ముంబై: మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ యువతకు భారీ హామీలను ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు నెలకు రూ. 5,000 నిరుద్యోగ భృతి ఇస్తామని తెలిపింది. రాష్ట్రంలోని సంస్థల్లో 80 శాతం ఉద్యోగాలు స్థానిక యువతకే ఇస్తామని హామీ ఇచ్చింది. ఉన్నత విద్య చదివే యువతకు, ఇతర దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేవారికి స్కాలర్‌షిప్‌లు ఇస్తామని ప్రకటించింది. వికలాంగ యువత ఉన్నత విద్యకు అయ్యే మొత్తాన్ని తామే భరిస్తామని తెలిపింద.
‘మేలుకో మహారాష్ట్ర.. రేపటి కోసం ఇప్పుడే పనిచేయి’ అన్న ప్లాట్‌ఫాం కింద మూడు కోట్ల మంది యువత పాల్గొన్నారని, వారి ఆలోచన ప్రతిబింబమే తాము ప్రకటించిన యూత్ కాంగ్రెస్ మేనిఫెస్టో అని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యజీత్ తంబే తెలిపారు. యువతాభివృద్ధి మంత్రిత్వ శాఖ కింద యువతకు ప్రత్యేక మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. కఠినమైన డ్రగ్ చట్టాలు, విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం వంటివి కల్పిస్తామని హామీ ఇచ్చారు. లైఫ్‌స్టైల్ మేనేజ్‌మెంట్, సివిక్స్ వంటి సబ్జెక్టులను విద్యలో భాగం చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment