
సాక్షి, హైదరాబాద్: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎం.గోపాలకృష్ణ రచించిన ‘లైఫ్ ఆఫ్ కర్మయోగి’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆరు దశాబ్దాల జ్ఞాపకాలను పుస్తక రూపంలో తీసుకుని రావడం బిగ్ టాస్క్ అన్నారు. కొత్తగా ఐఏఎస్‌గా వచ్చే వాళ్లకు గోపాలకృష్ణ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
చాలా మందికి కొంత మంది సీనియర్ ఐఏఎస్‌ల గురించి ఇప్పటికి తెలీదు.. శేషన్ ఐఏఎస్.. ఎన్నికల కమిషన్ ఉందని తట్టి లేపిన గొప్ప వ్యక్తి. రాజకీయ నాయకులను గైడ్ చేసే విధానం అప్పట్లో ఉండేది. ఇప్పుడు ఎందుకు అలా లేదో తెలియడం లేదు. రాజకీయ నాయకులకు అవగాహన కల్పించే సెక్రటేరియట్ రూల్స్ ఉన్నాయి. కొత్తగా సెలెక్ట్ అయిన కొందరు ఐపీఎస్‌లు తప్పుడు మార్గంలో నడుస్తున్నారు.’’ అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
‘‘కొత్త ఐపీఎస్‌లు యూనిఫామ్ వేసుకొని సివిల్ పంచాయితీలు చూసుకోవడం దురదుష్టకరం. ఏసీ రూమ్ నుంచి బయటికి రావడానికి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఇష్ట పడటం లేదు. జనంలోకి రండి అంటే రావడం లేదు. అధికారుల ఆలోచన విధానంంలో మార్పు రావాలి. నిబద్ధత ఉన్న ఆఫీసర్లు ఎక్కడ ఉన్నా పోస్టింగ్‌లు వస్తాయి’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment