Unemployment benefit
-
నిరుద్యోగ భృతి ప్రతిపాదనే లేదు
సాక్షి, అమరావతి: జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతిపై గంపెడు ఆశలు పెట్టుకున్న యువతకు చంద్రబాబు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. డీఎస్సీ, గ్రూప్స్ పరీక్షలన్నింటినీ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ యువత భవిష్యత్‌తో చెలగాటం ఆడుతున్న బాబు ప్రభుత్వం.. ఎన్నికల్లో ఇచి్చన నిరుద్యోగ భృతి హామీ అమలును సైతం గాలికి వదిలేసింది. నిరుద్యోగులకు భృతి అందించే ప్రతిపాదనే ప్రస్తుతం ప్రభుత్వం వద్ద లేదని శుక్రవారం శాసన సభ సాక్షిగా ప్రభుత్వం రాతపూర్వకంగా తేల్చి చెప్పింది. పైగా రాష్ట్రంలో కేవలం 4.46 లక్షల మంది నిరుద్యోగులే ఉన్నట్టు కాకి లెక్కలు చూపించింది. ప్రభుత్వం ఇచ్చిన సమాధానంపై నిరుద్యోగ యువత భగ్గుమంటున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే వరకూ నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని కూటమి మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. తీరా గద్దెనెక్కి ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ ఆ హామీ అమలుపై ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో సైతం నిరుద్యోగ భృతికి ఎటువంటి కేటాయింపులు చేయలేదు. కొత్త ఉద్యోగాల భర్తీపై స్పష్టతా ఇవ్వలేదు. వాస్తవానికి రాష్ట్రంలో 1.60 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ఇంటికొక్కరు చొప్పున వేసుకున్నా నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతికి రూ.4,800 కోట్లు ఖర్చు చేయాలి. అంటే ఏడాదికి సుమారు రూ.57,600 కోట్లు నిరుద్యోగుల సంక్షేమానికి ఖర్చవుతుంది. అయితే రాష్ట్రంలో 4.46 లక్షల మంది నిరుద్యోగులే ఉన్నట్టు బాబు ప్రభుత్వం వెల్లడించడం యువతను మోసగించడమేనని పలువురు చెబుతున్నారు.ఉచిత బస్సు మరింత దూరం..!మరోవైపు రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలను కూడా బాబు ప్రభుత్వం దగా చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ హామీల్లో పేర్కొన్నారు. అధికారం చేపట్టి ఐదు నెలలు దాటినా ఈ హామీ అమలుపై కాలయాపన చేస్తున్నారు. దీనిపై ఇంకా మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని శాసన సభలో రాతపూర్వకంగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం, మార్గదర్శకాలు, విధివిధానాలు అంటూ హామీ అమలును దాటవేస్తున్నారు. ఇప్పుడూ ఇదే చెప్పడంపై మహిళాలోకం ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. మహిళలకు బస్ ప్రయాణం కోసం ఆర్టీసీలో ప్రత్యేక వ్యవస్థ అవసరం లేదని, ఉన్న బస్సుల్లో ఉచిత ప్రయాణ అవకాశం కల్పించడానికి మార్గదర్శకాల రూపకల్పన అంటూ ఇంకెన్నాళ్లు కాలయాపన చేస్తారని నిలదీస్తున్నారు. -
రూ.3,000 నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉద్యోగాలు, ఉపాధి కోసం యువత ఎదురు చూస్తోంది. జాబ్ క్యాలెండర్‌పై గంపెడాశలు పెట్టుకుంది. చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకు ఇంటికో ఉద్యోగం వచ్చేంత వరకు ‘నిరుద్యోగ భృతి’ ఇవ్వాలని కోరుతోంది. అధికారంలోకి వచ్చి నెల దాటినా, నిరుద్యోగ భృతి గురించి మాట్లాడటం లేదని, ఎప్పటి నుంచి ఇస్తారో స్పష్టంగా చెప్పాలని ఆంధ్రప్రదేశ్‌లోని 1.60 కోట్ల కుటుంబాల్లోని యువత డిమాండ్ చేస్తోంది. 2014లో చంద్రబాబు ఇంటికొక ఉద్యోగం లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను నట్టేట ముంచారు. అప్పట్లో చంద్రబాబు విసిరిన మాయ వలలో చిక్కుకుని ఐదేళ్లూ నిరుద్యోగ యువత విలవిల్లాడిపోయారు. మరోసారి అలాంటి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైనా నిరుద్యోగ భృతిపై నోరు మెదపక పోవడం నిరుద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో మూడుసార్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు.. మళ్లీ బూటకపు హామీలతోనే ఇప్పుడు నాలుగోసారి అధికారంలోకి వచ్చారు. కానీ, ఆయన రాజకీయ జీవితంలో చెప్పింది చెప్పినట్లు ఏనాడు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన దాఖలాలు లేవు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, హామీలను అమలు చేయడం ఆయన డిక్షనరీలోనే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో భారీ సంఖ్యలో యువత ప్రభుత్వ కొలువులు వస్తాయని.. లేదంటే నిరుద్యోగ భృతి అందుతుందనే ఆశతో ఎదురు చూస్తోంది. చాలామంది చిన్నా చితకా పనులు వదిలేసి.. స్టడీ సర్కిళ్లు, లైబ్రరీల బాట పడుతున్నారు. కుటుంబానికి ఆర్ధిక భారంగా మారినప్పటికీ ప్రభుత్వం ఇచ్చే భృతితో ఎలాగోలా నెట్టుకు రావచ్చనే ఉద్దేశంతో పోటీ పరీక్షల్లో రాణించేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. సూపర్ సిక్స్ టాప్‌లో భృతి ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన తమ ఉమ్మడి మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్‌లో నిరుద్యోగులకు పెద్ద పీట వేస్తున్నట్టు ప్రకటించారు. నిరుద్యోగులందరికీ ఉద్యోగాల కల్పనతో పాటు ఉద్యోగం వచ్చేంత వరకు ప్రతి ఒక్కరికీ నెలకు రూ.3 వేల భృతి ఇస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల దాటినప్పటికీ ఆ ఊసే ఎత్తట్లేదు. మెగా డీఎస్సీ పేరుతో నామమాత్రంగా ప్రకటించిన 16 వేల పోస్టుల భర్తీ కాస్తా నత్త నడకను తలపిస్తోంది. డిగ్రీ అర్హతతో ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్స్ పరీక్షలతో పాటు ఇంటర్మీడియట్, పదవ తరగతి అర్హతతో ప్రభుత్వ కొలువుల కోసం పోటీపడే వారు లక్షల్లో ఉన్నారు. వీరితో పాటు ప్రభుత్వ కొలువు సాధించేందుకు ఇంకా వయస్సు ఉండి.. ఆర్ధిక తోడ్పాటు లేక పోటీ పరీక్షలను పక్కన పెట్టి ఊళ్లలో వ్యవసాయం, పట్టణాల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్న వారందరినీ కలుపుకుంటే దాదాపు ప్రతి ఇంటిలో ఒక నిరుద్యోగి కనిపిస్తున్న పరిస్థితి. ప్రభుత్వ కొలువుల కోసం కష్టపడి ఆగిపోయిన వారందరూ కూటమి ప్రభుత్వ నిరుద్యోగ భృతి హామీతో తిరిగి పోటీ పరీక్షల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ప్రభుత్వం ఈ హామీని అమలు చేయడంలో జాప్యం చేస్తుండటంతో నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోచింగ్‌కు రూ.లక్షల్లో ఫీజులు ప్రభుత్వ కొలువుల కోసం యువత శిక్షణ తీసుకునేందుకు రూ.లక్షల్లో ఫీజులు కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. కుటుంబానికి ఆర్ధిక భారం అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపనతో అప్పులు చేస్తున్నారు. పేరొందిన సంస్థల్లో గ్రూప్ 1 శిక్షణ, స్టడీ మెటీరియల్ కోసమే రూ.లక్షలు, సాధారణ శిక్షణ కేంద్రాల్లో రూ.50 వేల వరకు ఖర్చువుతోంది. గ్రూప్–2కు అయితే రూ.30 వేల నుంచి రూ.70 వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. డీఎస్సీ, కానిస్టేబుల్, ఇతర పోస్టులకు శిక్షణ తీసుకోవాలన్నా రూ.వేలల్లోనే ఫీజులు ఇవ్వాల్సిన పరిస్థితి. వీటికి తోడు భోజనం, హాస్టల్ ఖర్చుల నిమిత్తం తక్కువలో తక్కువ నెలకు రూ.6 వేలకుపైగా ఖర్చవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిరుద్యోగులు నోటిఫికేషన్ల విడుదలతో పాటు, ప్రభుత్వం ఇస్తామన్న భృతి కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. గతంలో చేసినట్టే చేస్తారా? రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేపట్టే వరకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రధాన హామీగా పదే పదే ప్రచారం చేసుకుంది. అయితే అధికారంలోకి రావడం.. పాలనను ప్రారంభించడంతో పాటు.. నిత్యం ముఖ్యమంత్రి, మంత్రులు శాఖల వారీగా సమీక్షలు మొదలెట్టారు. కానీ, నిరుద్యోగులకు ఇవ్వాల్సిన భృతిపై ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. నిరుద్యోగ భృతి అమలుపై కనీసం విధి విధానాలు, మార్గదర్శకాల జారీపై కసరత్తు కూడా ప్రారంభించ లేదు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2014–19లో నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి.. ఐదేళ్లు పబ్బం గడుపుకుని మొండి చెయ్యి చూపించారు. అప్పట్లో కూడా ఇంటికో ఉద్యోగం అని ఊదరగొట్టి నిరుద్యోగులను నట్టేట ముంచారు. నిరుద్యోగ భృతికి 2017–18లో రూ.500 కోట్లు కేటాయింపులు చేసినప్పటికీ, రూపాయి కూడా ఇవ్వలేకపోయారు. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఒత్తిడి తేవడంతో ఎన్నికలకు ముందు యువ నేస్తం పేరుతో తూతూ మంత్రంగా డ్రామా నడిపించారు. విధివిధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి సవాలక్ష ఆంక్షలు విధించి నిరుద్యోగ భృతి ఇచ్చే వారి సంఖ్యను భారీగా కుదించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ చదివిన వారు అనర్హులని తేల్చడంతో పాటు 22 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలలోపు డిగ్రీ చదివిన వారికే భృతి వర్తిస్తుందని మెలిక పెట్టారు. కొన్ని చోట్ల కారు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారికి, 120 సీసీ ద్విచక్ర వాహనం ఉన్న వారిని సైతం పక్కన పడేశారు. ఇలా వడపోత అనంతరం తొలుత 12 లక్షల మందికి పైగా నిరుద్యోగ భృతికి అర్హులుగా తేల్చగా.. ఆ తర్వాత ఆ సంఖ్యను పది లక్షలకు కుదించారు. మళ్లీ అందులో 2.10 లక్షల మందే అర్హులంటూ.. 1.62 లక్షల మందికే ఇస్తామని.. దీనికి ఈ–కేవైసీ లింక్ పెట్టి కేవలం వేల సంఖ్యలో మాత్రమే నిరుద్యోగ భృతి ఇచ్చి మమ అనిపించారు. గతంలో ఇలా నిరుద్యోగ భృతి హామీని నీరుగార్చి.. ఉద్యోగాలను భర్తీ చేయకపోగా ఆరోగ్య మిత్రలను, ఫీల్డ్ అసిస్టెంట్లను, గోపాల మిత్రలను ఉద్యోగాల నుంచి తొలగించారు. ఈ అనుభవం దృష్ట్యా ఈ సారైనా నిరుద్యోగులు అందరికీ ఉద్యోగాలతో పాటు ఉద్యోగం వచ్చే వరకు భృతి ఇవ్వాలని నిరుద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వయో పరిమితిని గుర్తించాలి.. రాష్ట్రంలో ఏపీపీఎస్సీ పరీక్షలకు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు వయో పరిమితి 42 ఏళ్లు, రిజర్వడ్ కేటగిరి అభ్యర్థులకు మరో 5 ఏళ్లు అదనంగా ఉంటుంది. ఈ క్రమంలో 40 ఏళ్లు దాటినప్పటికీ ప్రభుత్వ కొలువు సాధించాలనే సంకల్పంతో చాలా మంది ఇప్పటికే పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతూ, విజయం కూడా సాధిస్తున్నారు. ఏపీపీఎస్సీ వయో పరిమితి ఇలా ఉంటే.. గతంలో చంద్రబాబు ప్రభుత్వం దీనిని పరిగణనలోకి తీసుకోకుండా కేవలం 22–35 ఏళ్ల వయసు్కలు మాత్రమే భృతికి అర్హులని ప్రకటించడంతో చాలా మంది నష్టపోయారు. ఇంటర్ చదువుకున్న వారు కూడా ఏదో ఒక పోటీ పరీక్షకు సన్నద్ధం అవుతారు. డిప్లొమా చేసిన వారి వయసు కూడా 19 ఏళ్ల లోపుగానే ఉంటుంది. వీళ్లందరిని కూడా గతంలో గుర్తించక పోవడం నిరుద్యోగుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. దేశ రాజకీయ చరిత్రలో చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టినట్టు మరే నాయకుడూ చేసి ఉండరు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసి, మరోసారి అధికారంలోకి వచ్చిన ఈయన పాలనలో ఉద్యోగాల భర్తీ అనేది కనిపించదు. 2009 ఎన్నికల్లో లక్షల్లో ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి అని హామీలు గుప్పిస్తే ప్రజలు విశ్వసించలేదు. రాష్ట్ర విభజన సమయంలో 2014లో 600కు పైగా ఇచ్చిన హామీల్లో నిరుద్యోగ భృతిని చేర్చి అధికారంలోకి వచ్చారు. కానీ, ఐదేళ్లు అధికారం అనుభవించి ఎన్నికల దగ్గరకు వచ్చే సరికి యువ నేస్తం అంటూ మభ్యపెట్టారు. తాజాగా 2024లోనూ నిరుద్యోగ పల్లవి అందుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అండ్ కో అసలు ఉద్యోగాల ఊసే ఎత్తకపోవడం గమనార్హం. నిరుద్యోగ భృతిపై స్పష్టత ఇవ్వాలి జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. గతంలో మాదిరి కాకుండా తక్షణమే భృతిని ప్రకటించాలి. ఒక్క నెల నోటిఫికేషన్ ఆలస్యమైనా లక్షలాది మంది నిరుద్యోగులు వయో పరిమితి దాటి ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత కోల్పోతారు. యువగళంలో లోకేశ్.. లక్షల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. టీడీపీ 2014–19లో నోటిఫికేషన్లు ఇచ్చి కోర్టుల్లో కేసులు వేయించి అడ్డుకుని నిరుద్యోగులతో ఆడుకుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి వస్తే నిరుద్యోగుల ఉద్యమ సత్తాను చూడాల్సి వస్తుంది. – వై.రామచంద్ర, నిరుద్యోగ ఐక్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు తక్షణం నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే గతంలో మాదిరి నిరుద్యోగులను మోసం చేయకుండా జనరల్ అభ్యర్థులతో సహా అందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే. ఉద్యోగాలు కల్పించే వరకు ఆర్ధిక సాయంగా భృతి ఇస్తే నిరుద్యోగులకు, వారి కుటుంబాలకు ఎంతో తోడ్పాటు ఇచ్చినట్టు అవుతుంది. ఈసారి అమలు చేయబోయే నిరుద్యోగ భృతి కనీసం 40 ఏళ్లు దాటి పోటీ పరీక్షలు రాసేందుకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇవ్వాల్సిందే. – సమయం హేమంత్ కుమార్, ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు నిరుద్యోగుల ఊసే ఎత్తట్లేదు ప్రభుత్వం ఏర్పడి నెల గడుస్తున్నా నిరుద్యోగుల ఊసే ఎత్తట్లేదు. నిరుద్యోగ భృతి హామీ అయితే ఇచ్చారు గానీ అమలుపై ధీమా లేకుండా చేస్తున్నారు. అసలు నిరుద్యోగ భృతి అమలు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా? లేకుంటే ఎప్పటిలానే యూటర్న్ తీసుకుంటారా? నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను విస్మరిస్తే ఆ ప్రభావం రాష్ట్రంలోని 1.70 కోట్ల కుటుంబాలపై నేరుగా పడుతుంది. – మేడూరి నవీన్ దాస్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లా కాలేజ్, విశాఖపట్నం జాబ్ క్యాలెండర్ ఎప్పుడు? ఏపీలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. జాబ్ క్యాలెండ్ కంటే ముందు పాత నోటిఫికేషన్లను పూర్తి చేయాలి. ఈలోగా నిరుద్యోగులు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రతి నెలా రూ.3 వేల భృతి వెంటనే అమలు చేయాలి. దీని స్పష్టమైన తేదీలను ప్రకటించాలి. – కొనిగపాగ అనిల్ బాబు, విజయవాడవీటి సంగతేంటి బాబూ?వైఎస్సార్ రైతు భరోసాఈ పథకం కింద ఏటా రూ.13,500 చొప్పున గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో సగటున ఏటా 51,13,249 మంది రైతులకు రూ.6,857.63 కోట్లు.. ఐదేళ్లలో రూ.34,288.17 కోట్లు ఇచ్చింది. కూటమి హామీ మేరకు ఏటా రూ.20 వేల చొప్పున ఎప్పుడు ఇస్తారు?వైఎస్సార్ మత్స్యకార భరోసా గత ప్రభుత్వం వైఎస్సార్ మత్స్యకార భరోసాను రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచి, ఏటా సగటున 1,07,602 మందికి రూ.107.60 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.538.01 కోట్లు ఇచ్చింది. మీరు ఇచ్చిన హామీ మేరకు ఏటా రూ.20 వేల చొప్పున ఎప్పటి నుంచి ఇస్తారు?వైఎస్సార్ సున్నా వడ్డీఈ పథకం కింద గత ప్రభుత్వంలో ఏటా సగటున 96,70,720 మంది అక్కచెల్లెమ్మలకు రూ.1,242.26 కోట్ల చొప్పున నాలుగేళ్లలో 4,969.05 కోట్లు ఇచ్చింది. ఈ పథకం సొమ్మును మీరు ఎప్పుడు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు?జగనన్న విద్యా, వసతి దీవెనఈ పథకం కింద (పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్), వసతి దీవెన పథకాల కింద వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో సగటున 27 లక్షల మంది విద్యార్థులకు రూ.18,663.44 కోట్లు అందజేసింది. విద్యార్థులకు మీరు ఈ సాయాన్ని ఎప్పుడు అందిస్తారు?అమ్మ ఒడి పథకంఈ పథకం కింద రూ.15 వేలు చొప్పున సగటున 42.62 లక్షల మంది తల్లులకు నాలుగేళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.26,067.28 కోట్లు ఇచ్చింది. ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ ఏటా రూ.15 వేల చొప్పున ‘తల్లికి వందనం’ కింద కోటికి పైగా పిల్లలకు మీరు ఎప్పుడు ఈ సాయం అందిస్తారు? -
నిరుద్యోగులకు రూ.3,000
బనశంకరి: కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డిగ్రీ చదివిన వారికి నెలకు రూ.3,000, డిప్లొమా చేసిన వారికి రూ.1,500 నిరుద్యోగ భృతి ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. ‘‘యువతకు ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలిస్తాం. 2.5 లక్షల ప్రభుత్వోద్యోగాల ఖాళీలను భర్తీచేస్తాం’ అని హామీ ఇచ్చారు. సోమవారం బెళగావిలో ‘యువక్రాంతి’ బహిరంగ సభ ఆయన ప్రసంగించారు. కర్ణాటకలో పాలక బీజేపీని కాంగ్రెస్ నేతలు ఐక్యమత్యంతో కలిసి ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. ‘‘బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం 40 శాతం కమిషన్లు మరిగింది. దేశంలో అత్యంత అవినీతిమయ సర్కార్’’ అని ఆరోపించారు. ‘‘దేశం ఒకరిద్దరి సొత్తు కాదు. అదానీలది అస్సలు కాదు. కానీ బీజేపీ స్నేహితులైన కొద్దిమందికే సర్వం దక్కుతున్నాయి. ఇది అవినీతికి దారితీస్తుంది’’ అని రాహుల్ ఆరోపించారు. గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళ ఇంటిపెద్దగా ఉన్న కుటుంబానికి నెలకు రూ.2,000 ఆర్థికసాయం, దారిద్య్ర రేఖ దిగువన ఉన్న కుటుంబాల్లో ప్రతీ సభ్యుడికి నెలకు 10 కేజీల ఉచిత బియ్యం ఇస్తామని ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ ఇప్పటికే మూడు హామీలు ప్రకటించింది. సోమవారం నాలుగో హామీ ఇచ్చింది. -
చేతకాకపోతే రాజీనామా చెయ్
నల్లగొండ టూటౌన్/నల్లగొండ: ‘రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి. 3.81 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 54 లక్షల మంది ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్నరు.. కార్పొరేషన్ ద్వారా రుణాల కోసం 8 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నరు.. ఇంటికో ఉద్యోగం ఇచ్చేవరకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఈ హామీలు నెరవేర్చడం చేతకాకపోతే ముఖ్యమంతి పదవికి కేసీఆర్ రాజీనామా చేసి దళితుడిని సీఎంగా చేయాలి’ అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో మంగళవారం ఆమె నిరుద్యోగ నిరాహారదీక్ష చేశా రు. షర్మిల మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా సీఎం కేసీఆర్ తన ఇంట్లో వందశాతం ఉద్యోగాలు ఇచ్చుకున్నా రని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన కేసీఆర్ 30 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించి రోడ్డున పడేశారని అన్నారు. దళితులకు మూడెకరాల చొప్పున ఇస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న సీఎం కేసీఆర్.. తాను హామీ ఇవ్వలేదని ఇటీవల శాసనసభలో అనడం దుర్మార్గమని, తరచూ యశోదా ఆసుపత్రికి వెళ్లే మీరు మతిమరుపు చికిత్స కూడా చేయించుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల భూములపై టీఆర్ఎస్ నేతల కన్ను పడిందని వైఎస్ షర్మిల అన్నారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ వద్ద మీడియాతో మాట్లాడుతూ వర్సిటీ భూములపై కన్నెసి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల ఖాళీలను భర్తీ చేయకుండా వాటిని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. -
నిరుద్యోగులకు శుభవార్త..
సాక్షి, హైదరాబాద్: కరోనా కష్టకాలంలో నిరుద్యోగులకు ఓ శుభవార్త. రాష్ట్ర బడ్జెట్లో వారికి సంబంధించిన ఓ కొత్త అంశం చేరబోతోంది. అదే.. నిరుద్యోగభృతి. ప్రభుత్వం నిరుద్యోగభృతి చెల్లింపునకు సిద్ధమవుతోంది. వచ్చే రాష్ట్ర వార్షిక బడ్జెట్ అంచనాల్లో నిరుద్యోగభృతికి నిధులు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలిసారిగా నిరుద్యోగభృతి పద్దు కింద రూ.5 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్లను బడ్జెట్లో ప్రతిపాదించే అవకాశాలున్నాయని ఆర్థికశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. నిరుద్యోగులకు ప్రతినెలా రూ.3,016 చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచి్చన విషయం తెలిసిందే. ఎన్నికల తర్వాత ప్రభుత్వం దీని గురించి పట్టించుకోకపోవడంతో రెండేళ్లుగా ఈ హామీ మరుగునపడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగభృతి చెల్లించనుందని, త్వరలో దీనిపై సీఎం కేసీఆర్ ఓ ప్రకటన చేస్తారని ఇటీవల రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు ప్రకటన చేయడంతో ఈ హామీ మళ్లీ తెరపైకి వచ్చింది. నిరుద్యోగ భృతిపై లక్షలమంది నిరుద్యోగులు ఆశలు పెట్టుకుని ఉన్నారు. వీరిలో ఎంతమంది నిరుద్యోగభృతికి అర్హులు? ఎవరు కాదు? అన్న ప్రశ్నలకు ప్రభుత్వం రూపొందించనున్న విధివిధానాల్లో జవాబు లభిస్తుంది. విధివిధానాల రూపకల్పన, బడ్జెట్లో నిధుల కేటాయింపు తదితర అంశాలపై త్వరలో సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకుని ప్రకటన చేసే అవకాశముంది. ఆ తర్వాతే ఈ పథకం అమలుపై మరింత స్పష్టత రానుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. లక్షల్లో నిరుద్యోగులు రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది అన్న అంశంపై ప్రభుత్వం వద్ద స్పష్టమైన సమాచారం లేదు. అయితే, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, పీహెచ్డీ తదితర స్థాయిల్లో చదువులు చదివినా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించక దాదాపు 30 లక్షలమందికిపైనే నిరుద్యోగులున్నట్టు ప్రభుత్వవర్గాలు అంచనా వేస్తున్నాయి. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో 25 లక్షల మంది నిరుద్యోగులు వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ కింద తమ వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ వెబ్సైట్లో నమోదు చేసుకోని నిరుద్యోగులు లక్షల సంఖ్యలో ఉండనున్నారు. ఎన్నికల హామీ మేరకు నెలకు రూ.3,016 నిరుద్యోగ భృతి చెల్లిస్తే ఒక అభ్యరి్థకి ఏడాదికి రూ.36,192 వ్యయం కానుంది. ఈ లెక్కన ఏడాది కాలంలో 10 లక్షల మంది నిరుద్యోగభృతికి రూ.3,619.20 కోట్లు, 20 లక్షల మందికి చెల్లించడానికి రూ.7,238.4 కోట్ల నిధులను ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించాల్సి ఉంటుంది. తొలి ఏడాది గరిష్టంగా 20 లక్షల మంది లోపు నిరుద్యోగులకు భృతి చెల్లించే అవకాశాలున్నాయి. ఇందుకోసం బడ్జెట్లో ప్రభుత్వం గరిష్టంగా రూ.7 వేల కోట్ల వరకు కేటాయించవచ్చని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. -
ఏబీవీకేవైతో నిరుద్యోగ భృతి
సాక్షి, అమరావతి: విజయవాడకు చెందిన ప్రవీణ్ కుమార్ స్టీల్ పాత్రలు తయారు చేసే సంస్థలో ఉద్యోగి. లాక్‌డౌన్‌తో ఉపాధిని కోల్పోయారు. కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐ) ఆధ్వర్యంలోని పథకం ద్వారా నిరుద్యోగ భృతిని పొంది కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. ఇలా రాష్ట్రంలో వేలాది మంది ‘అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన (ఏబీవీకేవై)’తో లబ్ధి పొందారు. విపత్కర పరిస్థితుల్లో ఉపాధిని కోల్పోయిన కార్మికవర్గం కోసం కేంద్రం ఈ పథకాన్ని ఈఎస్ఐ ద్వారా అమలు చేస్తోంది. ఎవరైనా లబ్ధి పొందాలనుకుంటే డిసెంబర్ 31లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈఎస్ఐ పరిధిలోని కార్మికులకే ఇది వర్తిస్తుంది. ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేయాలంటే.. esic. in/ employee పోర్టల్‌లోకి లాగిన్ కావాలి. ఏబీవీకేవై క్లెయిమ్ పొందేందుకు ఉద్దేశించిన విభాగంపై క్లిక్ చేయాలి. ఆ దరఖాస్తులో నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కావాలనుకుంటున్నారో నమోదు చేసి సబ్మిట్పై క్లిక్ చేయాలి. నిరుద్యోగ కాల వివరాలను నమోదు చేసిన ఏబీ–1 ఫారం ప్రింట్ తీసుకొని అందులో ఉన్న విషయాన్ని రూ.20 స్టాంప్ పేపర్‌పై టైపు చేయించి నోటరీ చేయించాలి. దానిపై దరఖాస్తుదారు సంతకం చేయాలి. ఏబీ–2 అనే ఫారంనూ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. దానిపై సంబంధిత కంపెనీ యాజమాన్యం సంతకం తీసుకోవాలి. యాజమాన్యం ధ్రువీకరించకపోతే పీఎఫ్ నంబర్‌ను దరఖాస్తుపై వేసి ఈఎస్ఐ కార్యాలయంలో సమర్పించాలి. ఈఎస్ఐ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలు అఫిడవిట్‌కు జత చేయాలి. నిరుద్యోగ భృతి కావాలనుకున్న సమయంలో సంబంధిత దరఖాస్తుదారు ఉద్యోగం లేకుండా ఉండాలి. ఉద్యోగం పోగొట్టుకోవడానికి ముందు కనీసం రెండేళ్లపాటు ఆయా సంస్థల్లో పని చేసి ఉండాలి. ఏదో ఒక కారణంతో ఉద్యోగం పోగొట్టుకున్న వారు దీనికి అనర్హులు. ఉద్యోగులను తీసివేసినట్టు యాజమాన్యాలు ధ్రువీకరించకపోతే సమీపంలోని ఈఎస్ఐ కార్యాలయంలో అధికారిని సంప్రదించాలి. -
నిరుద్యోగ భృతి లేదు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది కూడా నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇచ్చే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తామిచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి ఐదేళ్ల సమయం ఉందని, వచ్చే ఏడాది లేదా ఆ తర్వాతి ఏడాది చూస్తామన్నారు. ఆర్థిక మాంద్యం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సాధ్యం కాదన్నారు. శనివారం మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సీఎం సమాధానమిస్తూ.. కేంద్రం తీసుకొచ్చిన చట్టం ప్రకారం రాష్ట్రంలో కూడా 10% ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. భైంసాలో అల్లర్లలో నిజమైన బాధితుల వివరాలు అందజేస్తే సాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణలో 70 శాతానికి పైగా బలహీనవర్గాల వారు ఉన్నందున రిజర్వేషన్ల పెంపుపై కేంద్రంతో పోరాడతామని, కేబినెట్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తామని చెప్పారు. పీఆర్సీ కమిటీ గడువు ముగిసినా కొనసాగిస్తామని, సర్వీసు బుక్స్, ఇతర అంశాలను పూర్తిస్థాయి లో ప్రక్షాళన చేయాల్సి ఉందని పేర్కొన్నారు. వేతన సవరణ కోసం పీఆర్సీ ఆగలేదని స్పష్టం చేశారు. గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణకు కేటాయించిన నీటిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటామన్నారు. గతం లో ఏపీ సీఎం కక్ష పూరితంగా వ్యవహరించారని, తాము మహారాష్ట్ర సీఎంతో ఏడుసార్లు భేటీఅయి ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. సంక్షేమ రంగంలో రూ.45 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఐకేపీ ఉద్యోగుల క్రమబద్ధీకరణ 57 ఏళ్ల వయసు దాటిని వారికి వృద్ధాప్య పింఛన్లు ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తామని తెలిపారు. నిరుద్యోగం ఉంటుందని, అయితే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వివిధ ఉద్యోగ అవకాశాలు పొందేలా ఎస్టీ, ఎస్సీ, బీసీలకు స్టడీసర్కిళ్ల ద్వారా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాగా, ఐకేపీ కింద ఉన్న మూడు, నాలుగు వందల మంది ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. త్వరలో కోటి ఎకరాలకు నీరు.. ఏడాదిన్నర రెండేళ్లలోనే పూర్తిస్థాయిలో పాలమూరు, సీతారామ, దేవాదుల, కాళేశ్వరం పూర్తిస్థాయిలో పూర్తయితే కోటి ఎకరాలకు నీటిని అందిస్తామన్నారు. రైతు బీమా గొప్ప పథకమని, ఏ రైతు ఏ కారణంతో చనిపోయినా బీమా కల్పిస్తామని, ఈ పథకానికి ప్రీమియం మొత్తం రూ.600 కోట్ల నుంచి రూ.1,300 కోట్లకు పెరిగిందని, రైతుల సంఖ్య ఇంకా పెరిగినా ప్రభుత్వమే ఆ మొత్తాన్ని చెల్లిస్తుందని పేర్కొన్నారు. రైతు మరణించిన 10 రోజుల్లోగా అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు. బతికున్నంత కాలం ఉచిత కరెంట్ కేసీఆర్ బతికున్నంత కాలం రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని, రైతుబంధు, రైతుబీమా, కోటిఎకరాలకు నీరందించేలా నీటిపారుదల ప్రాజెక్టులు చేపడతామన్నారు. కల్తీలేని ఎరువులు,విత్తనాలు అందించేందుకు కఠినచర్యలు తీసుకుంటామని, కల్తీకి పాల్పడే దుర్మార్గులపై పీడీయాక్ట్ పెట్టి జైలుకు పంపుతామని తెలిపారు. మహిళల ఆత్మగౌరవానికి చిహ్నమైన డబుల్ బెడ్రూం ఇళ్లను 2.76 లక్షల మేర నిర్మాణం పూర్తిచేసి అందజేస్తామన్నారు. -
నిరుద్యోగ భృతి, క్యాష్‌బ్యాక్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. పార్టీ అధికారంలోకి వస్తే యువ స్వాభిమాన్ యోజన కింద నిరుద్యోగులకు నెలకు రూ. 5,000–7,500 వరకు నిరుద్యోగ భృతి ఇస్తామంది. కరెంటు, నీటిని ఆదా చేసే వినియోగదారులకు క్యాష్‌బ్యాక్ పథకాలు అమలు చేస్తామంది. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని ప్రకటించింది. బడ్జెట్లో 25 శాతం నిధులను కాలుష్యంపై పోరాటానికి, రవాణా సౌకర్యాలను మెరుగుపర్చడానికి కేటాయిస్తామని, 300 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందజేస్తామని తెలిపింది. 100 ఇందిరా క్యాంటీన్లను ఏర్పాటు చేసి రూ.15 కే భోజనం అందిస్తామని వెల్లడించింది. ఈ మేరకు ‘ఐసీ హోగీ హమారీ ఢిల్లీ’ పేరిట కాంగ్రెస్ నాయకులు తమ మేనిఫెస్టోను పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. -
‘మహా’ యువతకు కాంగ్రెస్ వరాలు
ముంబై: మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ యువతకు భారీ హామీలను ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు నెలకు రూ. 5,000 నిరుద్యోగ భృతి ఇస్తామని తెలిపింది. రాష్ట్రంలోని సంస్థల్లో 80 శాతం ఉద్యోగాలు స్థానిక యువతకే ఇస్తామని హామీ ఇచ్చింది. ఉన్నత విద్య చదివే యువతకు, ఇతర దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేవారికి స్కాలర్షిప్లు ఇస్తామని ప్రకటించింది. వికలాంగ యువత ఉన్నత విద్యకు అయ్యే మొత్తాన్ని తామే భరిస్తామని తెలిపింద. ‘మేలుకో మహారాష్ట్ర.. రేపటి కోసం ఇప్పుడే పనిచేయి’ అన్న ప్లాట్‌ఫాం కింద మూడు కోట్ల మంది యువత పాల్గొన్నారని, వారి ఆలోచన ప్రతిబింబమే తాము ప్రకటించిన యూత్ కాంగ్రెస్ మేనిఫెస్టో అని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యజీత్ తంబే తెలిపారు. యువతాభివృద్ధి మంత్రిత్వ శాఖ కింద యువతకు ప్రత్యేక మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. కఠినమైన డ్రగ్ చట్టాలు, విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం వంటివి కల్పిస్తామని హామీ ఇచ్చారు. లైఫ్‌స్టైల్ మేనేజ్మెంట్, సివిక్స్ వంటి సబ్జెక్టులను విద్యలో భాగం చేస్తామన్నారు. -
ఉత్త డప్పే.. జాబేదీ?
సాక్షి, గూడూరు : ‘జాబు రావాలంటే.. బాబు రావాలంటూ ఎన్నికల్లో ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను మర్చిపోయారు. కొత్త ఉద్యోగాల సృష్టి దేవుడెరుగు.. కనీసం ఖాళీ పోస్టులను భర్తీ చేయండని అడిగితే పోలీసులతో కొట్టిస్తున్నారు. కూలీనాలి చేసి మా తల్లిదండ్రులు మమ్మల్ని చదివించారు. కానీ ఉద్యోగాలు మాత్రం రావడం లేదు’ అంటూ నిరుద్యోగులు ఆక్రోశం వెలిబుచ్చారు. ‘పరిశ్రమల కోసం భూములిచ్చినా ఉపయోగం లేకపోయింది. నాయుడుపేట, తడ ప్రాంతాల్లో సెజ్‌లున్నా ఉద్యోగాలు రాలేదు. ఇప్పటికీ తల్లిదండ్రులపై ఆధారపడుతున్నాం. నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు చివరకు అదికూడా సక్రమంగా ఇవ్వలేదు’ అంటూ విరుచుకుపడ్డారు. ‘జాబు రావాలంటే బాబు గద్దె దిగాలి. మా బాగోగులు చూసే వారికే ఈ ఎన్నికల్లో పట్టం కడతాం’ అని స్పష్టం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు పెద్ద మసీదు సమీపంలోని రచ్చబండ వద్ద కూర్చొని ఉద్యోగ ప్రకటనల కోసం పత్రికలు తిరగేస్తున్న యువతను కదిలించగా వారి మనోగతాన్ని వెలుబుచ్చారు. ‘రాష్ట్రవ్యాప్తంగా 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భాళీగా ఉన్నాయి. ఏపీపీఎస్సీని పునరుద్ధరించని ఫలితంగా గ్రూప్ 1, 2 వంటి 25 వేల పోస్టులు భర్తీ కావట్లేదు. గ్రూప్ 4, ఎయిడెడ్ విద్యా సంస్థల్లోనూ చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పంచాయతీరాజ్ శాఖలో ఖాళీగా ఉన్న కార్యదర్శుల పోస్టులను, పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 10 వేల పోస్టులను భర్తీ చేయాలి’ అని డిమాండ్ చేశారు. ‘జాబు’ రాసి మరీ ఆత్మహత్య చంద్రబాబు హయాంలో నిరుద్యోగుల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందనే దానికి 2017 ఏప్రిల్ 17న విశాఖలో చోటుచేసుకున్న ఘటన సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. మర్రిపాలెంకు చెందిన నిరుద్యోగి పితాని శివదుర్గా ప్రసాద్.. చంద్రబాబు గెలిస్తే తన కష్టాలు తీరిపోతాయని భావించాడు. తన ఓటు టీడీపీకే వేశాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడేళ్లు పూర్తయ్యాయి. అయినా ఉద్యోగం రాలేదు. ఉపాధి సైతం దొరకలేదు. దీంతో ఆ యువకుడు సీఎం చంద్రబాబుకు తన బాధను, అవేదనను వ్యక్తం చేస్తూ ఓ లేఖ రాసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘జాబు లేదని నా భార్య కూడా నన్ను వదిలేసి వెళ్లిపోయింది. ఇది నాలాంటి నిరుద్యోగ యువతకు కనువిప్పు కావాలి’ అని చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నాడు. నిరుద్యోగ యువత తనలా అత్మహత్యకు పాల్పడవద్దని, హోదా వస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని ఆ లేఖలో పేర్కొన్నాడు. చంద్రబాబు మోసం చేశారు మా నాన్న నజీర్ కూలీకి వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నన్ను బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ చదివించాడు. చదువు పూర్తయ్యాక బెంగళూరులో ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరా. ప్రాజెక్ట్ పూర్తవగానే ఇంటికి పంపేశారు. అప్పటి నుంచి ఉద్యోగావకాశాల కోసం తిరుగుతున్నా ఫలితం లేదు. నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారు. – ఎస్కే జిలానీబాషా, గూడూరు ఉద్యోగాలు రావడం లేదు ప్రభుత్వ విధానాలవల్లే ఇంజినీరింగ్ చదివినా ఉద్యోగాలు రావడం లేదు. నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు గొప్పలు చెప్పి నాలుగున్నరేళ్ల తర్వాత అందుకు సవాలక్ష నిబంధనలు పెట్టారు. రాష్ట్రంలో 1.30 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కనీసం గ్రూప్–4 పోస్టులను కూడా భర్తీ చేయడం లేదు. – కె.నేతాజీ, బీటెక్, గూడూరు ఉపాధి అవకాశాలు కల్పించాలి ఐటీఐ డీజిల్ మెకానిక్ కోర్సు పూర్తి చేశాను. ప్రస్తుతం ఉద్యోగ వేటలో ఉన్నాను. చదువు పూర్తి చేసిన వెంటనే ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. రాష్ట్రంలో ఉన్న ఖాళీ పోస్టులను ఏటా భర్తీ చేస్తే కొంతవరకైనా నిరుద్యోగ సమస్య తీరుతుంది. ఐదేళ్లలో ఒక్క ఉద్యోగాన్నీ భర్తీ చేయలేదు. ఇలా అయితే నిరుద్యోగుల పరిస్థితి ఏమిటి. – కె.నవీన్, గూడూరు -
అందరికి కాదు... కొందరికే...!
సాక్షి, యర్రగొండపాలెం (ప్రకాశం): టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ముందు నిరుద్యోగులకు బాబు వస్తే జాబు గ్యారెంటీ అని, జాబు రాకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిన హామీలతో నిరుద్యోగ యువకులు ప్రభుత్వం ప్రకటించే ఉద్యోగ ప్రకటనలకు దరఖాస్తులు చేసుకునేందుకు, ఫీజులు కట్టేందు తల్లిదండ్రులపై ఆధారపడనవసరం లేదని భావించారు. అయితే అధికారంలోకి వచ్చిన అనంతరం టీడీపీ ప్రభుత్వానికి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చిత్తశుద్ధి లేకపోవడంతో ఉద్యోగాలు లేక, ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగులు తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురయ్యారు. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రి యువనేస్తం పథకం అమలు చేసి ఉంటే, ఒక్కొక్క నిరుద్యోగికి నెలకు రూ. 2 వేలు చొప్పున ఈ సంవత్సరాల కాలంలో రూ.120,000 భృతి అంది ఉండేది. ఈ పథకం అమలులో చిత్తశుద్ధి లోపించడంతో ఒక్కొక్క నిరుద్యోగి దాదాపు లక్ష రూపాయలకు పైగా నష్టపోయామని పలువురు నిరుద్యోగులు వాపోతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన పలు జనాకర్షణ హామీలతో అధికారంలో కొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నాలుగున్నర సంవత్సరాలుగా నిరుద్యోగుల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా కాలయాపన చేశారు. తీరా ఎన్నికలు సమీపిస్తున్నయన్న సమయంలో ముఖ్యమంత్రి యువనేస్తం పథకం అమలు చేసి, ప్రజాసాధికారిక సర్వే ఆధారంగా ఒక్కొక్క నిరుద్యోగికి మొదట రూ.1000 చొప్పున మంజూరు చేశారు. తర్వాత నిరుద్యోగ భృతిని రూ.2000కు పెంచారు. ఈ పథకం అమలులోనూ సీబీఎన్ ఆర్మీకి ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆరోపణలు వినపడుతున్నాయి. దీంతో ప్రభుత్వం మరోసారి నిరుద్యోగులను మభ్యపెట్టే ప్రయత్నం చేసిందని నియోజవకర్గంలో పలువురు నిరుద్యోగులు అంటున్నారు. యువనేస్తం కొందరికే వచ్చింది టీడీపీ ప్రభుత్వం నిరుద్యోగులకు అమలు చేసిన ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద నిరుద్యోగభృతి మండలంలో కొందరికి మాత్రమే అందుతుంది. ఈ పథకం కింద మీసేవలో దరఖాస్తు చేసినప్పటికీ, మంజూరు కాలేదు. యువనేస్తం పథకం అమలులో చిత్తశుద్ధి లోపించింది. – ఆదిమూలపు కొండయ్య (బీఏ), నాయుడుపాలెం గ్రామం, పుల్లలచెరువు మండలం ఒక నెల మాత్రమే వచ్చింది ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద నిరుద్యోగ భృతి రూ.1000, ఒక నెల మాత్రమే వచ్చింది. ఆ తరువాత నెల నుంచి రావడం లేదు. 1100 నంబరుకు ఫోన్ చేసినప్పటికీ, సరైన స్పందన లేదు. ఎందుకు రద్దు చేశారో తెలియడం లేదు. ఎన్నికల ముందు ఈ పథకం అమలు చేయడం నిరుద్యోగులను మరొకసారి మోసగించడమే. – జిల్లెల చెన్నారెడ్డి (ఎంఫార్మసీ), తోకపల్లె గ్రామం, పెద్దారవీడు మండలం నిరుద్యోగ భృతి మంజూరు కాలేదు ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద ఆన్లైన్లో అప్లై చేసినప్పటికీ, ప్రభుత్వం నిరుద్యోగ భృతి మంజూరు చేయలేదు. అర్హులైన నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఈ పథకం కొందరికే వర్తింపజేశారు. బీఎస్సీ విద్యను పూర్తి చేసి, నిరుద్యోగ భృతి పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ తనకు ప్రభుత్వం నిరుద్యోగభృతి మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. – అందుగుల రత్నరాజు (బీఎస్సీ), యడవల్లి గ్రామం, దోర్నాల మండలం -
ఈ బడ్జెట్‌తో హామీల అమలెలా?
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల హామీలను అమలు చేసేలా బడ్జెట్‌ను రూపొందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని శాసనసభలో కాంగ్రెస్‌పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. టీఆర్ఎస్ ఎన్నికల హామీలను నెరవేర్చేలా బడ్జెట్ ఉంటుందని ఆశించిన ప్రజలకు ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌తో తీవ్ర నిరాశే మిగిలిందని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వ ప్రాధాన్యాలను గుర్తించాక పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామన్న ప్రభుత్వ వాదనలో పసలేదన్నారు. కేంద్రం నుంచి వచ్చే రాబడుల్లో రూ. 8–10 వేల కోట్లకు మించి మార్పు ఉండనందున పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌పై చర్చలో భాగంగా సభలో ఆయన సోమవారం సుదీర్ఘంగా ప్రసంగించారు. ప్రభుత్వ ఉద్యోగాలేవీ..? తెలంగాణ ఏర్పాటుకు దారితీసిన ప్రధాన కారణాల్లో నియామకాలు ఒకటని భట్టి గుర్తుచేశారు. నిరుద్యోగులు ఆశించిన స్థాయిలో ప్రభుత్వం ఉద్యోగాల కల్పన చేసి ఉంటే నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడేది కాదన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన ప్రాజెక్టులను కేంద్రం నుంచి సాధించి ఉంటే భారీగా ఉద్యోగాలు లభించేవని, ఈ విషయాన్ని ప్రభుత్వం విస్మరించడంతో నిరుద్యోగ సమస్య పెరి గిందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా 2013లో నిమ్జ్‌కు అనుమతి వచ్చిందని, అప్పట్లోనే కొంత భూసేకరణ కూడా జరిగిందని, అది వచ్చి ఉం టే రూ. 30 వేల కోట్ల పెట్టుబడులు, 3 లక్షల ఉద్యోగాలు ఏర్పడేవన్నారు. ఐటీఐఆర్‌ను సాధించి ఉంటే రూ. 3.11 లక్షల కోట్ల ఆదాయం, రూ. 2.19 లక్షల కోట్ల పెట్టుబడులు, రూ. 2.35 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు, 15 లక్షల ఉద్యోగాలు వచ్చేవన్నారు. భట్టిపై సీఎం ఆగ్రహం... భట్టి విక్రమార్క తన ప్రసంగంలో ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన ప్రతిసారీ సీఎం కేసీఆర్ దాన్ని తప్పుపడుతూ మాట్లాడారు. భట్టి చెబుతున్న అంకెలు తప్పని, ఆయన అవగాహన లేక మాట్లాడుతూ సభ ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. అయితే తన ప్రసంగాన్ని అడ్డుకోవడం సరికాదం టూ భట్టి కూడా అసహనం వ్యక్తం చేశారు. వాస్తవా లు చెబుతుంటే సీఎం దబాయించేలా మాట్లాడుతున్నారన్నారు. దీంతో ఆ మాటను ఉపసంహరించుకోవాలంటూ సీఎం డిమాండ్ చేశారు. బడ్జెట్ లెక్కల్లో అంచనాలకు, వాస్తవాలకు పొంతన లేదన్న ఆరోపణపై సీఎం స్పందిస్తూ బడ్జెట్ లెక్కలు అలాగే ఉంటాయన్నారు. కాంగ్రెస్ హయాంలో పదేళ్ల లెక్కలు ఇంతకంటే దారుణంగా ఉన్నాయన్నారు. విద్యారంగానికి కేటాయింపులు కనీసం 20 శాతం ఉండాల్సి ఉండగా కేవలం 6.8 శాతమే పెట్టారని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ వ్యయం 30–40 శాతం తక్కువగా ఉందని భట్టి విమర్శించగా.. వివిధ అంశాల కింద బడ్జెట్లో విద్యారంగానికి రూ. 19,482 కోట్లు కేటాయించామని, అది 11.2 శాతం అవుతుందని, ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ కింద ప్రతిపాదించిన దాని కంటే ఎక్కువే ఖర్చు చేస్తున్నామని సీఎం వివరించారు. మిషన్ భగీరథ నుంచి జగిత్యాల మున్సిపాలిటీకి బిల్లులు చెల్లించా లంటూ నోటీసులు పంపారని భట్టి పేర్కొనగా ఆర్డబ్ల్యూఎస్ఎస్ పేరును మిషన్ భగీరథగా మార్చామ ని, కాంగ్రెస్ హయాంలో పేరుకుపోయిన బకాయిలు చెల్లించాలని మాత్రమే అధికారులు అడిగారన్నారు. భగీరథ నీటి వినియోగానికి సంబంధించి ప్రజల నుంచి బిల్లులు వసూలు చేయాలనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని సీఎం తెలిపారు. పాత ప్రాజెక్టులు పూర్తి చేసుంటే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ చేపట్టిన కీలక సాగునీటి ప్రాజెక్టులను యథాతథంగా పూర్తి చేసి ఉంటే ఇప్పటికే తెలంగాణకు ఎంతో మేలు జరిగి ఉండేదని భట్టి పేర్కొన్నారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును రూ. 28 వేల కోట్లతో పూర్తి చేసే అవకాశం ఉండేదని, అదే జరిగి ఉంటే 16.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వచ్చి ఉండేదన్నారు. ఇందిర, రాజీవ్ సాగర్లను రూ. 1,500 కోట్ల వ్యయంతో పూర్తి చేయగలిగి ఉండేవారమని, దానివల్ల పూర్వపు ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాలకుపైగా సాగునీరు లభ్యత ఉండేదన్నారు. -
నిరుద్యోగ భృతికి 1,810 కోట్లు
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులకు తాజా బడ్జెట్ భారీ ఊరటనిచ్చింది. ఎన్నికల హామీలో భాగంగా నిరుద్యోగులకు నెలకు రూ.3,016 ఆర్థిక సాయం ఇస్తామని టీఆర్ఎస్ చేసిన హామీని నిలబెట్టుకుంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 2019–20 బడ్జెట్లో నిరుద్యోగుల భృతికి భారీ మొత్తంలో నిధులు కేటాయించారు. ఈ వార్షికానికి రూ.1,810 కోట్లు బడ్జెట్లో పొందుపర్చారు. ప్రస్తుత బడ్జెట్లో నిధులు కేటాయించిన ప్రభుత్వం నిరుద్యోగ భృతికి మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను ఆదేశించింది. తాజాగా బడ్జెట్లో పేర్కొన్న నిధులతో ఏడాదిపాటు ఐదులక్షల మందికి నిరుద్యోగ భృతి అందించవచ్చు. నిరుద్యోగులు 13.65 లక్షలు నిరుద్యోగుల గణాంకాలపై ప్రభుత్వం వద్ద స్పష్టమైన వివరాల్లేవు. నిరుద్యోగ భృతికి ఎంప్లాయిమెంట్ ఎక్సే్చంజ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా ఎంప్లాయిమెంట్ ఎక్సే్చంజ్‌లో 13.65 లక్షల మంది నమోదయినట్లు కార్మిక, ఉపాధి కల్పన శాఖ గణాం కాలు చెబుతున్నాయి. సాధారణంగా పదోతరగతి పూర్తి చేసుకున్న ప్రతి వ్యక్తి ఎంప్లాయిమెంట్ ఎక్సే్చంజ్‌లో నమోదు చేసుకోవాలి. అలా నమోదు పత్రాన్ని చూపిన తర్వాతే ఉద్యోగాల్లో చేరేందుకు అర్హత ఇవ్వాలని ఎంప్లాయిమెంట్ ఎక్సే్చంజ్ నిబంధనలున్నాయి. కానీ వీటి అమలు పక్కాగా జరగడం లేదు. కొన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు మాత్రమే ఎంప్లాయి మెంట్ ఎక్సే్చంజి నిబంధనలు అమలు చేస్తు న్నాయి. ఈ నేపథ్యంలో సీనియార్టీ కోసమో, లేక ఇతర ఆధారాల కోసం తప్ప పేరు నమోదుపై నిరుద్యోగులు సైతం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తాజాగా ఎంప్లాయిమెంట్ ఎక్సే్చంజి ఆన్లైన్ నమోదుకు అవకాశం ఇవ్వడంతో రెండేళ్లలో అద నంగా 5లక్షల మంది నమోదు చేసుకున్నారు. మరోవైపు ఉద్యోగాల భర్తీకి సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఓటీఆర్ (ఒన్‌టైమ్ రిజిస్ట్రేషన్) నమోదుకే పరిమితం చేస్తున్నాయి. ప్రస్తుతం టీఎస్పీఎస్సీలో ఓటీఆర్ చేసుకున్న వారి సంఖ్య 20 లక్షలకు పైమాటే. నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం మార్గదర్శ కాలు రూపొందిస్తే కేటగిరీల వారీగా ఉన్న నిరు ద్యోగుల లెక్కలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
భృతిని కట్ చేసేందుకు మరో ఎత్తుగడ
సాక్షి, అమరావతి బ్యూరో : తాము అధికారంలోకొస్తే ఇంటికో ఉద్యోగం.. లేకుంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి.. అంటూ ఊదరగొట్టిన సీఎం చంద్రబాబు.. అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్ల తర్వాత భృతి ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. ఇచ్చే రూ.వెయ్యికి పలు నిబంధనలు పెట్టడంతో అర్హులైన నిరుద్యోగులు భృతికి దూరమవుతున్నారు. యువనేస్తం పథకం లబ్ధిదారులు ఇప్పటివరకు మీ–సేవా కేంద్రం, రేషన్ డీలర్ల వద్ద బయోమెట్రిక్ నమోదు చేసుకుంటే భృతి జమయ్యేది. కానీ.. ఈ నెల నుంచి నిరుద్యోగ యువత సాధికార సర్వేలో ఏ మండలంలో నమోదు చేసుకున్నారో అక్కడే బయోమెట్రిక్ వేయాలనే కొత్త నిబంధనను ప్రభుత్వం తెచ్చింది. దీంతో పోటీ పరీక్షల కోసం ఇతర ప్రాంతాల్లో కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులు తీవ్రంగా నష్టపోనున్నారు. ప్రతి నెలా ప్రభుత్వం ఇచ్చే భృతి రానుపోను చార్జీలకే సరిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీగా కోత విధించేందుకే.. భృతి తీసుకునే వారిలో 60 నుంచి 70 శాతం మంది అభ్యర్థులు కోచింగ్ తీసుకుంటూ, ఉద్యోగాన్వేషణలో ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు. కొత్త నిబంధనతో వీరంతా తీవ్రంగా నష్టపోనున్నారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖ తదితర నగరాల్లో కోచింగ్ తీసుకునే అభ్యర్థులు సొంత ఊరికొచ్చి వెళ్లేందుకు రూ.వెయ్యి కన్నా ఎక్కువ ఖర్చు చేయాల్సిన పరిస్థితి. వెబ్ పోర్టల్‌లో నమోదు చేయాల్సిన అంశాలను ప్రభుత్వం ఇదివరకే స్పష్టంగా ప్రకటించింది. అభ్యర్థుల ఆధార్ డేటా, ప్రజా సాధికార సర్వే, రేషన్‌కార్డు డేటా బేస్ అంశాలను స్పష్టంగా పేర్కొంది. వీటితో పాటు సంక్షేమ పథకాల లబ్ధిదారులు, అప్రెంటిస్ డేటా, ఈపీఎఫ్, ఈఎస్ఐ, జనాభా లెక్కల వివరాలు, అర్హతలను పొందుపర్చాల్సి ఉంది. ప్రభుత్వం పొందుపర్చిన అంశాలు లబ్ధిదారులను వడపోసేలా ఉన్నాయని నిరుద్యోగులంటున్నారు. ప్రస్తుతం విద్యనభ్యసిస్తున్న వారికి, ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వారికి భృతి ఇచ్చేది లేదని నిబంధనల్లో పేర్కొంది. 12 లక్షల మందికని ప్రకటించి.. రాష్ట్రంలో నిరుద్యోగ భృతికి అర్హులైన వారు సుమారు 12 లక్షల మంది ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కానీ.. భృతిని ఇప్పటివరకు నాలుగు లక్షల మందికే ఇస్తోంది. దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నించిన వారికి.. పథకానికి మీరు అనర్హులని వస్తుండటంతో వారు నిర్ఘాంతపోతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 11,73,670 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 4,31,888 మందే పథకానికి అర్హులుగా పేర్కొంది. ఆధార్‌కు, బ్యాంకు ఖాతాకు ఫోన్ నంబర్ అనుసంధానం కాకపోవడంతో అధికశాతం మంది ఇబ్బందిపడుతున్నారు. అన్ని అర్హతలుండీ తమకు భృతి అందకపోవడంతో నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు. 24,758 మంది అభ్యర్థులు తమకు భృతి రావడం లేదని గ్రీవెన్స్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే 4,30,000 మంది పథకానికి అర్హత సాధించారని చెబుతున్న ప్రభుత్వం.. జనవరి నెలలో 3,59,720 మందికే ఖాతాల్లో జమచేసింది. వివిధ కారణాలు చూపుతూ సుమారు 70 వేల మందికి ఎగవేసింది. ఇక మిగిలేదేంటి? గుంటూరు జిల్లా నగరం మండలానికి చెందిన నేను హైదరాబాద్‌లో గ్రూప్స్‌నకు ప్రిపేరవుతున్నా. ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధన కారణంగా నెల నెలా మా ప్రాంతానికి వెళ్లాలి. రానుపోను చార్జీలకే ఆ భృతి సరిపోతుంది. ఇక నాకు మిగిలేదేంటి? – ఎం.వెంకటకృష్ణ, నగరం మండలం, గుంటూరు జిల్లా కోత విధించేందుకే కొత్త నిబంధన నిరుద్యోగ భృతిలో కోత విధించేందుకు ప్రభుత్వం కొత్త నిబంధనలు తెస్తోంది. రూ.2 వేలు భృతి అని చెప్పి.. వెయ్యితో సరిపెట్టారు. అదీ సరిగా ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దూర ప్రాంతాల నుంచి రావాలంటే కోచింగ్‌కు ఆటంకం కలుగుతుంది. పోటీ పరీక్షల్లో వెనుకపడతాం. – ఎం.శ్రీనివాసరావు, రేపల్లె, గుంటూరు జిల్లా -
ఏం తమాషా చేస్తున్నారా.. బీ కేర్‌ఫుల్
సాక్షి, తిరుపతి: ‘ఏం తమాషా చేస్తున్నారా.. బీ కేర్‌ఫుల్’ అంటూ డీఎస్సీ అభ్యర్థులను సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. వెయ్యి రూపాయల నిరుద్యోగ భృతి తీసుకుంటున్నారు గా.. అంటూ వెటకారమాడారు. ఎన్నికల హామీ మేరకు న్యాయం చేయాలని కోరినందుకు.. వారిపై చంద్రబాబు వీరంగమేశారు. తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ మైదానంలో గురువారం ‘పేదరికంపై గెలుపు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగిం చారు. ఇదే సమయంలో డీఎస్సీ అభ్యర్థులు ఒక్కసారిగా వేదిక ముందుకు చేరుకుని ప్లకార్డులతో నిరసన తెలిపారు. ‘ఉయ్ వాంట్ జస్టిస్’ అంటూ సభా ప్రాంగణం మార్మోగేలా నినాదాలు చేశారు. ‘బాబొస్తే జాబొస్తుందన్నావ్. అదే నమ్మకంతో నిన్ను గెలిపించాం. అధికారంలోకి వచ్చావ్. నీ కొడుక్కి ఉద్యోగం ఇప్పించావ్. మమ్మల్ని మాత్రం రోడ్లపాలు చేసి అడుక్కునేలా చేశావ్..’ అంటూ అభ్యర్థులు గట్టిగా తమ గోడు వెళ్లగక్కారు. దీంతో సీఎం చంద్రబాబు అభ్యర్థులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దేశంలో ఎక్కడా లేనన్ని పోస్టులిచ్చాను. ఏ ప్రభుత్వం డీఎస్సీని భర్తీ చేయలే దు. అయినా నేను చేశాను. నిరుద్యోగ భృతి తీసు కుంటున్నారుగా. ఏ రాష్ట్రంలోనైనా వెయ్యి రూపా యల నిరుద్యోగ భృతి ఇస్తున్నారా? సభకు వచ్చి నినాదాలు చేయటం సరికాదు. ఏం తమాషా లాడుతున్నారా? బీ కేర్‌ఫుల్. మీలో క్రమశిక్షణ లేదు’ అంటూ వారిని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. దీంతో డీఎస్సీ అభ్యర్థులు స్పందిస్తూ.. ‘నీ వెయ్యి రూపాయల భృతి మేం తీసుకోవటం లేదు. కావాలంటే అది కూడా నీ కొడుక్కి ఇవ్వు.. సరిపోతుందేమో’ అంటూ ఎద్దేవా చేశారు. 50 వేల మంది ఎస్జీటీలుంటే 2 పోస్టులు భర్తీ చేస్తావా? 50 వేల మందికిపైగా ఎస్జీటీ అభ్యర్థులుంటే.. కేవలం 2 పోస్టులు భర్తీ చేస్తాననడం జిల్లాకు చెందిన ముఖ్యమంత్రిగా మీకు న్యాయంగా ఉందా? అంటూ సీఎంను ఆందోళనకారులు నిలదీశారు. ముఖ్యమంత్రిగా మీరు న్యాయం చేస్తారని వస్తే.. హెచ్చరికలు జారీ చేస్తావా? మాలో క్రమశిక్షణ లేదంటావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీలాంటి లక్షల మందికి క్రమశిక్షణతో కూడిన విద్యను నేర్పేవాళ్లం. మమ్మల్నే అంటావా?’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇంతలో పోలీసులు రంగ ప్రవేశం చేసి నిరసన తెలుపుతున్న ఆరుగురిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారిని విడుదల చేయాలంటూ అభ్యర్థులు పెద్దపెట్టున నినాదాలు చేయగా.. వారిని పోలీసులు చెదరగొట్టారు. న్యాయం చేస్తారనుకుంటే.. అరెస్టు చేయించారు సొంత జిల్లా నిరుద్యోగులకు సైతం సీఎం శఠగోపం పెట్టారు. కోచింగ్‌లు తీసుకుంటూ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మాకు డీఎస్సీ నోటిఫికేషన్ తీవ్ర నిరాశకు గురిచేసింది. జిల్లాలో వేల పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం రెండు ఎస్జీటీ పోస్టులే ఇచ్చారు. న్యాయం చేస్తారేమో అని వస్తే నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేశారు. – శాంభవి, డీఎస్సీ అభ్యర్థి కాళ్లరిగేలా తిరిగినా కనికరించలేదు.. ముఖ్యమంత్రిని కలిసేందుకు అమరావతి చుట్టూ కాళ్లరిగేలా తిరిగాం. అయినా కనికరించలేదు. మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేశాము. అయినా మా విజ్ఞప్తిని పట్టించుకోలేదు. – రేఖ, డీఎస్సీ అభ్యర్థి -
ఐదేళ్లలో 50 లక్షల ఉద్యోగాలు
జైపూర్: ఏడాదికి 30 వేల ప్రభుత్వ, 10 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, రైతుల ఆదాయం రెట్టింపు తదితర భారీ హామీలతో రాజస్తాన్‌లో బీజేపీ మేనిఫెస్టో విడుదలైంది. వచ్చే నెల 7న ఎన్నికలు జరగనున్న రాజస్తాన్‌లో అధికార బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ విడుదల చేశారు. ముఖ్యమైన హామీలు ►ప్రతీ ఏడాది ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. ప్రైవేటు రంగంలో సంవత్సరానికి 10 లక్షల ఉద్యోగాల (స్వయం ఉపాధి సహా మొత్తం ఐదేళ్లలో 50 లక్షలు) సృష్టి. ఎన్ఆర్ఈజీఏ తరహాలో పట్టణ ప్రాంతాలకు ప్రత్యేక ఉపాధి హామీ పథకం. 21 ఏళ్లు నిండిన నిరుద్యోగ యువతకు నెలకు రూ. 5,000 భృతి. ►ఐదేళ్లలో రూ. లక్ష కోట్ల అప్పులను రైతులకు ఇవ్వడం ద్వారా వ్యవసాయ రంగంలో సహకార రుణాలను మరింత విస్తరించడం. ►తూర్పు రాజస్తాన్ కాలువల ప్రాజెక్టు ద్వారా 13 జిల్లాలకు సాగు, తాగునీరు. దీన్ని ప్రధాన ప్రాజెక్టుగా పరిగణించి త్వరగా పూర్తి చేయడం. ప్రతీ డివిజన్లో ఒక జిల్లాను ఎంచుకుని అక్కడ సేంద్రీయ వ్యవసాయం, ఔషధ మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వడం. ►బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యా ముస్లింలను గుర్తించి వారిని దేశం నుంచి బహిష్కరించడంతోపాటు పాక్ నుంచి వచ్చిన హిందువులకు పౌరసత్వం. ►మేవాత్ ప్రాంతంలో గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు మరిన్ని చెక్‌పోస్ట్‌ల ఏర్పాటు. ►ప్రస్తుతం మినా (Mina)లు ఎస్టీల్లో ఉండగా, మీనా (Meena)లను కూడా ఎస్టీల్లో చేర్చేలా కేంద్రానికి సిఫారసు. గిరిజనుల ఉప ప్రణాళిక కోసం ఐదేళ్లలో రూ. 5,000 కోట్లు. ►విద్యా విధానాల రూపకల్పనలో ప్రైవేటు పాఠశాలలు లేదా సాధికార కమిటీల సహాయం తీసుకోవడం, వేద విద్య కోసం ప్రత్యేక మండలి ఏర్పాటు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరే ప్రతిభావంతులకు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు. ►అనైతిక కార్యకలాపాల గురించి చెప్పేందుకు వాడుతున్న ‘గోరఖ్ ధంధా’ పదాన్ని వాడకుండా నిషేధం విధించేందుకు కొత్త చట్టం. ‘గురు గోరఖ్‌నాథ్’ అనుచరులను మనోభావాలను దెబ్బతీసేలా ఈ పదం ఉండటంతో నిషేధం విధించాలని నిర్ణయం. -
‘యు’వోటర్
సాక్షి, వరంగల్ రూరల్: త్వరలో జరిగే శాసనసభ ఎన్నికలను పురస్కరించుకుని వరంగల్ రూరల్ జిల్లాలో ఓటర్ల లెక్కను తేల్చారు. తాజాగా అధికార యంత్రాంగం వయస్సుల వారిగా ఓటర్ల వివరాలను విభజించారు. 18–19 సంవత్సరాల వారికి తొలిసారి ఓటు వేసే అవకాశం దక్కనుంది. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్, ఓటర్ల తుదిజాబితా విడుదల కావడంతో కీలక ఘట్టం ముగిసింది. డిసెంబర్ 7న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు, ఓటములను నిర్దేశించే స్థాయిలో జిల్లాలో యువ ఓటర్లు నమోదు కావడంతో ప్రధాన పార్టీలన్ని వారిని ప్రసన్నం చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేట, పరకాల నియోజకవర్గాల్లో యువ ఓటర్లు అభ్యర్థుల గెలుపు ఓటముల్లో కీలకం కానున్నారని అంచనా వేస్తున్న అన్ని రాజకీయ పక్షాలు ఈ మేరకు కార్యాచరణను రూపొందించుకుంటున్నాయి. ఇందుకోసం టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో ప్రత్యేక విభాగాలు పనిచేస్తున్నట్లు సమాచారం. ఎన్నికలకు ఇంకా 41 రోజుల సమయం ఉన్నా క్షేత్ర స్థాయిలో యువ ఓటర్లకు కావాల్సినవి అన్ని సర్దుబాటు చేసేందుకు ఇప్పటి నుంచే గ్రామాల్లో ఆయా పార్టీల నాయకులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి వారికి ప్రసన్నం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ యువతతో బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ యువ ఓటర్లకు గాలం వేస్తున్నారు. నూతన ఓటర్లు... జిల్లాలో 3,99,433 మొత్తం ఓటర్లలో సుమారు 30 శాతం వరకు యువ ఓటర్లు ఉన్నారు. తాజాగా విడుదల చేసిన జాబితాలో 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లలోపువారు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు అర్థమవుతుంది. నర్సంపేట నియోజకవర్గంలో కొత్త ఓటర్లు 5,776 మంది నమోదు చేసుకున్నారు. అలాగే పరకాల నియోజకవర్గ పరిధిలో 4,503 మందితో కలిపి మొత్తం 10,279 కొత్త ఓట్లు నమోదు చేసుకున్నారు ఇందులో ఎక్కువ శాతం తొలిసారిగా ఓటు హక్కును నమోదు చేసుకున్నావారే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కొత్తగా ఓటు హక్కును పొందినవారు తమ తొలి ఓటు ఎవరికి వేస్తారోననే ఉత్కంఠ అన్ని పార్టీల్లోనూ నెలకొంది. నవంబర్ 9 వరకు ఓటు నమోదు, సవరణలు, ఓటు బదిలీ చేసుకునే అవకాశం ఉండడంతో మరికొన్ని ఓట్లు పెరిగే అవకాశం ఉంది. కీలకంగా మారనున్న యువత ప్రస్తుతం ప్రకటించిన ఓటరు ముసాయిదా ప్రకా రం 18–19 సంవత్సరంలోపు వారు 10,279 మం ది ఓటర్లు ఉన్నారు. అలాగే 20–29 సంవత్సరంలోపు 93,829 మంది ఓటర్లు ఉన్నారు. 30 సంవత్సరాలలోపు వారు 1,04,108 ఓటర్లు ఉన్నారు. దీంతో దాదాపు మొత్తం ఓట్లలో సుమారు 30 శా తం యువతే ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ సారి వీరు ఎటువైపు మొగ్గుచూపుతారో అని పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. పెరిగిన ఓట్లు తమ ను ముంచుతాయో... తేల్చుతాయోనని పార్టీలు భయపడుతున్నాయి. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్ యువత ఎప్పుడూ కేసీఆర్ పక్షమే అని చెబుతుం టే కాంగ్రెస్ మాత్రం ప్రభుత్వంపై యువతకు తీవ్ర వ్యతిరేతతో ఉందని అందుచేత కొత్త ఓటర్లు తప్పకుండా తమకే ఓటేస్తారనే ధీమాలో ఉన్నారు. నిరుద్యోగ భృతితో గాలం.. కొత్త ఓటర్లను తమ ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకు యువత ప్రాధాన్యాంశాలను పార్టీలు మేనిఫేస్టోలో చేర్చేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే పార్టీలు ప్రకటిస్తున్న మేనిఫేస్టోలు యువ ఓటర్లను ఏ మాత్రం ఆకర్షిస్తాయో చూడాలి. ప్రధాన పార్టీలు అన్నీ రెండూ నిరుద్యోగులకు భృతి కల్పిస్తామని చెబుతున్నాయి. అధికారంలోకి రాగానే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెబుతున్నాయి. రెండు పార్టీలు ఒకే విధంగా చెబుతున్నప్పటికీ యువత మాత్రం ఎటువైపు ఉంటుందో అనే విషయంపై ఇప్పటికీ ఓ స్పష్టత రాలేదు. సాంకేతిక యుగంలో అందరికి టెక్నాలాజీ అందుబాటులోకి రావడంతో వారు తమ అభిమాన పార్టీ నాయకుల పేర్లతో వాట్సప్, ఫేస్బుక్ గ్రూపులు క్రియేట్ చేసి ప్రస్తుత రాజకీయ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. -
‘భృతి’ పేరుతో కొత్త నాటకం
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులను, నిరుద్యోగులను సీఎం కేసీఆర్ దారుణంగా మోసం చేశారని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తామంటూ కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. నాలుగున్నరేళ్లుగా నిరోద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ నిరుద్యోగ భృతి కింద రూ.3 వేలు ఇస్తామని ప్రకటిస్తే.. వేలం పాట పాడినట్లు మరో రూ.16 పెంచి రూ.3,016 ఇస్తామంటూ కేసీఆర్ నిరుద్యోగులను అవమానపరిచారన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. వంద రోజుల్లో మెగా డీఎస్సీ ప్రకటించడంతో కేసీఆర్ వెన్నులో వణుకు మొదలైందని, అందుకే కొత్త పల్లవి అందుకున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులున్నారని, వారంతా ఈ విషయమై కేసీఆర్‌ను నిలదీయాలని కోరారు. అప్పులతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారన్నారు. అవినీతికే అప్పులు.. కేవలం కమీషన్లు, అవినీతి చేసేందుకే కేసీఆర్ రూ.70 వేల కోట్ల అప్పులు చేశారని దాసోజు ధ్వజమెత్తారు. కేసీఆర్‌కు దమ్ముంటే శాఖల వారీగా సృష్టించిన సంపద ఎంత, పెట్టిన ఖర్చు ఎంత, అప్పులు ఎంత అన్న దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుల రుణమాఫీ ప్రకటించిన కేసీఆర్ ఇంతకుముందే ఒకే దఫాలో ఎందుకు మాఫీ చేయలేదని ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత ప్రగతిభవన్‌ను ఖాళీ చేసి.. ఫాంహౌస్‌లో వ్యవసాయం చేసుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల మధ్య పంచాయతీ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఎన్నికల్లో ఓటేయకుంటే తరిమివేస్తామన్న ధోరణిలో మాట్లాడుతున్నారని దాసోజు ఆరోపించారు. -
ఎస్వీయూలో నిరుద్యోగ దీక్ష
చిత్తూరు, యూనివర్సిటీ క్యాంపస్: నిరుద్యోగ భృతి, ఉద్యోగ నోటిఫికేషన్ల జారీలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగడుతూ ఎస్వీయూలో మంగళవారం ప్రారంభమైన 48 గంటల నిరుద్యోగ దీక్షకు జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగులు, యువత స్వచ్ఛం దంగా తరలివచ్చింది. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు ఎస్వీయూలో వైఎస్సార్ విద్యార్థి విభాగం తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్చార్జి వి.హరిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ దీక్ష ఏర్పాటు చేశారు. వైఎస్సార్ సీపీ చిత్తూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీని వాసులు ప్రారంభించిన ఈ దీక్షకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తిరుపతి మాజీ ఎంపీ వి.వరప్రసాద్‌రావు సంఘీభావం ప్రకటిం చారు. ముందుగా ఎస్వీయూ గోల్డన్ జూబ్లీ ఆర్చి ఎదురుగా ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి, అనంతరం దీక్ష శిబిరంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా జంగా లపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు ఇంటికో ఉద్యోగం, రూ.2 వేల భృతి ఇస్తానని హామీ ఇచ్చి నిలుపుకోలేదన్నారు. ప్రస్తుతం ఎన్నికల వస్తున్నందున కేవలం రూ.వెయ్యి భృతి ప్రకటించారని, అది కూడా అనేక ఆంక్షలు పెట్టి యువతకు దక్కకుండా మరోసారి మోసం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు చేస్తున్న మోసాలకు యువత పుల్‌స్టాప్ పెట్టాలని కోరారు. విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సలాం బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఉంటే కేవలం 2 లక్షల మందికి మాత్రమే రూ.వెయ్యి నిరుద్యోగ భృతి ఇస్తున్నారన్నారు. షరతులు లేకుండా భృతి ఇవ్వాలి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఏపీ సీఎం ఇప్పటివరకు బాకీ పడిన నిరుద్యోగ భృతిని ఏడాదికి రూ.24 వేల చొప్పున ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలని కోరారు. అబద్దాలు, మోసాల్లో సీఎం దిట్ట అన్నారు. నా లుగున్నరేళ్లగా భృతి ఇవ్వకుండా మోసం చేసిన బాబు ఇప్పుడు రూ.వెయ్యి భృతి మాత్రమే అనేక ఆంక్షలతో ఇవ్వడం దారుణమన్నారు. మాజీ ఎంపీ వరప్రసాద్‌రావు మాట్లాడుతూ ఏపీ సీఎం తనయుడు లోకేష్ రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తల సదస్సు జరిగిన అనంతరం రూ.లక్ష కోట్ల పెట్టుబడి, 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారని, అయితే పెట్టబడులు ఎక్కడ వచ్చాయి?, ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించా రు. కార్యక్రమంలో ద్రవిడ యూనివర్సిటీ మాజీ వీసీ రత్నయ్య, పెద్దిరెడ్డి సుధీర్‌రెడ్డి, చిత్తూరు, తిరుపతి, రాజంపేట పార్లమెంట్ నియోజక వర్గాల విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెవి రెడ్డి మోహిత్‌రెడ్డి, జే.సుధీర్, కిషోర్ దాస్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.ఓబుళరెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్.రాజశేఖర్ రెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే.సంగీత, నాయకులు తిరుమల ప్రకాశ్, మురళీ ధర్, క్యాంపస్ అధ్యక్షుడు హేమంత్ కుమార్ రెడ్డి, తేజ, నవీన్, శివకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
ఓ నిరుద్యోగి ప్రశ్నకు సీఎం వింత జవాబు
-
నిరుద్యోగ యువతను వంచించిన చంద్రబాబు
-
నా జవాబులు.. నా ఇష్టం
‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ... ఈ రెండింటిలో దేనిద్వారా లబ్ధి కలుగుతుంది?’ –మహేశ్‌బాబు (బీటెక్, ఏలూరు) సీఎం చంద్రబాబు సమాధానం హేతుబద్ధత లేని విభజన జరిగింది. రాజధాని లేదు... విద్యాసంస్థలు లేవు... పరిశ్రమలు లేవు. అందరూ నిరాశలో ఉన్నారు. అప్పుడే నవనిర్మాణ దీక్ష తీసుకున్నాం. రాష్ట్రావతరణ వేడుకలు కూడా జరుపుకోలేదు. మన డిమాండ్లు, అవసరాలు, హామీలు వేటినీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదు. కేంద్రం చేసిన అన్యాయంపై అవిశ్వాస తీర్మానం పెట్టాం. కేంద్రం మోసం చేసినా మన కష్టంతో రెండంకెల వృద్ధి సాధించాం ఎస్కే ముజా (ఆంధ్రా యూనిర్శిటీ): నిరుద్యోగ భృతిని కొనసాగిస్తారా? మధ్యలోనే ఆపివేస్తారా? సీఎం: మిగిలిన రాష్ట్రాల్లో మధ్యలో నిలిపేయడానికి కారణం ఫ్రేమ్‌వర్క్‌లో లోపం. ఇక్కడ అలాంటి ప్రమాదం లేదు. పూర్తి సాంకేతికతతో బయోమెట్రిక్‌తో రూపొందించిన కార్యక్రమం ఇది. ఎన్నికల కోసం చేపట్టిన కార్యక్రమం కాదు. ఓ నిరుద్యోగి (కడప): మా జిల్లాలో 35 జిల్లా పరిషత్ ఉర్దూ స్కూళ్లు న్నాయి. పీఈటీలు 8 మందే ఉన్నారు. నేను కూడా పీఈటీ ట్రైనింగ్ చేశా. ఉర్దూ స్కూళ్ళలో పీఈటీ పోస్టులన్నీ భర్తీ చేయాలి. సీఎం: ఫిజికల్ లిటరసీ ముఖ్యం. నేను ఉన్నప్పుడు ఉర్దూను రెండో అధికార భాషగా గుర్తించా. అన్నీ చేయాలని ఉంది. ఎంతవరకు వీలైతే అంతవరకు చేస్తాం. హారిక (కేఎల్ యూనిర్శిటీ): హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చారంటున్నారు. అమరావతిలో ఐటీపై మీకున్న విజన్ ఏమిటి? సీఎం: హైదరాబాద్‌లో ఎకో సిస్టమ్ çసృష్టించడం వల్ల నాలెడ్జ్ ఎకానమీకి దోహదపడింది. అమరావతిని అంతకుమించి తీర్చిదిద్దుతాం. తిరుపతిని ఆటోమొబైల్ హబ్‌గా, ఎలక్ట్రానిక్స్ హబ్‌గా రూపొందిస్తున్నాం. తిరుపతిని షెంజెన్లా తయారుచేస్తున్నాం. తిరుపతి నుంచి చెన్నై వరకు ఐటీని అభివృద్ధి చేస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రవీణ్‌కుమార్: 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు, అక్టోబరు నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందా? ఎన్నికల లోపు వాటిని భర్తీ చేస్తారా? ప్రభుత్వ ఉద్యోగం కోసం లంచం ఇవ్వాల్సిందేనా? సీఎం: ఎవరైనా లంచం అడిగితే 1100కి ఒక్క ఫోన్ చేయండి. కఠిన చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో ఎక్కడా అవినీతికి చోటులేదు. అవినీతి లేని రాష్ట్రంగా ఏపీ పేరొందాలి. బాగా చదువుకున్న ఎవరికీ అన్యాయం జరగకూడదు. శ్రావణి (నాగార్జున యూనివర్శిటీ): పురుషులతో సమానంగా మహిళలకు ఏవైనా కొత్త పథకాలు ప్రవేశపెడుతున్నారా? సీఎం: హార్డ్‌వేర్ అంతా మహిళల కోసమే ఉంది. గార్మెంట్‌లో 95 శాతం మంది మహిళలే ఉన్నారు. గోపి (ఏఎన్‌యూలో ఎంబీఏ): మీ చర్యల వల్ల ప్రభుత్వ యూనివర్శిటీలు మూతపడతాయంటున్నారు, ప్రైవేట్ యూనిర్శిటీలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? సీఎం: అందుకే ప్రభుత్వ యూనివర్శిటీలు కూడా అక్రిడిటేషన్ తీసుకోవాలంటున్నాం. విట్, ఎస్సార్ఎం వంటి యూనివర్శిటీలకు ప్రోత్సాహం ఇస్తున్నాం. పోటీతత్వం ఉండాలి. మధు, బీటెక్: ‘డేర్ టు డ్రీమ్’ అని మీరు అంటుంటారు. కానీ మాకు 25 ఏళ్ల వయసులోనూ ఏం చేయాలో తెలియడం లేదు. మీరు ముఖ్యమంత్రి కావాలని చిన్నప్పటి నుంచే అనుకున్నారా? సీఎం: నేను చదువుకునేటప్పుడు ఐఏఎస్ కావాలని అనుకున్నా. మన కష్టం ఆ స్థాయికి సరిపోదేమో అనిపించింది. దానికన్నా ఎమ్మెల్యే అవుదామని అనుకున్నా. ఎమ్మెల్యే అయితే ఐఏఎస్‌లనే నియంత్రించవచ్చని అనిపించింది. యూనివర్శిటీలో చదువుతూనే ఎమ్మెల్యేనయ్యా. దళవాయి లోకనాధం (ఎస్వీయూలో పీహెచ్డీ): తిరుపతి వేదికగా అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు వచ్చాయి. కానీ వాటిలో స్థానికేతరులకు ఉద్యోగాలు ఇస్తున్నారు. స్థానికంగా రిజర్వేషన్లు ఇచ్చేలా చట్టం చేయండి. సీఎం: నూటికి 90 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇస్తున్నాం. ఈ విషయంలో నేను అందరితో సమన్వయం చేస్తున్నా. ఎక్కడైనా ఉల్లంఘిస్తే చెప్పండి. చర్యలు తీసుకుంటాం. కానీ దీన్ని అడ్డం పెట్టుకుని ఉద్యమాలు చేస్తే ఉద్యోగాలు ఊడతాయి. పెట్టుబడులు నాపై నమ్మకంతో వస్తున్నాయి. దళిత ఎంపీపీ మైక్ లాక్కున్న టీడీపీ ఇన్చార్జ్ సాక్షి, అమరావతి: ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం సీఎం నివాసం వద్ద ప్రజావేదికలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన నిరుద్యోగులు ముఖ్యమంత్రిపై ప్రశ్నల వర్షం కురిపించారు. సీఎం సరైన సమాధానం చెప్పకుండా దాటవేశారు. సీఎంను నిరుద్యోగులు అడిగిన ప్రశ్నలివీ.. ఐఏఎస్ కావాలనుకుని ఎమ్మెల్యేనయ్యా: సీఎం ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకాన్ని గాంధీ, లాల్‌బహదూర్‌శాస్త్రి లాంటి మహనీయుల జయంతి రోజున ప్రారంభిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. యువతకు భరోసా ఇవ్వడానికే దీన్ని ప్రారంభిస్తున్నామన్నారు. మంగళవారం ఉండవల్లిలోని ప్రజావేదికలో ఆయన ఈ పథకాన్ని ప్రారంభించి మాట్లాడారు. తొలుత జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని అర్హత సాధించిన సుమారు 2.10 లక్షల మందికి నిరుద్యోగ భృతిని ఈనెల నుంచి ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఎంపికైన వారి ఖాతాలో బుధవారం రూ.వెయ్యి జమ చేస్తామని, నెలనెలా దీన్ని కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో ‘ఆంధ్రప్రదేశ్ యువజన విధానం–2018’ని విడుదల చేశారు. సమాచారశాఖ రూపొందించిన బాపూజీ లఘు చిత్ర సీడీని సీఎం ఆవిష్కరించారు. చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారని ఫాక్స్‌కాన్ ఇండియా లిమిటెడ్, కియా మోటార్స్, బ్రాండెక్స్ ప్రతినిధులు ప్రశంసించారు. పుంగనూరు: యువనేస్తం కార్యక్రమం సందర్భంగా మంగళవారం చిత్తూరు జిల్లా పుంగనూరులో అధికార టీడీపీ ప్రజాప్రతినిధులు ప్రోటోకాల్ ఉల్లంఘించి వైఎస్సార్ సీపీ దళిత ఎంపీపీ నరసింహులుతోపాటు ఇతరులను అవమానించారు. పట్టణంలోని బిఎంఎస్ క్లబ్లో స్పెషల్ ఆఫీసర్ అరుణ ఆధ్వర్యంలో యువనేస్తం కార్యక్రమం ప్రారంభించారు. ఎమ్మెల్సీ సునీతతోపాటు పుంగనూరు ఎంపీపీ నరసింహులు, జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర, కౌన్సిలర్లు దీనికి హాజరయ్యారు. టీడీపీ ఇన్చార్జ్ అనీషారెడ్డి, ఆమె భర్త శ్రీనాథరెడ్డి కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనీషారెడ్డి ఎంపీపీ నరసింహులును వేదిక పైనుంచి దిగిపోవాలని ఆదేశిస్తూ మైక్ లాక్కునేందుకు ప్రయత్నించడం వివాదానికి దారి తీసింది. ‘దళితులకు ఇచ్చే గౌరవం ఇదేనా...?’ అంటూ ఎంపీపీ నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతల జోక్యంతో డీఎస్పీ నారాయణస్వామి, సీఐ సాయినాథ్‌ల ఆదేశాల మేరకు పోలీసులు రంగప్రవేశం చేసి వైఎస్సార్ సీపీ నేతలను అడ్డుకున్నారు. స్పెషల్ ఆఫీసర్ అరుణ ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్నారని, వైఎస్సార్ సీపీ నేతలను లోపలకు రానివ్వకుండా టీడీపీ నేతలను మాత్రం ఎలా అనుమతిస్తారని జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్ ప్రశ్నించారు. దీంతో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్ సీపీ నేతలను పోలీసులు అడ్డుకుని కౌన్సిలర్లు మనోహర్, నయాజ్ లను బలవంతంగా లాక్కెళ్లి అరెస్ట్ చేశారు. అనంతరం అధికార పార్టీ నేతలు పోలీసుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. పలువురు నిరుద్యోగులు వెనుతిరిగి వెళ్లిపోవటంతో కంగుతిన్న టీడీపీ నేతలు సర్టిఫికెట్లు ఇస్తాం, తీసుకుని వెళ్లాలంటూ మైకులో అభ్యర్థించారు. ఎమ్మెల్యే ఐజయ్యపై దౌర్జన్యం నందికొట్కూరు: ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే జీర్ణించుకోలేని అధికార పార్టీ నేతలు దాడులకు తెగబడుతున్నారు. మంగళవారం కర్నూలు జిల్లా నందికొట్కూరులో నిర్వహించిన ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ దీనికి వేదికగా మారింది. జైకిసాన్ పార్కులో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ సీఎం చంద్రబాబుకు నాలుగున్నరేళ్లుగా గుర్తులేని నిరుద్యోగ భృతి ఎన్నికల గడువు సమీపిస్తుండడంతో ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులుండగా కేవలం 1.62 లక్షల మంది ఖాతాల్లో మాత్రమే ప్రభుత్వం రూపాయి చొప్పున జమ చేసిందన్నారు. జిల్లాలో 11,911 మందిని, నందికొట్కూరు నియోజకవర్గంలో 2,100 మందిని మాత్రమే ఎంపిక చేయడం సరికాదన్నారు. నీరు–చెట్టు పథకంలో అధికార పార్టీ నేతల దోపిడీ గురించి ఎమ్మెల్యే వివరిస్తుండగా అధికార పార్టీ నేతల జోక్యంతో మైక్‌ను కట్ చేశారు. దొంగల సంగతి ప్రజా కోర్టులో తేలాలని ఎమ్మెల్యే పట్టుబట్టడంతో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ మాండ్ర శివానందరెడ్డి వాగ్వాదానికి దిగారు. మరోవైపు టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యేపైకి దూసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే ఐజయ్య ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు. -
దగాపడ్డ.. యువనేస్తమా!
నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో నిరుద్యోగులను నిండా ముంచేసిన సీఎం చంద్రబాబు సర్కారు ఇప్పుడు ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు ఎంపిక చేసుకున్న ప్రైవేట్ శిక్షణ సంస్థల జేబులు నింపి కమీషన్లు కాజేసే ఎత్తుగడ వేసింది. ఇందులో భాగంగానే నిరుద్యోగులకు అరకొరగా భృతి పేరుతో మంగళవారం హడావుడి చేసింది. కనీసం కేబినెట్ భేటీలో ప్రకటించిన సంఖ్య ప్రకారమైనా నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఆ సమావేశం నిర్ణయాలనే అపహాస్యం పాలు చేసింది. ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలోని 1.70 కోట్ల కుటుంబాలకు ఉద్యోగం / నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి ఉంది. పలు దఫాలుగా నిరుద్యోగుల సంఖ్యను కుదించి వడపోసిన సర్కారు చివరకు 12 లక్షల మందికిపైగా భృతికి అర్హులని తేల్చింది. కనీసం ఈ ప్రకారమైనా భృతి ఇవ్వకపోగా 4 లక్షల మందికి మాత్రమే చెల్లిస్తామంటూ జీవో ఇచ్చింది. అయితే ఇందులోనూ సగం మంది మాత్రమే ఇప్పటిదాకా భృతికి అర్హులంటూ తేల్చడం గమనార్హం. మరోవైపు నిరుద్యోగులకు ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ కింద నెలకు రూ.వెయ్యి ఇస్తామంటున్న సర్కారు వారికి నైపుణ్యాల పెంపుపై శిక్షణ పేరుతో ప్రైవేట్ సంస్థలకు నెలకు రూ.12 వేల చొప్పున రూ.480 కోట్ల దాకా చెల్లించేందుకు సిద్ధపడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, అమరావతి: గత ఎన్నికల ముందు ఇంటికో జాబు ఇస్తామని, జాబు ఇవ్వకుంటే నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగులందరికీ భృతి చెల్లిస్తామంటూ చంద్రబాబు సంతకంతో కూడిన పత్రాలను ఇంటింటికి పంపిణీ చేయడం తెలిసిందే. నాలుగున్నరేళ్లుగా నిరుద్యోగ భృతి కింద పైసా ఇవ్వకపోగా ఇప్పుడు ఎన్నికల ముందు కేవలం నాలుగు లక్షల మందికి నెలకు రూ.వెయ్యి చొప్పున భృతి చెల్లించేందుకు అక్టోబర్ నెలకు రూ.40 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. భృతి కింద నిరుద్యోగులకు నెలకు కేవలం రూ.వెయ్యి ఇవ్వనుండగా వారికి శిక్షణ ఇచ్చేందుకు ప్రైవేట్ సంస్థలకు మాత్రం నెలకు రూ.12,000 చెల్లించనుండటం గమనార్హం. నిరుద్యోగికి భృతి కింద నెలకు రూ.వెయ్యి మాత్రమే ఇవ్వడమేమిటో.. వారికి శిక్షణ ఇచ్చే ప్రైవేట్ సంస్థలకు నెలకు రూ.12,000 చొప్పున ఇవ్వడమేమిటో అర్థం కావడం లేదని, ఇదంతా చూస్తుంటే పెద్దఎత్తున దోపిడీకి తెరతీసినట్లు తెలిసిపోతోందని అధికార యంత్రాంగం వ్యాఖ్యానిస్తోంది. ఇవ్వాల్సింది 1.70 కోట్ల మందికి.. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.70 కోట్ల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం లేదంటే నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పలు షరతులతో నిరుద్యోగ యువత సంఖ్యను భారీగా తగ్గించేసింది. తొలుత నిరుద్యోగ భృతికి 10 లక్షల మంది అర్హులని ప్రకటించింది. ఆ తర్వాత కేబినెట్ సమావేశంలో 12,26,333 మంది భృతికి అర్హులని తేల్చింది. అయితే ఇప్పుడు ఈ ప్రకారం కూడా నిరుద్యోగులకు భృతి ఇవ్వడం లేదు. సోమవారం వరకు 2.10 లక్షల మంది భృతికి అర్హులని తేల్చింది. 1.86 లక్షల మందికి రూ.వెయ్యి చొప్పున ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. భృతిలోనూ కమీషన్ల పర్వం.. జీవో ప్రకారం భృతి కింద 4 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు రూ.40 కోట్లు చెల్లించనుండగా వారికి శిక్షణ ఇచ్చే ప్రైవేట్ సంస్థలకు మాత్రం నెలకు రూ.12,000 చొప్పున రూ.480 కోట్లను సర్కారు చెల్లించనుంది. ఇక్కడ దోపిడీకి ఎత్తుగడ వేశారనేది వెల్లడవుతోందని, ఆఖరికి నిరుద్యోగుల అరకొర భృతిలోనూ కమీషన్లను వదలడం లేదని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. నిరుద్యోగ భృతి కింద పరిపాలనా వ్యయం కోసం పది శాతం నిధులను జిల్లాస్థాయిలో, మరో పది శాతం నిధులను రాష్ట్రస్థాయిలో వ్యయం చేయాలని నిర్ణయించారు. ఇక ఈ పథకం ప్రచారం కోసం ఏకంగా రూ.6.40 కోట్ల వ్యయం చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. ఇదంతా ఎన్నికల ముందు హడావిడి తప్ప నిరుద్యోగులకు ఆర్థిక సాయం, పథకాన్ని అమలు చేయాలనే చిత్తశుద్ధి కానరావడం లేదని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో భృతి కోసం కేటాయించిన రూ.వెయ్యి కోట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ప్లాన్ల నుంచి వెచ్చించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రైవేట్ సంస్థలకు నెలకు రూ.12 వేలు కేబినెట్లో పేర్కొన్న లెక్కల మేరకు 12.26 లక్షల మందికి నెలకు రూ.వెయ్యి చొప్పున భృతి ఇవ్వడానికి రూ.122 కోట్ల వ్యయం అవుతుందని, 6 నెలలపాటు దీన్ని అమలు చేయడానికి రూ.732 కోట్ల వ్యయమవుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఇక భృతి చెల్లించే 12.26 లక్షల మందికి శిక్షణ ఇచ్చేందుకు నెలకు ఒక్కో నిరుద్యోగికి రూ.12,000 చొప్పున వ్యయం అవుతుందని పేర్కొంది. అంటే ప్రైవేట్ సంస్థల్లో నెల పాటు శిక్షణ కోసం రూ.1,500 కోట్ల వ్యయమవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఇప్పుడు అక్టోబర్‌లో కేవలం నాలుగు లక్షల మందికే భృతి ఇచ్చేందుకు రూ.40 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నాలుగు లక్షల మందికి శిక్షణ కోసం నెలకు రూ.12,000 చొప్పున ప్రైవేట్ శిక్షణ సంస్థలకు ప్రభుత్వం చెల్లిస్తుంది. -
ఆసరా పింఛన్లు పెంపు!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ ముందుకు సాగుతోంది. ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసి ప్రత్యర్థులకు షాక్ ఇచ్చిన గులాబీ పార్టీ.. ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోకు సాన పెడుతోంది. ఆసరా పింఛన్ల పెంపు, నిరుద్యోగ భృతి అంశాలను మేనిఫెస్టోలో చేర్చాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలిసింది. 2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయంలో మేనిఫెస్టో బాగా ప్రభావం చూపింది. అప్పటి హామీలు, ముఖ్యంగా బంగారు తెలంగాణ నినాదం ప్రజలకు బాగా చేరింది. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఇదే పంథాతో వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే మేనిఫెస్టో రూపకల్పనకు టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు నేతృత్వంలో 14 మంది నేతలతో కమిటీ నియమించారు. మంత్రులు కేటీఆర్, చందూలాల్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి కమిటీలో ఉన్నారు. కమిటీ తొలి సమావేశం ఈ నెల 15న జరగనుంది. ఆరోజే మేనిఫెస్టో నివేదికను కేసీఆర్‌కు అందించే అవకాశం ఉంది. వికలాంగులకు రూ.2 వేలు!: మేనిఫెస్టోలో కొత్త హామీలు తక్కువగానే ఉండనున్నాయి. ప్రస్తుతం ఆసరా పథకం కింద రాష్ట్రంలో 40 లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు. వికలాంగులకు నెలకు రూ.1,500.. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ, చేనేత, గీత కార్మికులు, బోదకాలు బాధితులకు రూ.1,000 చొప్పున చెల్లిస్తున్నారు. వికలాంగులకు రూ.2,000, ఇతర వర్గాలకు రూ.1,500లకు పింఛన్ పెంచే అవకాశాలపై టీఆర్ఎస్ యోచిస్తున్నట్లు తెలిసింది. అలాగే నిరుద్యోగ భృతి చెల్లింపు అంశమూ మేనిఫెస్టోలో చేర్చే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో 8 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది. -
యువనేస్తం.. రిక్తహస్తం!
పశ్చిమగోదావరి , వీరవాసరం: అబద్దపు హామీలు, బూటకపు వాగ్దానాలతో అందలమెక్కిన సీఎం చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తుండటంతో నిరుద్యోగభృతి అంశాన్ని తెరపైకి తెచ్చారు. గత ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం లేదంటే నిరుద్యోగభృతి అంటూ ఊదరగొట్టిన చంద్రబాబు గద్దెనెక్కి నాలుగున్నరేళ్లు సమీపిస్తున్నా దీని ఊసు ఎత్తలేదు. చివరకు ఎన్నికలు దగ్గరపడటంతో నిరుద్యోగభృతి అమలుకు మార్గనిర్దేశాలు ప్రకటించారు. నెలకు రూ.2,500 ఇస్తానన్న భృతిని రూ.1,000కు తగ్గించారు. దీనిపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నా ఏమాత్రం పట్టించుకోని పాలకులు మరో మాయోపాయానికి తెరదీశారు. భృతి కింద ఇచ్చే రూ.1,000ను టీడీపీ కార్యకర్తలకు అందేలా కంప్యూటర్లో ఉన్న అనుసంధాన లింకును ఏమార్చారు. ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో నిరుద్యోగభృతి కోసం ఏర్పాటు చేసిన లింకు ద్వారా అర్హులైన వారంతా ఆన్లైన్ చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుద్యోగులు తమ దరఖాస్తులను ఆన్లైన్ చేసుకోవడానికి ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి యువనేస్తం వెబ్‌సైట్‌ను దాదాపు 15 రోజుల క్రితం ఏర్పాటుచేసినా దరఖాస్తుల స్వీకరణను మాత్రం మంగళవారం నుంచి ప్రారంభించారు. దరఖాస్తుల స్వీకరణకు కేవలం 48 గంటలు మా త్రమే లింకు ఓపెన్‌లో ఉండేలా ఏర్పాటుచేశారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రానికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10,500 మంది మాత్ర మే దరఖాస్తులను ఆన్లైన్ చేయించగలిగారు. కేవలం 48 గంటలు మాత్రమే గడువు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు ఎదురవడంతో గడువు పొడిగిస్తూ ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈనెల 12వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు విధించింది. గందరగోళానికి గురిచేసేలా ముందు 48 గంటలు గడువు ఇవ్వడం, తర్వాత దానిని పొడిగించడం ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తోందని నిరుద్యోగులు అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎందరో నిరుద్యోగులకు పూర్తిస్థాయి సమాచారం లేకుండానే లింకు ప్రారంభించి క్లోజ్ చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు కావాల్సిన వారికి ముందుగా విషయాన్ని చేరవేసి వారికి మాత్రమే లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతోనే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుందని అంటున్నారు. అర్హతలు ఇవే.. ♦ ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి. ♦ 22 నుంచి 35 ఏళ్ల వయసు ఉండాలి. ♦ 10వ తరగతి, డిగ్రీ లేదా పాలిటెక్నిక్ ఉత్తీర్ణత సాధించాలి. ♦ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గతంలో ఏ లబ్ధిని పొంది ఉండకూడదు. ♦ ఎటువంటి క్రిమినల్ కేసుల్లోనూ దోషిగా ఉండకూడదు. ♦ నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. ♦ 2.5 ఎకరాలపైన, మెట్ట వ్యవసాయం అయితే 5 ఎకరాలపైన ఉండకూడదు. ♦ ప్రభుత్వ, ప్రైవేట్ ఇతర అనుబంధ ♦ సంస్థల్లో ఉద్యోగి అయి ఉండరాదు. దరఖాస్తు సమయంలో ఆధార్ కార్డు, ఎస్ఎస్సీ సర్టిఫికెట్స్, ఉత్తీర్ణత పత్రాలు, బ్యాంక్ పాస్ పుస్తకం జతచేయాలి. ఇది సరికాదు నిరుద్యోగభృతి కోసం ఎటువంటి సమాచారం లేకుండా చేయడం దారుణం. రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో నిరుద్యోగులు ఉన్నారు. వారంతా కేవలం 48 గంటల్లో దరఖాస్తులు ఆన్లైన్ చేసుకోవడం ఎలా సాధ్యమవుతుంది. దీనిపై సర్వత్రా విమర్శలు ఎదురవడంతో గడువును పొడిగించారు. ఇలాంటి నిర్ణయాలు ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తాయి. – వేండ్ర దివాకర్, వీరవాసరం