ఎస్సీ గురుకుల సొసైటీలో ఉద్యోగుల కేటాయింపులో గందరగోళం
కార్యాచరణపై ఇప్పటివరకు పడని ముందడుగు
ప్రస్తుతం సాధారణ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్) పరిధిలో జీవో 317 అమలుపై తీవ్ర గందరగోళం నెలకొంది. రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన నూతన జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపు చేపట్టేందుకు గత నెలలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించినప్పటికీ సాంకేతిక సమస్యలు నెలకొనడంతో అమలు తీరు అయోమయంలో పడింది.
ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో 317 కేటగిరీలో దాదాపు నాలుగు వందల మందికి పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది. కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైన 550 మంది టీచర్ల సర్వీసు క్రమబద్ధీకరించిన అనంతరం వారికి కూడా జోన్ల కేటాయింపు, పోస్టింగ్ ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు ముందడుగు పడలేదు.
కనీసం ఉద్యోగుల సీనియార్టీ జాబితాలు సైతం రూపొందించకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఉద్యోగుల సాధారణ బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం.
సొసైటీ కార్యాలయంలో ఎవరికి వారే...
జీవో 317 కింద ఉద్యోగుల కేటాయింపు, సీని యార్టీ జాబితాలపై ఉద్యోగులంతా ఎస్సీ గురు కుల సొసైటీ కార్యాలయం చుట్టూ తిరుగుతు న్నారు. గత నెల 24, 25 తేదీల్లో వీరికి వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉండగా... సాంకేతిక కారణాలతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. దాదాపు పది రోజులు గడిచినా ఇప్పటివరకు ఈ అంశంలో ఎలాంటి పురోగతి లేదు. దీంతో సొసైటీ కార్యాలయంలో సంబంధిత అధికారులను సంప్రదించినప్పటికీ తమకేమీ తెలియదంటూ చేతులు దులిపేసుకుంటున్నా రని ఉద్యోగులు మండిపడుతున్నారు.
ప్రస్తు తం ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ మొదలైంది. ఎస్టీ గురుకుల సొసైటీలో ఉద్యో గుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఈనెల 20వ తేదీనాటికి బదిలీల ప్రక్రియ ముగించాలని రాష్ట్ర ప్రభు త్వం స్పష్టం చేసింది. ఇతర గురుకుల సొసైటీ లన్నీ వేగవంతంగా ప్రక్రియ పూర్తిచేస్తుండగా.. ఎస్సీ గురుకుల సొసైటీలో నెలకొన్న విచిత్ర పరిస్థితితో ఉద్యోగులంతా తలపట్టుకుంటున్నా రు.
ముందుగా జీవో 317 కేటాయింపుల తర్వాత సాధారణ బదిలీలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు వారు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
జీవో 317 బాధితులు ఆందోళన చెందొద్దు
జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులు ఏమాత్రం ఆందోళన చెందవద్దని.. వారికి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేస్తుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చారు. జీవో 317 బాధిత ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో శనివా రం మంత్రి తన క్యాంపు కార్యాలయంలో సమావేశ మయ్యారు.
ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు వివరించిన అంశాలను విన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జీవో 317 బాధిత ఉద్యోగులు, స్పౌజ్ బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్‌కమిటీ శాశ్వత పరిష్కారం చూపుతుందని స్పష్టం చేశారు. అతి త్వరలో కేబినెట్ సబ్ కమిటీ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డికి తుది నివేదిక అందించనుందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment