allotment
-
‘మూసీ’ ప్రక్షాళన.. నిర్వాసితుల తరలింపు (ఫోటోలు)
-
తెలంగాణ హైకోర్టులో బాబుకు షాక్
-
ఒడవని జీవో 317 లొల్లి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలో జీవో 317 అమలుపై తీవ్ర గందరగోళం నెలకొంది. రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన నూతన జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపు చేపట్టేందుకు గత నెలలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించినప్పటికీ సాంకేతిక సమస్యలు నెలకొనడంతో అమలు తీరు అయోమయంలో పడింది. ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో 317 కేటగిరీలో దాదాపు నాలుగు వందల మందికి పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది. కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైన 550 మంది టీచర్ల సర్వీసు క్రమబద్ధీకరించిన అనంతరం వారికి కూడా జోన్ల కేటాయింపు, పోస్టింగ్ ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు ముందడుగు పడలేదు. కనీసం ఉద్యోగుల సీనియార్టీ జాబితాలు సైతం రూపొందించకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఉద్యోగుల సాధారణ బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం.సొసైటీ కార్యాలయంలో ఎవరికి వారే...జీవో 317 కింద ఉద్యోగుల కేటాయింపు, సీని యార్టీ జాబితాలపై ఉద్యోగులంతా ఎస్సీ గురు కుల సొసైటీ కార్యాలయం చుట్టూ తిరుగుతు న్నారు. గత నెల 24, 25 తేదీల్లో వీరికి వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉండగా... సాంకేతిక కారణాలతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. దాదాపు పది రోజులు గడిచినా ఇప్పటివరకు ఈ అంశంలో ఎలాంటి పురోగతి లేదు. దీంతో సొసైటీ కార్యాలయంలో సంబంధిత అధికారులను సంప్రదించినప్పటికీ తమకేమీ తెలియదంటూ చేతులు దులిపేసుకుంటున్నా రని ఉద్యోగులు మండిపడుతున్నారు. ప్రస్తు తం ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ మొదలైంది. ఎస్టీ గురుకుల సొసైటీలో ఉద్యో గుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఈనెల 20వ తేదీనాటికి బదిలీల ప్రక్రియ ముగించాలని రాష్ట్ర ప్రభు త్వం స్పష్టం చేసింది. ఇతర గురుకుల సొసైటీ లన్నీ వేగవంతంగా ప్రక్రియ పూర్తిచేస్తుండగా.. ఎస్సీ గురుకుల సొసైటీలో నెలకొన్న విచిత్ర పరిస్థితితో ఉద్యోగులంతా తలపట్టుకుంటున్నా రు. ముందుగా జీవో 317 కేటాయింపుల తర్వాత సాధారణ బదిలీలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు వారు సిద్ధమవుతున్నట్లు సమాచారం. జీవో 317 బాధితులు ఆందోళన చెందొద్దుజీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులు ఏమాత్రం ఆందోళన చెందవద్దని.. వారికి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేస్తుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చారు. జీవో 317 బాధిత ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో శనివా రం మంత్రి తన క్యాంపు కార్యాలయంలో సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు వివరించిన అంశాలను విన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జీవో 317 బాధిత ఉద్యోగులు, స్పౌజ్ బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్‌కమిటీ శాశ్వత పరిష్కారం చూపుతుందని స్పష్టం చేశారు. అతి త్వరలో కేబినెట్ సబ్ కమిటీ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డికి తుది నివేదిక అందించనుందని వెల్లడించారు. -
Modi 3.0: కీలక శాఖలన్నీ బీజేపీ వద్దే
న్యూఢిల్లీ: అనుభవానికి పెద్దపీట వేస్తూ, అదే సమయంలో యువతకు సముచిత ప్రాధాన్యమిస్తూ నూతన కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. కసరత్తులో ఆసాంతం మోదీ–షా ముద్రే ప్రతిఫలించింది. పదేళ్లుగా మోదీ తొలి, మలి మంత్రివర్గాల్లో కీలకంగా వ్యవహరించిన బీజేపీ మంత్రులకు ఈసారీ ప్రాధాన్యం కొనసాగింది. హోం శాఖ బాధ్యతలు మరోసారి అమిత్ షానే చేపట్టగా రాజ్‌నాథ్‌సింగ్ రక్షణ, నిర్మలా సీతారామన్ ఆర్థిక, జైశంకర్ విదేశాంగ శాఖల్లో కొనసాగనున్నారు. మోదీతో పాటు మొత్తం 72 మందితో ఆదివారం ఎన్డీఏ మంత్రివర్గం కొలువుదీరడం తెలిసిందే. మోదీ సిఫార్సు మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వారికి సోమవారం శాఖలు కేటాయించారు. గత రెండుసార్లకు భిన్నంగా ఈసారి బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వ మనుగడలో ఎన్డీఏ పక్షాలు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో టీడీపీ, జేడీ(యూ) తదితర భాగస్వాములకు శాఖల కేటాయింపులో సముచిత ప్రాధాన్యమే దక్కినా కీలక శాఖలన్నింటినీ బీజేపీయే అట్టిపెట్టుకునేలా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నట్టు స్పష్టంగా కని్పంచింది. కీలక శాఖలు కావాలని జేడీ(యూ), టీడీపీ ముందుగానే కోరినా కుదరదని బీజేపీ పెద్దలు స్పష్టం చేయడం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే వ్యూహాత్మక ప్రాధాన్యమున్న అత్యధిక పోర్టుఫోలియోలు బీజేపీ మంత్రులకే దక్కాయి. దేశవ్యాప్తంగా రోడ్డు నెట్వర్క్ అభివృద్ధి, విస్తరణ, ఆధునీకరణలో తనదైన మార్కు చూపిన నితిన్ గడ్కీరీకి మరోసారి రోడ్లు–హైవే శాఖ దక్కింది. మోదీకి ప్రీతిపాత్రుడైన అశ్వినీ వైష్ణవ్‌కు కీలకమైన రైల్వే, ఐటీ–ఎలక్ట్రానిక్స్ శాఖలను కొనసాగించడమే గాక సమాచార–ప్రసార శాఖ బాధ్యతలు కూడా కట్టబెట్టడం విశేషం. గత ప్రభుత్వంలో ఆ బాధ్యతలు చూసిన అనురాగ్ ఠాకూర్‌కు ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం తెలిసిందే. ఆయనకు బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించవచ్చని వార్తలొస్తున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్‌కు విద్య, పీయూష్ గోయల్‌కు వాణిజ్య, పరిశ్రమల శాఖలను కొనసాగించారు. హర్దీప్సింగ్ పురికి పెట్రోలియం శాఖను కొనసాగిస్తూ హౌజింగ్–పట్టణ వ్యవహారాలను తప్పించారు. తొలుత న్యాయ, తర్వాత అర్త్ సైన్సెస్ బాధ్యతలు చూసిన కిరెణ్ రిజిజుకు ప్రధానమైన పార్లమెంటరీ వ్యవహారాలు అప్పగించారు. ‘మామ’కు వ్యవసాయం రాష్ట్రాల్లో ఏళ్ల తరబడి చక్రం తిప్పి కొత్తగా మోదీ కేబినెట్లో చేరిన బీజేపీ దిగ్గజాలకు ప్రధాన శాఖలే కేటాయించారు. వారిలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌కు కీలకమైన వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖలు దక్కాయి. ఐదేళ్ల తర్వాత కేబినెట్లో అడుగు పెట్టిన బీజేపీ అధ్యక్షుడు జగత్‌ప్రకాశ్ నడ్డాకు మరోసారి మోదీ తొలి మంత్రివర్గంలో నిర్వర్తించిన ఆరోగ్య శాఖతో పాటు ఎరువులు–రసాయనాల శాఖ కూడా దక్కింది. ఇప్పటిదాకా ఆ రెండు శాఖలనూ మాండవీయ చూశారు. హరియాణా మాజీ సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌కు విద్యుత్‌తో పాటు పట్టణ వ్యవహారాలను అప్పగించారు. న్యాయ శాఖకు అర్జున్‌రాం మేఘ్వాల్, షిప్పింగ్‌కు సర్బానంద సోనోవాల్, పర్యావరణానికి భూపేందర్ యాదవ్, సామాజిక న్యాయానికి వీరేంద్ర కుమార్ కొనసాగారు. గిరిజన శాఖ బాధ్యతలు జ్యుయల్ ఓరంకు దక్కాయి. తెలుగు రాష్ట్రాల నుంచి... మోదీ 3.0 మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటు దక్కడం తెలిసిందే. వారిలో కిషన్‌కు బొగ్గు, గనులు, ఏపీ నుంచి టీడీపీకి చెందిన రామ్మోహన్‌కు విమానయానం రూపంలో కేబినెట్ హోదా బెర్తులు దక్కాయి. గతంలో వాజ్‌పేయి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా టీడీపీ నేత అశోక్ గజపతిరాజు పౌర విమానయాన శాఖ మంత్రిగా చేశారు. తెలంగాణ నుంచి బండి సంజయ్‌కుమార్, ఏపీ నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మ, టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్‌కు సహాయ మంత్రి పదవులు దక్కడం తెలిసిందే. బండికి హోం శాఖ కేటాయించారు. వర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కు, పెమ్మసానికి గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల రూపంలో రెండేసి శాఖల బాధ్యతలు అప్పగించారు. భాగస్వాములకు ఇలా... ఎన్డీఏ భాగస్వాముల్లో జేడీ(యూ) నేత లలన్‌సింగ్‌కు పంచాయతీరాజ్, మత్స్య–పశుసంవర్ధకం–పాడి శాఖలు దక్కాయి. వ్యవసాయ శాఖపై ఆశలు పెట్టుకున్న జేడీ(ఎస్) చీఫ్ కుమారస్వామికి ఉక్కు, భారీ పరిశ్రమల బాధ్యతలు అప్పగించారు. హెచ్ఏఎం(ఎస్) చీఫ్ జితన్‌రాం మాంఝీకి ఎంఎస్ఎంఈ; ఎల్జేపీ (ఆర్వీ) అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్‌కు ఫుడ్ ప్రాసెసింగ్, టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖలు దక్కాయి. భాగస్వామ్య పక్షాలకు ఐదు కేబినెట్, రెండు స్వతంత్ర, నాలుగు సహాయ పదవులివ్వడం తెలిసిందే. ఇక స్వతంత్ర హోదా మంత్రుల్లో శివసేన నుంచి జి.పి.జాదవ్‌కు ఆయు‹Ù, ఆరెల్డీ నేత జయంత్ చౌదరికి నైపుణ్యాభివృద్ధి శాఖలిచ్చారు. -
టీడీపీలో ఆగ్రహ జ్వాల
సాక్షి నెట్వర్క్: టీడీపీలో మూడోవిడత టికెట్ల జాబితాపై ఆపార్టీ శ్రేణుల్లో ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. టికెట్ మంటలు రాజుకుంటున్నాయి. ఇప్పటికే టికెట్ వస్తుందని ఆశపెట్టుకున్నవారంతా జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో ఆందోళనబాట పట్టారు. తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. వారి అనుయాయులు పార్టీ జెండాలను, ఫ్లెక్సీలను మంటల్లో వేసి తగులబెట్టారు. మొత్తమ్మీద రాష్ట్ర వ్యాప్తంగా తలెత్తిన వ్యతిరేక పవనాలు పార్టీ అధిష్టానం కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. శ్రీకాకుళంలో గుండ లక్ష్మీదేవి, పాతపట్నంలో కలమట వెంకటరమణను కాదని రూ. కోట్లు ముట్టచెప్పినవారికి టికెట్లు ఇచ్చారంటూ టీడీపీలోని సీనియర్ కేడర్ రగిలిపోయింది. పార్టీ కరపత్రాలు, బ్రోచర్లు, ఇతరత్రా మెటీరియల్‌ను తగలబెట్టి తమ నిరసన తెలియజేశారు. ‘తెలుగుదేశం పార్టీ వద్దు.. సైకిల్ గుర్తు అసలొద్దు.. టీడీపీ జెండాలు.. చంద్రబాబు అజెండా మనకొద్దు’ అంటూ శ్రీకాకుళంలో ఆ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శ్రీకాకుళంలో సీనియర్ నాయకుడు గుండ అప్పల సూర్యనారాయణ, లక్ష్మీదేవి దంపతులకు పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని, ఆమెకు సీటు రాకుండా అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడు అడ్డుకున్నారని తెలుగు తమ్ముళ్లు ఒంటి కాలితో లేచారు. ఏ మాత్రం పట్టులేని గొండు శంకర్‌కు టికెట్ ఇచ్చి, సీనియర్లకు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. చంద్రబాబు, లోకేశ్ ఫొటోలను ధ్వంసం చేసి, మంటల్లో తగలెట్టారు. రానున్న ఎన్నికల్లో ఎంపీ రామ్మోహన్నాయుడిని ఓడించి తీరుతామని శపథం చేశారు. ఈ సందర్భంగా ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని గుండ ఫ్యావిులీపై అనుచరులంతా ఒత్తిడి చేశారు. లేదంటే వైఎస్సార్సీపీలో చేరాలని కోరారు. శుక్రవారం సాయంత్రం తన అనుయాయుల అభీష్టం మేరకు ఇండిపెండెంట్‌గా పోటీకి దిగనున్నట్టు మాజీ శాసనసభ్యురాలు గుండ లక్ష్మీదేవి ప్రకటించారు. అప్పలసూర్యనారాయణ కూడా ఇండిపెండెంట్‌గా ఎంపీగా బరిలోకి దిగాలని కార్యకర్తలు కోరగా ఆదివారం దీనిపై నిర్ణయం తీసుకుందామని చెప్పారు. పాతపట్నంలో మూకుమ్మడి రాజీనామాలు పాతపట్నంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు చంద్రబాబు మొండి చేయి చూపడంతో ఆయన అనుచరులు మండిపడ్డారు. పది కార్లు వేసుకుని, పదిమందిని వెంట బెట్టుకుని, నియోజకవర్గంలో షో చేసిన మామిడిగోవిందరావుకు టికెట్ ఇవ్వడంపై వారు నిరసన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో టీడీపీ ఎలా గెలుస్తుందో చూస్తామని సవాల్ చేశారు. ఈ సందర్భంగా పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట, కొత్తూరులో కలమటకు మద్దతుగా రోడ్డెక్కి టీడీపీ ఫ్లెక్సీలు, కరపత్రాలను తగలబెట్టారు. పార్టీ మండలాధ్యక్షులు సైతం రాజీనామా చేశారు. చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడు తదితరుల ఫ్లెక్సీలను మంటల్లో దహనం చేశారు. నిరసన ర్యాలీలు చేసి, కలమట అనుచరులంతా మూకుమ్మడిగా పార్టీకి రాజీనామాలు చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర కార్యదర్శి పదవికి గొంపకృష్ణ రాజీనామా విజయనగరం జిల్లా శృంగవరపుకోట అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పేరును ఖరారు చేయడంతో ఇప్పటివరకూ అక్కడి టికెట్‌కోసం ఎదురుచూసిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ అసంతృప్తితో రగిలిపోయారు. పార్టీ పదవికి రాజీనామా చేసి, ఇండిపెండెంట్‌గా బరిలో దిగనున్నట్టు ప్రకటించారు. ఆయనతో పాటు వేపాడ, కొత్తవలస, జామి మండలాల టీడీపీ అధ్యక్షులు గొంప వెంకటరావు, గొరపల్లి రాము, లగుడు రవికుమార్, విశాఖ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు రాయవరపు చంద్రశేఖర్, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గుమ్మడి భారతి వారి పదవులకు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం తన అభిమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో గొంపకృష్ణ మాట్లాడుతూ ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతానని ప్రకటించారు. టీడీపీ కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి ఉన్న తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తును పెయింట్‌తో చెరిపేశారు. అమలాపురంలో అసంతృప్తి జ్వాలలు అమలాపురం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా అయితాబత్తుల ఆనందరావును, పార్లమెంట్ అభ్యర్థిగా గంటి హరీష్‌ను పార్టీ అధిష్టానం ఎంపిక చేయడంపై అక్కడి నాయకులు మండిపడుతున్నారు. ఆనందరావుకు సీటు రాకుండా రాజప్ప సోదరుడు నిమ్మకాయల జగ్గయ్యనాయుడు ఆధ్వర్యంలో పరమట శ్యామ్‌కుమార్ గట్టి ప్రయత్నం చేశారు. అయినా ఆయనకే టికెట్ కేటాయించడంతో నాయకులు, కార్యకర్తలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఎన్నికలలో తగిన గుణపాఠం చెబుతామని వారు హెచ్చరించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన వారిలో జనసేన నాయకులు కూడా ఉండటం గమనార్హం. ఆదిమూలంను మార్చాలని డిమాండ్ తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోనేటి ఆదిమూలంను ప్రకటించడంపై సత్యవేడు, నాగలాపురం మండలాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మదనంబేడులో శుక్రవారం సాయంత్రం పంచాయతీ పరిధిలో తెలుగు తమ్ముళ్లు నిరసన తెలిపారు. ఆదిమూలం టీడీపీ కార్యకర్తలపై చిన్నపాటి గొడవలను భూతద్దంలో చూపించి అట్రాసిటీ కేసులు పెట్టించారని గుర్తుచేశారు. అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేశారు. నాగలాపురంలో కూడా పలువురు తెలుగు తమ్ముళ్లు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు. రగిలిపోతున్న పోతిన మహేష్ విజయవాడ వెస్ట్ నుంచి సీటు ఆశిస్తున్న పోతిన మహేష్ భంగపాటుకు గురయ్యాడు. కానీ పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయిస్తున్నట్లు పవన్ తేల్చి చెప్పారు. ఈ ప్రకటనతో కంగుతిన్న మహేష్ డివిజన్ ఇన్చార్జిలు, కార్యకర్తలతో సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ నమ్మించి మోసం చేశారని, ఇలాగైతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని హెచ్చరికలు పంపారు. పురందేశ్వరి కోసం మమ్మల్ని బలి చేస్తారా? విపక్ష కూటమిలో రాజమహేంద్రవరం పార్లమెంటరీ స్థానం అభ్యర్థిత్వం కలకలం రేపుతోంది. టీడీపీ ప్రకటించిన మూడో జాబితాలో టీడీపీ నేత బొడ్డు వెంకట రమణ చౌదరి పేరు లేకపోవడంపై ఆ వర్గం నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. జనసేన కోసం ఇప్పటికే రాజానగరం ఎమ్మెల్యే సీటును త్యాగం చేసిన ఆయనకు.. ఇప్పుడు బీజేపీ కోసం ఎంపీ స్థానం వదుకోవాల్సి వస్తుందన్న ఆందోళన నెలకొంది. ఎంపీ టికెట్ అయినా వస్తుందనుకుంటే అదీ దక్కే అవకాశం కనిపించకపోవడంతో ఆ వర్గం టీడీపీ అధినేతపై మండిపడుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిని రాజమహేంద్రవరం ఎంపీగా బరిలోకి దింపేందుకు కమలనాథులు పావులు కదుపుతూండటంతో తన రాజకీయ భవిష్యత్తు ఏమిటని ఆయన కార్యకర్తల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకుంటే నట్టేట ముంచారని ఆయన పేర్కొన్నట్టు తెలిసింది. ఎక్కడ ‘పుట్టా’వో మాకెందుకు? ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా, టీటీడీ మాజీ చైర్మన్, కడప జిల్లా టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు పుట్టా మహేష్‌ను ఎంపిక చేయడంపై అక్కడి బీజేపీ నేతలు మండిపడుతున్నారు. టికెట్ ఇస్తామని సింగపూర్‌లో ఉన్న తనను రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఆర్థికంగా ఉపయోగించుకున్నారని, టీడీపీ జెండా మోయటానికే జనాలు ముందుకు రాని సందర్భంలో ఏడాది పాటు కష్టపడి పనిచేశానని ఎన్ఆర్ఐ గోరుముచ్చు గోపాల్ యాదవ్ చెప్పారు. తన అసంతృప్తిని వీడియో రూపంలో విడుదల చేశారు. బీసీలంటే యనమల కుటుంబం ఒక్కటేనా, ఆయన కుటుంబంలోనే మూడు టికెట్లు ఇస్తారా, మిగతా వెనకబడిన కులాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చాలా గ్రేట్ అని.. ఆయన ధైర్యాన్ని ఎప్పుడూ మెచ్చుకుంటానని, తాను ఆయనపై ఏమైనా విమర్శలు చేసి ఉంటే పార్టీ పరంగా తప్ప వేరేగా కాదని వివరించారు. ఈ నెల 25న కామవరపుకోటలో దగాపడ్డ బీసీ సోదరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ‘కడప నేత వద్దు– స్ధానిక బీజేపీ నేతలకే టికెట్ ఇవ్వాల’ని పార్లమెంట్ బీజేపీ కన్వీనర్ గాది రాంబాబు, దెందులూరు, చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్లు, పార్టీ వివిధ విభాగాల నేతలు విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. స్థానిక అశోక్ నగర్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ ఏలూరు టికెట్ విషయంలో బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకత్వాలు పునరాలోచన చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా కామవరపుకోట చెక్‌పోస్ట్ సెంటర్లో గోరుముచ్చు గోపాల్ యాదవ్ మద్దతుదారులు శుక్రవారం రాత్రి టైర్లకు నిప్పంటించి నిరసన తెలిపారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. -
ఆరని మంటలు.. బాబుకు చెమట్లు!
సాక్షి, అనకాపల్లి/సాక్షి, అమలాపురం/ అయినవిల్లి/మడకశిర/పెనుకొండ/ఉదయగిరి: రాష్ట్రంలో టికెట్ల కేటాయింపు వ్యవహారం టీడీపీలో కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. అభ్యర్థుల ఖరారు విషయంలో అధినేత అనుసరిస్తున్న వైఖరిపై బహిరంగంగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా జెండా మోసినవారిని పక్కన పెట్టి కొత్తగా వచ్చినవారికి అందలం ఎక్కించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోవైపు జనసేనతో పొత్తు నేపథ్యంలో ఆ పార్టీకి కేటాయించిన స్థానాల్లోనూ ఆందోళనలు మిన్నంటుతున్నాయి. అనకాపల్లిలో పెల్లుబికిన నిరసనలు అనకాపల్లి స్థానాన్ని టీడీపీ–జనసేన కూటమి తరఫున కొణతాల రామకృష్ణకు కేటాయించడంపై అక్కడి టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇన్నాళ్లుగా తాను పార్టీకోసం కష్టపడితే తనను పార్టీ అధిష్టానం గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా అక్కడి అభ్యర్థి కొణతాల తనను పట్టించుకోకుండా తన వ్యతిరేక వర్గమైన బుద్ధా నాగ జగదీశ్‌ను కలవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఈ విషయంలో తాడో పేడో తేల్చుకోవాలని పీలాపై ఆయన వర్గీయులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. బాబు సతీమణి భువనేశ్వరి అడ్డగింత ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తున్న నారా భువనేశ్వరిని యలమంచిలి వెళ్లే దారిలో కూండ్రం వద్ద పీలా గోవింద వర్గీయులు అడ్డుకున్నారు. అనకాపల్లి రూరల్ మండల అధ్యక్షుడు పచ్చికూర రాము ఆధ్వర్యంలో నాయకులు సుమారు 10 నిమిషాలపాటు రోడ్డుకు అడ్డంగా నిలబడి పీలా గోవిందకే అనకాపల్లి టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. అయితే భువనేశ్వరి కారు దిగి పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని హామీ ఇవ్వడంతో వారంతా తప్పుకున్నారు. తాడోపేడో తేల్చుకునేందుకు ‘బొల్లినేని’ నిర్ణయం నెల్లూరు జిల్లా ఉదయగిరి అభ్యర్థిగా తనను నియమించనందుకు ఇక తాడోపేడో తేల్చుకోవాలని అక్కడి టీడీపీ ఇన్చార్జి బొల్లినేని వెంకట రామారావు నిర్ణయించుకున్నారు. పన్నెండేళ్లుగా పార్టీని, కేడర్‌ను కాపాడుకుంటూ వస్తే ఇప్పుడు ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్‌కు టికెట్ కేటాయించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఆత్మీయుల వద్ద వెలిబుచ్చి కన్నీటిపర్యంతం కావడంతో కేడర్ ఉద్రేకానికి లోనైంది. ఒక్క మాట చెబితే కాకర్లను ఉదయగిరిలో నామినేషన్ కూడా వేయనివ్వమని తేల్చిచెప్పింది. గురువారం కలిగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆత్మీయులతో మాట్లాడుతూ తనకు టికెట్ విషయంలో న్యాయం జరగకపోతే కార్యకర్తల అభీష్టం మేరకు మార్చి రెండో తేదీన అధినేతను కలసిన తరువాత తుది నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. పెనుకొండలో కొనసాగుతున్ననిరసనలు అనంతపురం జిల్లా పెనుకొండలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథికి కాదని అన్నా క్యాంటీన్ అంటూ హడావుడి చేసిన సవితకు టికెట్ ఇవ్వడంపై నిరసనలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి టీడీపీ కార్యకర్తలు రోజూ బీకే ఇంటి వద్దకు చేరుకుని నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. గురువారం కూడా నిరసనలు కొనసాగాయి. పార్థసారథికి టికెట్ ఇవ్వకుంటే టీడీపీని ఓడిస్తామని నేతలు చెబుతున్నారు. సునీల్‌ను మార్చకుంటేరాజీనామా శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు సునీల్‌కుమార్ అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గురువారం మరోసారి తిప్పేస్వామి వర్గీయులు నిరసనకు దిగారు. సునీల్‌ను మార్చకుంటే తామంతా రాజీనామా చేయడానికి వెనుకాడేది లేదని తేల్చిచెప్పారు. -
విశాఖలో పరిపాలన భవనాలు సిద్ధం
-
యూత్ కాంగ్రెస్ ‘నారాజ్’
సాక్షి, హైదరాబాద్: టికెట్ల కేటాయింపు విషయంలో పార్టీ అధిష్టానం అనుసరిస్తున్న వైఖరితో యూత్ కాంగ్రెస్ నాయకత్వం నారాజ్ అవుతోంది. ప్రతి ఎన్నికల్లోనూ యూత్ కోటాలో 3–7 టికెట్లు కేటాయిస్తారని, కానీ ఈసారి మాత్రం తమను పరిగణనలోకి తీసుకోకపోవడంతో యూత్ కాంగ్రెస్ నేతలు నైరాశ్యంలో మునిగిపోతున్నారు. ఇందుకు నిరసనగా యూత్‌కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం కావాలని భావిస్తున్నారు. ఈసారి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి వనపర్తి టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ వనపర్తి కాకపోయినా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రెండేళ్లుగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అనేక పోరాటా లు చేసి విద్యార్థులు, యువత పక్షాన నిలబడ్డామని, ఈ ఎన్నికల్లో తమకు పోటీ చేసే అవకాశం కల్పించాలని అడుగుతున్నారు. తద్వారా యువకులకు పార్టీ ప్రాధాన్యతమిస్తుందనే సంకేతాలను పంపాలని చెబుతున్నారు. వనపర్తితో పాటు దేవరకొండ, అంబర్‌పేట లాంటి సీట్లను తమకు కేటాయించాలని యూత్ కాంగ్రెస్ నేతలు కోరుతున్న నేపథ్యంలో అధిష్టానం ఏం చేస్తుందో వేచిచూడాల్సిందే. నేడు ‘బుజ్జగింపు’ భేటీ? యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం గాంధీభవన్‌లో కీలక సమావేశం నిర్వహించాలని నిర్ణ యించారు. అయితే, చాలామంది యూత్‌కాంగ్రెస్ నేతలు నిరాశలో ఉన్న మాట వాస్తవమేనని, వారందరూ రాజీనామాలు చేయాలనే భావనలో ఉన్నప్ప టికీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి కాంగ్రెస్‌లోనే ఉంటారని, వారిని బుజ్జగించేందుకే ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారనే చర్చ జరుగుతోంది. -
పారిశ్రామిక పార్కుల్లో 16.2 శాతం భూమి ఎస్సీలకు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) అభివృద్ధి చేసే పారిశ్రామిక పార్కుల్లో ఎస్సీ పారిశ్రామికవేత్తలకు 16.2 శాతం, ఎస్టీలకు 6 శాతం భూమి తప్పనిసరిగా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిబంధన విధించింది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. నూతన పారిశ్రామిక పాలసీ 2023 –27 కింద వివిధ పరిశ్రమలు, పారిశ్రామిక పార్కులకు ఏపీఐఐసీ భూ కేటాయింపులకు ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. ఏపీఐఐసీ ఇండ్రస్టియల్ పార్క్స్ అలాట్మెంట్ రెగ్యులేషన్ 2020 కింద కేటాయించిన భూములకు ఈ కొత్త నిబంధనలు వర్తించవని, తాజాగా చేసిన కేటాయింపులకు మాత్రమే వర్తిస్తాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.తాజా మార్గదర్శకాల ప్రకారం.. పారిశ్రామిక పార్కుల్లో 10 శాతం భూమిని కామన్ ఫెసిలిటీ సెంటర్, 5 శాతం వాణిజ్య ప్లాట్స్‌కు కేటాయించాలి. ఎంఎస్ఎంఈలకు 15 శాతం కేటాయించాలి. రూ.500 కోట్ల పైబడి పెట్టుబడితో కనీసం 1,000 మందికి ఉపాధి కల్పిస్తూ కనీసం మరో ఐదు అనుబంధ యూనిట్లు వచ్చే యాంకర్ యూనిట్లకు 25 శాతం తక్కువ ధరకు భూమి కేటాయిస్తారు. మండలస్థాయిలో ఏర్పాటు చేసే యాంకర్ యూనిట్లకు 20 నుంచి 33 శాతం వరకు తగ్గింపు ఇస్తారు. 33 ఏళ్లపాటు లీజుకు భూమిని ఇస్తారు. ఆ తర్వాత లీజును 66, 99 సంవత్సరాలకు పెంచుకోవచ్చు. ఉత్పత్తి ప్రారంభించి 10 ఏళ్లు దాటి నిబంధనలను పూర్తి చేసిన యూనిట్లకు ఆ భూమిని కొనుక్కొనే హక్కు కల్పిస్తారు. వివిధ కంపెనీలకు భూకేటాయింపులు రాష్ట్రంలో పారిశ్రామిక ప్రోత్సాహక విధానంలో భాగంగా వివిధ పరిశ్రమలకు భూములను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పలు ఉత్తర్వులు జారీ చేసింది. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వట్ల గ్రామం వద్ద ఉన్న రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీని సంజమల రైల్వే స్టేషన్‌కు అనుసంధానిస్తూ రైల్వే లైన్ నిర్మాణం కోసం 211.49 ఎకరాలు కేటాయించింది. ఎన్టీఆర్ జిల్లా మల్లవల్లి వద్ద బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటుకు అవిశా ఫుడ్స్‌కు 101.81 ఎకరాలు, విజయనగరం జిల్లా బొబ్బిలి వద్ద సత్య బయోఫ్యూయల్‌కు 30 ఎకరాలు కేటాయించింది. తిరపతిలో హిందుస్థాన్ స్టీల్ వర్క్స్‌కు కేటాయించిన 50.71 ఎకరాల యూనిట్ పూర్తి కావడానికి గడువును పెంచింది. కియా వెండర్స్‌కు రాయితీలకు సంబంధించిన విధివిధానాలు, శ్రీకాళహస్తి వద్ద ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ (గతంలో శ్రీకాళహస్తి పైప్స్) కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫెర్రో అల్లాయిస్ యూనిట్‌కు, గుంటూరు టెక్స్టైల్ పార్క్, తారకేశ్వర టెక్స్టైల్ పార్కులకు వాటి పెట్టుబడి, ఉద్యోగ కల్పన ఆధారంగా టైలర్‌మేడ్ రాయితీలను ప్రకటించింది. -
కౌన్సిలర్లు, అధికారులు కుమ్మక్కయారని ఆరోపణ..
-
Bandlaguda: రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల వేలానికి అనూహ్య స్పందన
సాక్షి, హైదరాబాద్: బండ్లగూడ, పోచారంలలో నిర్మించిన రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు హెచ్ఎండీఏ నిర్వహించిన వేలానికి వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన లభించింది. మొత్తం 3,716 ఫ్లాట్లకు సంబంధించి 39,082 మంది వినియోగదారులు ఆన్లైన్లో బిడ్లు దాఖలు చేశారు. ఇందులో బండ్లగూడలోని 2,246 ఫ్లాట్లకు 33,161 మంది బిడ్లు దాఖలు చేశారు. పోచారంలోని 1470 ఫ్లాట్టకు 5921 మంది బిడ్లు దాఖలు చేశారు. బిడ్లు దాఖలు చేసిన వారిలో లాటరీ ద్వారా ఎంపిక చేసి ఫ్లాట్లను కేటాయించనున్నారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి పోచారం ఫ్లాట్స్ వినియోగదారులకు లాటరీ నిర్వహించారు. కార్యక్రమాన్ని ఫేస్బుక్, యూట్యూ బ్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ నిర్వహిస్తున్నారు. బండ్లగూడ ఫ్లాట్స్‌కు మంగళవారం లాటరీ నిర్వహించనున్నారు. బండ్లగూడ డీలక్స్ ఫ్లాట్స్ వినియోగదారులకు బుధవారం లాటరీ నిర్వహించనున్నట్లు హెచ్ఎండీఏ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. (క్లిక్: పబ్ కేసులో మరో ట్విస్ట్.. కోర్టును ఆశ్రయించిన పోలీసులు) -
తుది తీర్పునకు లోబడే ఉపాధ్యాయుల కేటాయింపులు
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపులపై తెలంగాణ హైకోర్టులో విచారణ మొదలైంది. ఉపాధ్యాయులు దాఖలు చేసిన పిటిషన్లపై చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపులు తుది తీర్పునకు లోబడే జరగాలని ఈ సందర్భంగా బెంచ్ స్పష్టం చేసింది. జీవో 317పై స్టే ఇవ్వాలని ఉపాధ్యాయుల తరపు న్యాయవాదులు కోరగా.. కొత్త జిల్లాలకు కేటాయించిన ఉద్యోగులు విధుల్లో చేరారని అదనపు ఏజీ బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో జీవో 317పై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అంతేకాదు పిటిషన్లపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశిస్తూ.. ఉపాధ్యాయుల పిటిషన్లపై తదుపరి విచారణ ఏప్రిల్ 4కి వాయిదా వేసింది. -
త్వరలో 2.62 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి చేస్తాం: మంత్రి బొత్స
అమరావతి: టిడ్కో, మెప్మా, బ్యాంక్ సమన్వయకర్తలతో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం టెలికాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో 2.62 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి చేస్తామని తెలిపారు. అదే విధంగా, మౌళిక వసతుల కల్పన పనులకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. లబ్ధిదారులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, పనుల పురోగతిపై ప్రతివారం సమీక్షను నిర్వహిస్తామని తెలియజేశారు. లబ్ధిదారులకు రుణాల మంజూరు చేసే ప్రక్రియపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. -
లక్కు..కిక్కు
సాక్షి, హైదరాబాద్: లక్కు కిక్కు కొందరిదైతే..అదృష్టం చిక్కలేదనే నిరాశ మరికొందరిది. లాటరీలో చేజారిన షాపును ఎలాగైనా వశం చేసుకోవాలనే ఆరాటం ఇంకొందరిది. దుకాణం దక్కించుకున్న అదృష్టజాతకుడితో బేరసారాలు, బుజ్జగింపుల ఉత్కంఠ మధ్య శుక్రవారం మద్యం దుకాణాల కేటాయింపుల పర్వం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 2,216 మద్యం షాపులకు నిర్వహించిన లక్కీ డ్రాలో 34 దుకాణాలు మినహా మిగతావాటిని ఖరారు చేసినట్లు అబ్కారీవర్గాలు తెలిపాయి. కోర్టు కేసులు, ఐదుకంటే తక్కువ దరఖాస్తులు వచ్చిన షాపుల డ్రాను నిలిపివేశారు. సిండికేట్‌గా మారడంతోనే దరఖాస్తులు తక్కువగా నమోదైనట్లు భావించిన అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ షాపులపై 48 గంటల్లో విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ సోమేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ విచారణ నివేదిక అనంతరం ఈ దుకాణాల కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. కాగా, ఎంపికైన మద్యం దుకాణాలు 2019–21 వరకు కొనసాగనున్నాయి. నవంబరు ఒకటి నుంచి కొత్త మద్యం పాలసీకి అమలులోకి రానుంది. ఈనెల 9 నుంచి 16 వరకు మద్యం షాపులకు దరఖాస్తులు స్వీకరించగా.. రాష్ట్రవ్యాప్తంగా 48,243 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ఫీజు రూపంలోనే రాష్ట్ర ఖజానాకు రూ.964 కోట్ల మేర ఆదాయం లభించింది. -
కొత్త జిల్లాలకు ఆర్టీసీ వీఎండీలు
కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగులు, బస్సుల పంపకం పూర్తయింది. ఈమేరకు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం అవసరమైన ఉత్తర్వులు జారీచేసింది. కరీంనగర్ నుంచి ఏర్పడుతున్న రెండు కొత్త జిల్లాలకు రీజినల్ మేనేజర్‌కు బదులుగా డివిజనల్ మేనేజర్లు బాధ్యతలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 11న వారు విధుల్లో చేరి బాధ్యతలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. – మంకమ్మతోట కరీంనగర్ నుంచి పెద్దపల్లి, జగిత్యాల రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతుండగా.. కొన్ని హుస్నాబాద్, హుజూరాబాద్ వంటి మండలాలు వేరే జిల్లాలో కలుస్తున్నాయి. జిల్లాల ఏర్పాటుతో ప్రస్తుతం కరీంనగర్ రీజియన్‌లో ఉన్న 11 ఆర్టీసీ డిపోలు విడిపోనున్నాయి. ప్రస్తుతం రీజియన్‌లో కరీంనగర్–1, కరీంనగర్–2, గోదావరిఖని, హుస్నాబాద్, హుజూరాబాద్, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, మంథని, సిరిసిల్ల, వేములవాడ డిపోలతోపాటు ఆర్ఎం కార్యాలయాలు ఉన్నాయి. ప్రత్యేక జిల్లా కావడంతో మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల డిపోలు జగిత్యాల జిల్లాలో ఉంటాయి. పెద్దపల్లి జిల్లాలో మంథని, గోదావరిఖని డిపోలు ఉండనున్నాయి. హుజూరాబాద్ ప్రాంతం వరంగల్ జిల్లాలో, హుస్నాబాద్ సిద్దిపేట జిల్లాలో కలవనున్నాయి. మిగిలిన కరీంనగర్ 1, కరీంనగర్ 2, సిరిసిల్ల, వేములవాడ డిపోలు మాత్రమే కరీంనగర్ జిల్లాలో ఉంటాయి. ఉద్యోగులు ఎక్కడి వారు అక్కడే... కరీంనగర్ రీజియన్‌లో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు, సిబ్బంది ఎక్కడి వారు అక్కడే విధులు నిర్వహించనున్నారు. జిల్లా ఏర్పడినా అవసరం మేరకు ఉద్యోగులు, సిబ్బంది ఉన్నందున్న అక్కడే పనిచేయాలని ఆర్టీసీ యాజమాన్యం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం జిల్లాలో 4,708 మంది ఉద్యోగులు రీజియన్‌లో పనిచేస్తున్నారు. వీరిలో డ్రై వర్లు, కండక్టర్లు 3,656 మంది ఉండగా.. మిగతా వారు మెకానికల్, సెక్యూరిటీ, అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం సిబ్బంది ఉన్నారు. కండక్టర్లు, డ్రై వర్లు కరీంనగర్ జిల్లాలోని నాలుగు డిపోల్లో 1400 మంది ఉంటారు. జగిత్యాల జిల్లాలో 976మంది, పెద్దపల్లి జిల్లాకు 765 మంది కండక్టర్లు, డ్రై వర్లు పనిచేస్తారు. ప్రస్తుతం కొత్త జిల్లాల కారణంగా ఉద్యోగ బదిలీలు ఉండవని, ఎంత సీనియార్టీ ఉన్న ముందుగా విధుల్లో చేరిన తర్వాతనే అభ్యర్థనలు పరిశీలించనున్నారు. డీవీఎంలుగా సీటీఎం, సీఎంఈలు రీజియన్‌లో పనిచేస్తున్న చీఫ్ ట్రాఫిక్ మేనేజర్, డెప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్, చీఫ్ మెకానికల్ ఇంజినీర్‌తోపాటు ఈస్థాయి అధికారులు కొత్త జిల్లాలోని డిపోలకు ఆర్ఎంకు బదులుగా డివిజన్ మేనేజర్ విధులు నిర్వహిస్తారు. వీరు అక్టోబర్ 11న వారికి కేటాయించిన కార్యాలయాల్లో బాధ్యతలు చేపట్టనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. నాలుగు రీజియన్ల బాధ్యతలు నిర్వహించడానికి ఇక్కడ ఉన్న ఈడీ కార్యాలయాన్ని కూడా తరలించనున్నారు. కొత్త జిల్లాలు ఏర్పడుతున్నందున ఆయా జిల్లాల పరిధి, డిపోల సంఖ్య ఆధారంగా జోన్ ఏర్పాటుచేసి అక్కడ ఈడీ కార్యాలయం ఏర్పాటు చేస్తారు. బస్సుల పంపకం ఇలా.. కొత్త జిల్లాలో ఏర్పాటుతో బస్సులను ఆయా జిల్లాల వారీగా పంచున్నారు. కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్–1, కరీంనగర్–2, సిరిసిల్ల, వేములవాడ డిపోలకు 277 సంస్థ బస్సులు, 92 అద్దెబస్సులు, జగిత్యాల జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి డిపోలకు సంస్థ బస్సులు 183, అద్దె బస్సులు 70, పెద్దపల్లి జిల్లాలో గోదావరిఖని, మంథని డిపోలకు సంస్థ బస్సులు 146 సంస్థ బస్సులు, 46 అద్దె బస్సులు కేటాయిస్తారు. -
రాజధాని రైతుకు టోపీ !
ప్లాట్ల పంపిణీపై మాట తప్పిన ప్రభుత్వం పచ్చతమ్ముళ్లకు కోరుకున్న చోట .. చిన్న, సన్న కారు కర్షకులకు వేరే చోట నేడు శాఖమూరు రైతులకు ప్లాట్లు పంపిణీ లాటరీ పద్ధతిలో ఎంపిక చేయనున్న సీఆర్డీఏ తుళ్లూరు కార్యాలయం వద్ద భారీ ఏర్పాట్లు సాక్షి, అమరావతి బ్యూరో : వడ్డించేవాడు మనవాడైతే... కడ బంతిలో కూర్చున్నా పంచభక్ష పరమాన్నాలు అందుతాయన్న నానుడికి శాఖమూరులో ప్లాట్ల పంపిణీ నిదర్శనం కానుంది. రాజధాని నిర్మాణం కోసం భూములు వదులుకున్న రైతులకు పరిహారం కింద ప్లాట్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఏ గ్రామంలో అయితే భూములు తీసుకు న్నారో... అదే ఊరు పొలిమేరల్లో ప్లాట్లు ఇస్తామని పాలకులు హామీ ఇచ్చారు. అయితే ఇచ్చిన మాటను తుంగలో తొక్కి స్థానిక రైతులు కొందరికి ఇతర గ్రామాల సరిహద్దుల్లో ప్లాట్లు ఇవ్వనున్నారు. అందులో తుళ్లూరు మండలం శాఖమూరు గ్రామం ఒకటి. రాజధాని నిర్మాణం కోసం శాఖమూరు గ్రామానికి చెందిన 1572 మంది రైతులు సుమారు 1500 ఎకరాలను వదులుకున్నారు. వీరందరికి నివాసయోగ్యమైనవి 1841, వాణిజ్య పరమైనవి 1208 ప్లాట్లు బుధవారం తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయం వద్ద లాటరీ పద్ధతిలో పంపిణీ చేస్తున్నారు. పాలకులు ఆదేశాల మేరకు, వారు సూచించిన విధంగా ప్లాట్ల పంపిణీ నిర్వహిస్తున్నట్లు ఓ అధికారి స్పష్టం చేశారు. టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, ఇంకా సర్కారుకు అనుకూలంగా ఉన్న మోతుబరి రైతులు సుమారు 30 మందికి పైగా శాఖమూరు పొలిమేరల్లోనే ప్లాట్లు కేటాయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక శాఖమూరులో మిగిలిన చిన్న, సన్న కారు రైతులకు నెక్కల్లు, పెదపరిమి గ్రామాల పొలిమేరల్లో ప్లాట్లు కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. శాఖమూరు పొలిమేరల్లో ఇస్తున్న ప్లాట్లు విలువైనవని, నెక్కల్లు, పెదపరిమి గ్రామ సరిహద్దుల్లో కేటాయిస్తున్న ప్లాట్లకు పెద్దగా విలువ ఉండదని రైతులే చెబుతున్నారు. రైతుల వేదన అరణ్యరోదనేనా? బంగారంలాంటి పంట పొలాలను వదులుకున్న రైతులకు న్యాయం చేస్తామన్న ప్రభుత్వ పెద్దల మాటలు నీటి మూటలేనని కొన్ని గంటల్లో తేలిపోనుంది. భూములు వదులుకున్న రైతులకు ఇచ్చే ప్లాట్లకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే చెప్పండి, పరిష్కరిస్తామని చెపుతూ సీఆర్డీఏ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు పర్యాయాలు చేపట్టిన అవగాహన సదస్సులు రసాభాసగా మారాయి. కొందరికి నెక్కల్లు, మరికొందరికి పెదపరిమి గ్రామంలో ప్లాట్లు కేటాయిస్తుండడంపై మండిపడుతున్నారు. అంతకు ముందు రైతులు పలుమార్లు అధికారులను కలిసి విన్నవించారు. ఇవేమీ పట్టించుకోని ప్రభుత్వ పెద్దలు వారు అనుకున్నట్లు ప్లాట్ల పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక రైతుల్లో వ్యతిరేకతను దష్టిలో ఉంచుకుని మంగళవారం రాత్రి ముసాయిదాలో కొద్దిగా మార్పులు చేపట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ప్లాట్లన్నీ తుళ్లూరు రెవెన్యూ పరిధిలోనే ఇస్తున్నామని చెప్పుకోవడానికి ఈ మార్పు చేసినట్టు తెలుస్తోంది. అయితే అవి ఆ గ్రామాల్లో కాకుండా సరిహద్దుల్లో ఇస్తుండడం గమనార్హం. వాణిజ్య ప్లాట్లు కొన్ని ఉప్పలపాడు చెరువులో, మరికొన్ని తుళ్లూరు–నేలపాడు మధ్య, ఎక్కువగా పెదపరిమి మార్గంలో కేటాయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్లాట్ల పంపిణీ కార్యక్రమం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎవ్వరూ ఎదురు తిరిగి మాట్లాడకుండా ఉండాలని రైతులకు రాత్రంతా కౌన్సెలింగ్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఒకవేళ కార్యక్రమంలో ఎవరైనా నోరెత్తితే వారిపై అక్రమ కేసులు బనాయించాలని కూడా పెద్దల నుంచి పోలీసులకు ఆదేశాలు అందినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ప్లాట్లు తీసుకోకుంటే మీకే నష్టమని పాలకులు కొందరు మంగళవారం రాత్రికే రైతులకు సంకేతాలు పంపారు. తీసుకోనివారికి ప్లాటు విలువ కట్టి ఆ మొత్తాన్ని వారి బ్యాంక్ ఖాతాలో జమచేయడానికి సిద్ధంకావటం గమనార్హం. -
యూనివర్సిటీలకు 740 ఎకరాలు
-ఆరు వర్సిటీలకు ఇచ్చేందుకు అంగీకారం -మలి విడతలో మరో రెండు సంస్థలకు -25 సంవత్సరాలు లీజు లేదా అమ్మకానికి విజయవాడ: నూతన రాజధాని అమరావతిలో ప్రైవేటు యూనివర్సిటీలకు రెండు దశల్లో 890 ఎకరాలను ప్రభుత్వం కేటాయించనుంది. తొలి దశలో ముందుగా మూడు వర్సిటీలకు 500 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించింది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి 150 ఎకరాలు, వేలూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్)కి 200 ఎకరాలు, ఇండో-యూకే ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి 150 ఎకరాలను ఇవ్వనుంది. ఈ నెల 15న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ కేటాయింపులకు ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. కొద్ది రోజుల్లోనే తొలి దశ కిందే మరో రెండు యూనివర్సిటీలకు భూములు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. అమిటి యూనివర్సిటీకి 150 ఎకరాలు, సీఐఐ యూనివర్సిటీకి 90 ఎకరాలు ఇవ్వనుంది. మొత్తం మొదటి దశలో ఈ ఐదు వర్సిటీలకు 740 ఎకరాలను కేటాయించి రెండేళ్లలో తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ రూ.1677 కోట్లు, విట్ రూ.3,483 కోట్లు, ఇండో-యూకే సుమారు రూ.2 వేల కోట్లు, సీఐఐ యూనివర్సిటీ రూ.500 కోట్లు, అమిటి యూనివర్సిటీ రూ.425 కోట్ల పెట్టుబడులను పెడతామని ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశాయి. పదేళ్లలో మొత్తం 83,038 మంది విద్యార్థులకు ప్రత్యేక కోర్సుల్లో ఇవి విద్యా బోధన చేయనున్నాయి. రెండో దశలో కారుణ్య యూనివర్సిటీకి 150 ఎకరాలు, సవిత యూనివర్సిటీకి వంద ఎకరాలు కేటాయించాలనే ప్రతిపాదనలపై చర్చలు జరుగుతున్నాయి. ఆ తర్వాత అమృత యూనివర్సిటీ, హాస్పిటాలిటీ యూనివర్సిటీకి రాజధానిలో భూములిచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వీటిలో కొన్ని లీజు పద్ధతిలోనూ, మరికొన్ని విక్రయ హక్కుల ద్వారా భూములివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎకరం రూ.25 లక్షల చొప్పున 25 సంవత్సరాల లీజుకిచ్చేందుకు ఇప్పటికే కొన్ని సంస్థలతో ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. అమ్మకం ద్వారా అయితే ఎకరం రూ.50 నుంచి రూ.70 లక్షలకు ఆ సంస్థలకు భూములివ్వాలని ప్రతిపాదిస్తున్నారు. అయితే, ఈ భూములు 29 గ్రామాల్లో ఎక్కడ ఇవ్వాలనే దానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. తొలిదశలో ఇచ్చే మూడు సంస్థలకు భూమి ఎక్కడ ఇవ్వాలనే నిర్ణయం ఖరారైనట్లు తెలిసినా.. ఆ వివరాలను ఇంకా వెల్లడించలేదు. రాజధానిలో ప్రతిపాదిత ఏడు థీమ్ సిటీల్లో ఒకటైన ఎడ్యుకేషన్ సిటీలో ఎక్కువ వర్సిటీలకు భూములివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అన్ని సంస్థలకు అక్కడే భూమి ఇవ్వాలంటే కష్టమవుతుందనే అభిప్రాయం సీఆర్డీఏలో వ్యక్తమవుతోంది. -
ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు ఖరారు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపును ఖరారు చేసినట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మొత్తం 73,072 సీట్లు భర్తీ చేసినట్టు తెలిపారు. ఇంకా ఏడు కాలేజీల్లో విద్యార్థులు చేరలేదన్నారు. ఆ సీట్ల భర్తీకి త్వరలోనే రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. -
అఫిలియేషన్లపై కొనసాగుతున్న ప్రతిష్టంభన
జేఎన్టీయూహెచ్ మల్లగుల్లాలు మార్గదర్శకాల కోసం అధికారుల ఎదురుచూపులు నేటితో ముగియనున్న వెబ్ ఆప్షన్ల ప్రక్రియ హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీలకు అఫిలియేషన్ వ్యవహారంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. లోపాలున్నాయంటూ.. ఈ ఏడాది 125 ఇంజినీరింగ్, 61 ఫార్మసీ కళాశాలలకు జేఎన్టీయూహెచ్ గుర్తింపును నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాలతో ఆయా కళాశాలలకు షరతులతో కూడిన అనుమతి లభించినా, తుది తీర్పు వెలువడే వరకు సీట్ల అలాట్మెంట్ను విత్‌హెల్డ్‌లో పెట్టాలనడమే యాజమాన్యాలకు మింగుడు పడడం లేదు. యూనివర్సిటీ జారీచేసిన నోటీసుల మేరకు దాదాపు అన్ని ఇంజనీరింగ్ కళాశాలలు లోపాలను సరిదిద్దుకున్నట్టు (డెఫిషియన్సీ కంప్లెయిన్స్ రిపోర్టు)నివేదికలను సమర్పించాయి. అయితే.. ఆయా నివేదికలను పరిశీలించేందుకు మరికొంత సమయం కావాలని కోరడంతో కాలేజీల కథలో మళ్లీ సస్పెన్స్ కొనసాగుతోంది. వచ్చే నెల 16వరకు వర్సిటీ అధికారులకు హైకోర్టు గడువిచ్చింది. నేటితో ముగియనున్న వెబ్ ఆప్షన్లు.. ఇదిలాఉండగా, పీజీఈసెట్ అభ్యర్థులకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మంగళవారంతో ముగియనుంది. షెడ్యూలు ప్రకారం శుక్రవారంలోగా సీట్ల అలాట్మెంట్ చేయాల్సి ఉంది. అయితే.. హైకోర్టులో కేసు వాయిదా పడడంతో అధికారులకు ఏంచేయాలో తోచడం లేదు. ప్రస్తుతానికి విత్‌హెల్డ్ ప్రతిపాదనను విరమించుకున్నట్టు తెలిసింది. రాష్ట్రంలోని మిగిలిన యూనివర్సిటీల కాలేజీల విషయంలో సమస్యలు లేకున్నా.. జేఎన్టీయూహెచ్ కాలేజీల కారణంగా మిగిలిన వర్సిటీ కళాశాలన్నింటిలోనూ సీట్ల భర్తీని నిలిపివే యక తప్పని పరిస్థితి ఏర్పడింది. అభ్యర్థుల అయోమయం పీజీఈసెట్ సీట్ల అలాట్మెంట్లో ప్రతిష్టంభన నెలకొనడంతో అభ్యర్థులు నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. ఎంటెక్/ ఎం.ఫార్మసీ కోర్సుల్లో సీటు వచ్చేదీ, రానిదీ తేలితే వేరే దారి చూసుకుంటామని అంటున్నారు. నెలలతరబడి వేచి ఉండడంతో ఎంతో నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ప్రైవేటు వర్సిటీల్లో పీజీ కోర్సుల తరగతులు నెలక్రితమే ప్రారంభమయ్యాయని, ప్రస్తుతం వాతావరణాన్ని బట్టి ఇక్కడ తరగతులు ప్రారంభమయ్యే అవకాశం కనిపించడంలేదంటున్నారు. కాగా, కాలేజీలకు అఫిలియేషన్‌పై వర్సిటీ మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తున్నట్టు ఉన్నతవిద్యామండలి కన్వీనర్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. -
ఐపీఎస్‌ల కేటాయింపుల్లో స్వల్ప మార్పులు?
ఐదుగురు అటు..ఐదుగురు ఇటు ప్రధాని సంతకం చేస్తే నేటి రాత్రికే పూర్తిస్థాయి జాబితా విడుదల సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రోస్టర్ బ్యాండ్ పద్ధతిలో ప్రత్యూష్ సిన్హా కమిటీ చేసిన ఐపీఎస్ అధికారుల కేటాయింపుల్లో స్వల్ప మార్పులు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ జాబితాను కేంద్ర ప్రభుత్వ అధీనంలోని డీవోపీటీ ఖరారు చేసింది. ఈ ఫైలును సోమవారం ప్రధాని కార్యాలయానికి పంపనుందని సమాచారం. గతంలో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన వీకే సింగ్, మురళీకృష్ణ, రవివర్మ, సౌమ్య మిశ్రా, ఎన్.శ్రీనివాసుల్ని తెలంగాణకు మార్చినట్లు తెలిసింది. తెలంగాణకు కేటాయించిన సంతోష్ మెహ్రా, జె.ప్రభాకర్, పీవీఎస్ రామకృష్ణ, కృపానంద్ త్రిపాఠీ ఉజేలా, ఎల్‌కేవీ రంగారావులను ఆంధ్రప్రదేశ్‌కు మార్చినట్లు తెలిసింది. ప్రధాని సంతకం చేస్తే సోమవారం రాత్రికే పూర్తిస్థాయి జాబితా విడుదల చేసి, మంగళవారం రిలీవింగ్ ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. -
తాత్కాలిక కేటాయింపులే!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ జారీ చేసిన ఆదేశాల ప్రకారం తాము చేసే తాత్కాలిక కేటాయింపుల మేరకు ఇరు ప్రాంత ఉద్యోగులు పని చేయాల్సిందేనని పేర్కొంది. శుక్రవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆయన ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. ఆప్షన్లు ఇవ్వాలన్న సీమాంధ్ర ఉద్యోగ సంఘాలకు గానీ.., స్థానికత, మంజూరైన పోస్టుల ఆధారంగా విభజన చేపట్టాలన్న తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలకుగానీ ఎలాంటి హామీ ఇవ్వలేదు. స్థానికత ఆధారంగా చేస్తామని చెబుతున్నా.. రెండు రాష్ట్రాల్లో పరిపాలన అవసరాల దృష్ట్యా పని చేస్తున్న వారినే విభజించాల్సి వస్తోందని సీఎస్ పేర్కొన్నారు. అందరికీ న్యాయం చేసేందుకు కృషి చేశామని చెబుతూ సమావేశాన్ని ముగించడంతో ఉద్యోగ సంఘాలు ఆందోళనలో పడ్డాయి. సమావేశం నుంచి బయటకు వస్తూనే తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఎక్కడి వారు అక్కడే పనిచేసేలా చర్యలు చేపట్టాలంటూ ఉద్యోగ సంఘాల నేతలు నినాదాలు చేశారు. పని చేస్తున్న ఉద్యోగుల ఆధారంగానే: సచివాలయం, శాఖాధిపతి కార్యాలయాల్లో మంజూరైన పోస్టుల ఆధారంగా కాకుండా ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులను 58.32 : 41.68 నిష్పత్తిలో విభజించనున్నారు. ఈ మేరకు జూన్ 1న ఉత్తర్వులు జారీ కానున్నాయి. దీంతో కొందరు కొందరు తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్‌లో, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు తెలంగాణలో పని చేయాల్సి ఉంటుంది. మరో మూడు నెలల్లో శాశ్వత కేటాయింపులు ఉంటాయని, అంతవరకు ఈ కేటాయింపులు వర్తిస్తాయని సీఎస్ స్పష్టంచేశారు. అయితే ఉద్యోగ సంఘాల నేతల విషయంలో ఎక్కడివారిని అక్కడే పనిచేసేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అయితే ఇది ఎంతవరకు ఆచరణకు నోచుకుంటుందోనని సంఘాల నేతలే చెబుతున్నారు. రెండు ప్రభుత్వాలు కొలువుదీరాక కేంద్రం ఏర్పాటు చేసే సమన్వయ కమిటీ ప్రత్యేకంగా గ్రీవెన్స్‌సెల్ ఏర్పాటు చేస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఈ సెల్ ఉద్యోగుల సమస్యలను పరిశీలించి న్యాయం చేస్తుందని హామీనిచ్చింది. కేటాయింపులపై అభ్యంతరాలు ఉంటే జూన్ 9లోపు తెలపాలని పేర్కొంది. కాగా, జూన్ 1 తేదీనే తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా అనురాగ్ శర్మ, హైదరాబాద్ నగర కమిషనర్‌గా ఎం.మహేందర్‌రెడ్డిని నియమిస్తూ ఆదేశాలు వెలువడనున్నాయని తెలిసింది. సీఎస్‌తో జరిగిన భేటీలో టీఎన్జీవో, టీజీవో, ఉపాధ్యాయ సంఘాల నేతలతోపాటు తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్, జూనియర్ లెక్చరర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పారదర్శకత లేదు: దేవీప్రసాద్ ఉద్యోగుల విభజనలో పారదర్శకత లేదని, ఎంతమంది ఉద్యోగులు ఎటు వెళ్తున్నారనే విషయంలో స్పష్టత లేకుండా పోయిందని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ విమర్శించారు. కేంద్రం సరైన సమయంలో మార్గదర్శకాలను ఇవ్వలేదని, పనిచేస్తున్న వారి సంఖ్య ఆధారంగా విభజన చేయడం వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. చాలా మంది సీమాంధ్ర ఉద్యోగులు నకిలీ సర్టిఫికెట్లతో తెలంగాణలో కొనసాగేందుకు ప్రయత్నిస్తున్నారని, కమలనాథన్ కమిటీకి ఈ వివరాలు అందజేశామని చెప్పారు. జూన్ 2 నుంచి 8 వరకు తెలంగాణ ఆవిర్భావ వేడుకలను గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణకు ఒకటిన్నర రోజు వేతనం.. తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తమ ఒకటిన్నర రోజు వేతనాన్ని (దాదాపు రూ.60 కోట్లు) విరాళంగా ఇవ్వాలని నిర్ణయించాయి. ఇందులో ఒకరోజు వేతనం తెలంగాణ ప్రభుత్వానికి (ముఖ్యమంత్రి సహాయ నిధికి), సగం రోజు వేతనాన్ని అమరవీరుల కుటుంబాలను ఆదుకునేందుకు ఇవ్వాలని నిర్ణయించినట్లు దేవీ ప్రసాద్ తెలిపారు. మళ్లీ తీసుకువస్తాం: శ్రీనివాస్‌గౌడ్ తెలంగాణ ఉద్యోగులు తాత్కాలికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేయాల్సి వచ్చినా వారిని మళ్లీ తెలంగాణకు తీసుకువస్తామని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం వ్యవస్థాక అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. సీమాంధ్రులు కూడా స్వచ్ఛందంగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని, వారిని అక్కడికి పంపించాలని పేర్కొన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు కాకుండా ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టాలన్నారు. ముందుగా ఇవ్వాల్సింది: విఠల్ కేంద్ర మార్గదర్శకాలను ముందుగా ఇస్తే ఇంత గందరగోళం ఉండేది కాదని తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్ పేర్కొన్నారు. ఇప్పుడు చాలా మంది సీమాంధ్రులు ఇక్కడే ఉండే పరిస్థితి వచ్చిం దన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రాలో పనిచేయడానికి సిద్ధంగా లేనని చెప్పారు. స్థానికేతరుల్లో వేల మంది టీచర్లు.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సీమాంధ్రకు చెందిన వేల మంది టీచర్లు హైదరాబాద్, రంగారెడ్డి పరిసర జిల్లాల్లో ఉన్నారని పీఆర్టీయూ అధ్యక్షుడు పి.వెంకట్‌రెడ్డి, పీఆర్టీయూ-తెలంగాణ అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ రెండు జిల్లాల్లోనే స్థానికేతరులు 50 శాతానికిపైగా ఉన్నారన్నారు. -
మీరటు.. మీరు ఇటు..
ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపులు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనలో కీలకమైన రాష్ట్రస్థాయి ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు కేటాయించే కార్యక్రమం ప్రారంభమైంది. వచ్చే నెల 2 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు వేర్వేరుగా పనిచేయడానికి వీలుగా ఉద్యోగుల పంపిణీ చేపడుతున్నారు. స్థానికత ఆధారంగా ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు తాత్కాలికంగా కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలు, తుది పంపిణీని రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటయ్యాకే చేపడతారు. ఈలోగా శాఖలు, విభాగాలవారీగా ఇరు రాష్ట్రాలకు ఉద్యోగులను తాత్కాలికంగా కేటాయిస్తున్నారు. పోలీసు శాఖ ఉద్యోగుల్లో ఎవరు ఏ రాష్ట్రంలో పనిచేయాలో తెలియజేస్తూ ఆర్థిక శాఖ సోమవారం హోం శాఖకు ప్రజెంటేషన్ ఇచ్చింది. మంగళవారం సాధారణ పరిపాలన శాఖ ఉద్యోగులపై ఆ శాఖ అధికారులకు ప్రజెంటేషన్ ఇవ్వనుంది. అన్ని శాఖలకు ఆర్థిక శాఖ ఇదే విధమైన ప్రజెంటేషన్ ఇచ్చి, ఆయా శాఖాధిపతుల సంతకాలు తీసుకుంటోంది. స్థానికత ఆధారంగా ఏ ప్రాంతం ఉద్యోగులే ఆ ప్రాంతంలో పనిచేయాలని స్పష్టం చేస్తోంది. మొత్తం రాష్ట్రస్థాయి కేడర్ పోస్టులు 76 వేలు కాగా అందులో ప్రస్తుతం 56 వేల మంది మాత్రమే పనిచేస్తున్నారు. 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సచివాలయం, కొన్ని శాఖాధిపతుల కార్యాలయాల్లో పైస్థాయి పోస్టుల్లో తెలంగాణకు చెందిన వారు తక్కువ మంది ఉన్నారు. దీంతో తెలంగాణకు అవసరమయ్యే ఉద్యోగులను తాత్కాలికంగా ఆంధ్రప్రదేశ్ నుంచి సర్దుబాటు చేస్తున్నారు. వీరు తెలంగాణ రాష్ట్రంలో పనిచేసినంత కాలం తెలంగాణ ప్రభుత్వమే వారికి జీతభత్యాలను చెల్లించనుంది. తెలంగాణలో ఏదైనా కేడర్‌లో తక్కువ మంది ఉద్యోగులుంటే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉద్యోగుల్లో ఆసక్తి చూపేవారిని తాత్కాలికంగా కేటాయిస్తున్నారు. ఎవరూ ఆసక్తి కనబరచకపోతే ఆర్థిక శాఖే కొందరిని తాత్కాలికంగా తెలంగాణకు కేటాయిస్తుంది. సచివాలయంలోని సాధారణ పరిపాలన శాఖలో పైస్థాయిలోని అదనపు, సంయుక్త, ఉప కార్యదర్శులు మొత్తం 83 మంది ఉండగా, జనాభా నిష్పత్తి ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు 47 మందిని, తెలంగాణకు 36 మందిని కేటాయించారు. 151 మంది సహాయ కార్యదర్శుల్లో ఆంధ్రప్రదేశ్‌కు 91 మందిని, తెలంగాణకు 70 మందిని కేటాయించారు. అయితే, తెలంగాణకు చెందిన వారు 60 మంది మాత్రమే ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 10 మందిని తాత్కాలికంగా తెలంగాణకు కేటాయించనున్నారు. రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులను మాత్రమే ప్రస్తుతం పంపిణీ చేస్తున్నారు. జిల్లాల్లోని రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగులను ప్రస్తుతానికి కదిలించడం లేదు. ఆరు అంచెల్లో ఉద్యోగుల శాశ్వత పంపిణీ ఇదిలా ఉండగా రెండు రాష్ట్రాలకు ఉద్యోగుల తుది కేటాయింపులను ఆరు అంచెల్లో చేయాలని కమలనాథన్ కమిటీ నిర్ణయించింది. ఆ వివరాలు.. తొలి దశలో రాష్ట్రస్థాయి కేడర్ పోస్టుల పంపిణీకి ముసాయిదా మార్గద ర్శకాలను జారీ చేస్తారు. వాటిపై వారం లేదా పది రోజుల్లోగా అభ్యంతరాలను స్వీకరిస్తారు. రెండో దశలో అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత కమలనాథన్ కమిటీ తుది మార్గదర్శకాలను జారీ చేస్తుంది. మూడో దశలో నిర్ధారించిన కేటగిరీల్లో ఉద్యోగుల నుంచి ఆప్షన్లను స్వీకరిస్తారు. ఇందుకు వారం లేదా పది రోజుల పాటు గడువు ఇస్తారు. నాలుగో దశలో రెండు రాష్ట్రాలకు రాష్ట్ర కేడర్ పోస్టుల సంఖ్యను నిర్ధారిస్తారు. ఖాళీగా ఉన్న పోస్టులను కూడా రెండు రాష్ట్రాలకు పంపిణీ చేస్తారు. ఐదో దశలో ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు తాత్కాలిక తుది కేటాయింపులు చేస్తారు. ఈ కేటాయింపులపై ఉద్యోగుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఆరో దశలో అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు తుది కేటాయింపులు చేస్తారు.