ పడిన నిరుద్యోగ భృతిని ఏడాదికి రూ.24 వేల చొప్పున ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలని కోరారు. అబద్దాలు, మోసాల్లో సీఎం దిట్ట అన్నారు. నా లుగున్నరేళ్లగా భృతి ఇవ్వకుండా మోసం చేసిన బాబు ఇప్పుడు రూ.వెయ్యి భృతి మాత్రమే అనేక ఆంక్షలతో ఇవ్వడం దారుణమన్నారు. మాజీ ఎంపీ వరప్రసాద్‌రావు మాట్లాడుతూ ఏపీ సీఎం తనయుడు లోకేష్ రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తల సదస్సు జరిగిన అనంతరం రూ.లక్ష కోట్ల పెట్టుబడి, 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారని, అయితే పెట్టబడులు ఎక్కడ వచ్చాయి?, ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించా రు. కార్యక్రమంలో ద్రవిడ యూనివర్సిటీ మాజీ వీసీ రత్నయ్య, పెద్దిరెడ్డి సుధీర్‌రెడ్డి, చిత్తూరు, తిరుపతి, రాజంపేట పార్లమెంట్ నియోజక వర్గాల విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెవి రెడ్డి మోహిత్‌రెడ్డి, జే.సుధీర్, కిషోర్ దాస్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.ఓబుళరెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్.రాజశేఖర్ రెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే.సంగీత, నాయకులు తిరుమల ప్రకాశ్, మురళీ ధర్, క్యాంపస్ అధ్యక్షుడు హేమంత్ కుమార్ రెడ్డి, తేజ, నవీన్, శివకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment