సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులకు తాజా బడ్జెట్ భారీ ఊరటనిచ్చింది. ఎన్నికల హామీలో భాగంగా నిరుద్యోగులకు నెలకు రూ.3,016 ఆర్థిక సాయం ఇస్తామని టీఆర్‌ఎస్ చేసిన హామీని నిలబెట్టుకుంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 2019–20 బడ్జెట్‌లో నిరుద్యోగుల భృతికి భారీ మొత్తంలో నిధులు కేటాయించారు. ఈ వార్షికానికి రూ.1,810 కోట్లు బడ్జెట్‌లో పొందుపర్చారు. ప్రస్తుత బడ్జెట్‌లో నిధులు కేటాయించిన ప్రభుత్వం నిరుద్యోగ భృతికి మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను ఆదేశించింది. తాజాగా బడ్జెట్‌లో పేర్కొన్న నిధులతో ఏడాదిపాటు ఐదులక్షల మందికి నిరుద్యోగ భృతి అందించవచ్చు.
నిరుద్యోగులు 13.65 లక్షలు
నిరుద్యోగుల గణాంకాలపై ప్రభుత్వం వద్ద స్పష్టమైన వివరాల్లేవు. నిరుద్యోగ భృతికి ఎంప్లాయిమెంట్ ఎక్సే్చంజ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా ఎంప్లాయిమెంట్ ఎక్సే్చంజ్‌లో 13.65 లక్షల మంది నమోదయినట్లు కార్మిక, ఉపాధి కల్పన శాఖ గణాం కాలు చెబుతున్నాయి. సాధారణంగా పదోతరగతి పూర్తి చేసుకున్న ప్రతి వ్యక్తి ఎంప్లాయిమెంట్ ఎక్సే్చంజ్‌లో నమోదు చేసుకోవాలి. అలా నమోదు పత్రాన్ని చూపిన తర్వాతే ఉద్యోగాల్లో చేరేందుకు అర్హత ఇవ్వాలని ఎంప్లాయిమెంట్ ఎక్సే్చంజ్ నిబంధనలున్నాయి. కానీ వీటి అమలు పక్కాగా జరగడం లేదు. కొన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు మాత్రమే ఎంప్లాయి మెంట్ ఎక్సే్చంజి నిబంధనలు అమలు చేస్తు న్నాయి.
ఈ నేపథ్యంలో సీనియార్టీ కోసమో, లేక ఇతర ఆధారాల కోసం తప్ప పేరు నమోదుపై నిరుద్యోగులు సైతం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తాజాగా ఎంప్లాయిమెంట్ ఎక్సే్చంజి ఆన్‌లైన్ నమోదుకు అవకాశం ఇవ్వడంతో రెండేళ్లలో అద నంగా 5లక్షల మంది నమోదు చేసుకున్నారు. మరోవైపు ఉద్యోగాల భర్తీకి సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఓటీఆర్ (ఒన్‌టైమ్ రిజిస్ట్రేషన్) నమోదుకే పరిమితం చేస్తున్నాయి. ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీలో ఓటీఆర్ చేసుకున్న వారి సంఖ్య 20 లక్షలకు పైమాటే. నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం మార్గదర్శ కాలు రూపొందిస్తే కేటగిరీల వారీగా ఉన్న నిరు ద్యోగుల లెక్కలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment