ఐదుగురు అటు..ఐదుగురు ఇటు
ప్రధాని సంతకం చేస్తే నేటి రాత్రికే పూర్తిస్థాయి జాబితా విడుదల
సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రోస్టర్ బ్యాండ్ పద్ధతిలో ప్రత్యూష్ సిన్హా కమిటీ చేసిన ఐపీఎస్ అధికారుల కేటాయింపుల్లో స్వల్ప మార్పులు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ జాబితాను కేంద్ర ప్రభుత్వ అధీనంలోని డీవోపీటీ ఖరారు చేసింది. ఈ ఫైలును సోమవారం ప్రధాని కార్యాలయానికి పంపనుందని సమాచారం. గతంలో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన వీకే సింగ్, మురళీకృష్ణ, రవివర్మ, సౌమ్య మిశ్రా, ఎన్.శ్రీనివాసుల్ని తెలంగాణకు మార్చినట్లు తెలిసింది. తెలంగాణకు కేటాయించిన సంతోష్ మెహ్రా, జె.ప్రభాకర్, పీవీఎస్ రామకృష్ణ, కృపానంద్ త్రిపాఠీ ఉజేలా, ఎల్‌కేవీ రంగారావులను ఆంధ్రప్రదేశ్‌కు మార్చినట్లు తెలిసింది. ప్రధాని సంతకం చేస్తే సోమవారం రాత్రికే పూర్తిస్థాయి జాబితా విడుదల చేసి, మంగళవారం రిలీవింగ్ ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది.
ఐపీఎస్‌ల కేటాయింపుల్లో స్వల్ప మార్పులు?
Published Mon, Sep 22 2014 2:06 AM | Last Updated on Sat, Sep 2 2017 1:44 PM
Advertisement
Advertisement