సాక్షి, హైదరాబాద్: టికెట్ల కేటాయింపు విషయంలో పార్టీ అధిష్టానం అనుసరిస్తున్న వైఖరితో యూత్ కాంగ్రెస్ నాయకత్వం నారాజ్ అవుతోంది. ప్రతి ఎన్నికల్లోనూ యూత్ కోటాలో 3–7 టికెట్లు కేటాయిస్తారని, కానీ ఈసారి మాత్రం తమను పరిగణనలోకి తీసుకోకపోవడంతో యూత్ కాంగ్రెస్ నేతలు నైరాశ్యంలో మునిగిపోతున్నారు. ఇందుకు నిరసనగా యూత్‌కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం కావాలని భావిస్తున్నారు. ఈసారి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి వనపర్తి టికెట్ ఆశిస్తున్నారు.
ఒకవేళ వనపర్తి కాకపోయినా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రెండేళ్లుగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అనేక పోరాటా లు చేసి విద్యార్థులు, యువత పక్షాన నిలబడ్డామని, ఈ ఎన్నికల్లో తమకు పోటీ చేసే అవకాశం కల్పించాలని అడుగుతున్నారు. తద్వారా యువకులకు పార్టీ ప్రాధాన్యతమిస్తుందనే సంకేతాలను పంపాలని చెబుతున్నారు. వనపర్తితో పాటు దేవరకొండ, అంబర్‌పేట లాంటి సీట్లను తమకు కేటాయించాలని యూత్ కాంగ్రెస్ నేతలు కోరుతున్న నేపథ్యంలో అధిష్టానం ఏం చేస్తుందో వేచిచూడాల్సిందే.
నేడు ‘బుజ్జగింపు’ భేటీ?
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం గాంధీభవన్‌లో కీలక సమావేశం నిర్వహించాలని నిర్ణ యించారు. అయితే, చాలామంది యూత్‌కాంగ్రెస్ నేతలు నిరాశలో ఉన్న మాట వాస్తవమేనని, వారందరూ రాజీనామాలు చేయాలనే భావనలో ఉన్నప్ప టికీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి కాంగ్రెస్‌లోనే ఉంటారని, వారిని బుజ్జగించేందుకే ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారనే చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment