న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. పార్టీ అధికారంలోకి వస్తే యువ స్వాభిమాన్ యోజన కింద నిరుద్యోగులకు నెలకు రూ. 5,000–7,500 వరకు నిరుద్యోగ భృతి ఇస్తామంది. కరెంటు, నీటిని ఆదా చేసే వినియోగదారులకు క్యాష్‌బ్యాక్ పథకాలు అమలు చేస్తామంది. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని ప్రకటించింది. బడ్జెట్‌లో 25 శాతం నిధులను కాలుష్యంపై పోరాటానికి, రవాణా సౌకర్యాలను మెరుగుపర్చడానికి కేటాయిస్తామని, 300 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందజేస్తామని తెలిపింది. 100 ఇందిరా క్యాంటీన్లను ఏర్పాటు చేసి రూ.15 కే భోజనం అందిస్తామని వెల్లడించింది. ఈ మేరకు ‘ఐసీ హోగీ హమారీ ఢిల్లీ’ పేరిట కాంగ్రెస్ నాయకులు తమ మేనిఫెస్టోను పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment