దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారు
ఈశాన్య ప్రాంతాల ప్రజలు చైనీయుల్లా ఉంటారు
పశి్చమ ప్రాంతాల జనం అరబ్బుల్లాగా, ఉత్తరాది ప్రజలు శ్వేతజాతీయుల్లాగా ఉంటారు
ఓవర్‌సీస్ కాంగ్రెస్ చైర్మన్ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: అమెరికాలో అమల్లో ఉన్న వారసత్వ పన్ను తనకు బాగా నచి్చందని, అది న్యాయంగా ఉందని వ్యాఖ్యానించి రాజకీయ వివాదానికి తెరతీసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శామ్ పిట్రోడా ఆ గొడవ సద్దుమణగ ముందే మరో దుమారం సృష్టించారు. దక్షిణ భారతదేశ ప్రజలు అఫ్రికన్లలా ఉంటారని ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పిట్రోడాను సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం తప్పుపట్టారు.
తాజాగా ఓ పత్రికకు ఇచి్చన ఇంటర్వ్యూలో శామ్ పిట్రోడా మాట్లాడుతూ... భారత్ విభిన్నమైన దేశం అని అభివరి్ణస్తూ కొన్ని పోలికలను ప్రస్తావించారు. అవే ఆయనను ఇప్పుడు ఇరకాటంలోకి నెట్టేశాయి. ‘‘మనది లౌకిక దేశం. బ్రిటిష్ పాలకులపై మన స్వాతంత్య్ర సమరయోధులు సాగించిన పోరాటాల వల్ల భారత్ లౌకిక దేశంగా ఆవిర్భవించింది. ప్రపంచవ్యాప్తంగా మనది ఉత్తమమైన ప్రజాస్వామ్య దేశం. 75 ఏళ్లుగా ప్రజలు సంతోషకరమైన వాతావరణంలో కలిసిమెలిసి జీవిస్తున్నారు. అక్కడక్కడా జరిగిన చిన్నపాటి గొడవలను పక్కనపెడితే ఇక్కడెంతో వైవిధ్యం, భిన్నత్వం కనిపిస్తాయి.
భారత్‌లో ఈశాన్య ప్రాంతాల ప్రజలు చైనీయుల్లా, పశి్చమ ప్రాంతాల జనం అరబ్బుల్లాగా, ఉత్తరాది ప్రజలు శ్వేతజాతీయుల్లాగా, దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్లలా కనిపిస్తారు. అది పెద్ద విషయం కాదు. ఏది ఎలా ఉన్నప్పటికీ మనమంతా సోదర సోదరీమణులం. దేశంలోని విభిన్నమైన భాషలు, మతాలు, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లను మనం పరస్పరం గౌరవించుకుంటున్నాం. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మన మూలాల్లోనే ఉన్నాయి’’ అని శామ్ పిట్రోడా చెప్పారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. మరోవైపు పిట్రోడా వ్యాఖ్యలతో తమ పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ వివరణ ఇచ్చింది.
పిట్రోడా రాజీనామా.. ఆమోదించిన అధిష్టానం
తన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీయడంతో శామ్ పిట్రోడా ఇండియన్ ఓవర్‌సీస్ కాంగ్రెస్ చైర్మన్ పదవికి బుధవారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను కాంగ్రెస్ అధిష్టానం వెంటనే ఆమోదించింది. రాజీనామా చేయాలన్నది పిట్రోడా సొంత నిర్ణయమని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment