అమరావతి: టిడ్కో, మెప్మా, బ్యాంక్ సమన్వయకర్తలతో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం టెలికాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో 2.62 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి చేస్తామని తెలిపారు. అదే విధంగా, మౌళిక వసతుల కల్పన పనులకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.
లబ్ధిదారులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, పనుల పురోగతిపై ప్రతివారం సమీక్షను నిర్వహిస్తామని తెలియజేశారు. లబ్ధిదారులకు రుణాల మంజూరు చేసే ప్రక్రియపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment