సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపులపై తెలంగాణ హైకోర్టులో విచారణ మొదలైంది. ఉపాధ్యాయులు దాఖలు చేసిన పిటిషన్లపై చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపులు తుది తీర్పునకు లోబడే జరగాలని ఈ సందర్భంగా బెంచ్ స్పష్టం చేసింది.
జీవో 317పై స్టే ఇవ్వాలని ఉపాధ్యాయుల తరపు న్యాయవాదులు కోరగా.. కొత్త జిల్లాలకు కేటాయించిన ఉద్యోగులు విధుల్లో చేరారని అదనపు ఏజీ బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో జీవో 317పై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అంతేకాదు పిటిషన్లపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశిస్తూ.. ఉపాధ్యాయుల పిటిషన్లపై తదుపరి విచారణ ఏప్రిల్ 4కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment