manifesto release
-
Congress Prty: 7 కీలక హామీలు
సాక్షి, న్యూఢిల్లీ: హరియాణా శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ బుధవారం తమ హామీల చిట్టీని బహిర్గతం చేసింది. తాము అధికారంలోకి వస్తే ప్రజల సంక్షేమం కోసం ఏం చేస్తామనే విషయాన్ని మేనిఫెస్టోలో వివరించింది. పేద, మధ్య తరగతి ప్రజలు, మహిళలు, రైతులకు వరాలు కురిపించింది. మహిళలకు ప్రతి నెల రూ.2,000 ఆర్థికసాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్ సహా పలు వర్గాలపై వరాల జల్లు కురిపించింది. ఏడు కీలకమైన హామీలు ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, హరియాణ మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హూడా, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాన్ల సమక్షంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 53 పేజీల మేనిఫెస్టోను విడుదల చేశారు.ఏడు గ్యారంటీలు ఇవే → మహిళా సాధికారత: 18 నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళలకు నెలకు రూ.2,00 చొప్పున ఆర్థికసాయం. రూ.500కే గ్యాస్ సిలిండర్ → సామాజిక భద్రత: వృద్ధులు, దివ్యాంగులు, వితంతులకు రూ.6,000 పెన్షన్ → యువతకు: రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ → ఉచితాలు: రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్→ పేదలకు: ప్రతి పేద కుటుంబానికి 100 గజాల స్థలంలో ఇల్లు. ఇందులో రూ.3.5 లక్షల ఖర్చుతో రెండు గదుల ఇళ్లు → రైతులకు: పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత → వెనుకబడిన వర్గాలకు: కులగణన చేసి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి తగు చర్యలు తీసుకోవడం. క్రిమిలేయర్ పరిమితిని రూ.10లక్షలకు పెంపు గెలిచాకే సీఎం అభ్యర్థి ఖరారు: ఖర్గే హరియాణలో ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఇచి్చన ఏడు హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీచేస్తామన్నారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు ‘‘దాదాపు 35 లక్షల ఉద్యోగాలను కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయకుండా నిలిపివేసింది. బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఒక ఇంజన్ ముందుకు తీసుకెళ్తుంటే మరో ఇంజన్ వెనక్కి లాగుతోంది. మేం మేనిఫెస్టోలో చెప్పిన ఏడు ప్రధాన వాగ్దానాలను అధికారంలోకి రాగానే నెరవేరుస్తాం. తొమ్మిదిన్నరేళ్లలో రాష్ట్రానికి బీజేపీ చేసిన నష్టాన్ని సరిదిద్దటంతోపాటు రాష్ట్రంలో వృద్ధి పథంలో పరుగులు పెట్టించేందుకు ‘అభివృద్ధి ఎక్స్‌ప్రెస్ ఇంజన్’జత చేస్తాం’’అని ఖర్గే వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించాకే ముఖ్యమంత్రి అభ్యరి్థని ప్రకటిస్తామని ఖర్గే స్పష్టంచేశారు. మేనిఫెస్టో విడుదల సందర్భంగా హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ హుడా సైతం మాట్లాడారు. ‘‘నాటి ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ హయాంలో 1966లో మా రాష్ట్రం ఏర్పాటైంది. నాటి నుంచి 2014 వరకు రాష్ట్రం అభివృద్ధి చెందింది. అయితే తొమ్మిదిన్నరేళ్ల బీజేపీ పాలనలో రాష్ట్రం వెనుకబడిపోయింది. మేం అధికారంలోకి వచ్చాక మళ్లీ హరియాణాను నంబర్ వన్ చేస్తాం’అని హూడా అన్నారు. -
టచ్ మీ నాట్... దూరం జరగండమ్మా
మొత్తానికి రాష్ట్రంలో టీడీపీ సారధ్యంలో ఏర్పడిన ఎన్డీయే కూటమి మనసులు కలవని బలవంతపు కాపురం అని తేలిపోయింది. తప్పనిసరి తంతు తప్ప అందులో తమకేం పెద్ద పాత్ర లేదని బీజేపీ భావిస్తోంది. అందుకే మీ పాట్లేవో మీరు పడండి... అందులో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి నాయుడుగారు అని స్పష్టంగా చెబుతోంది. వాస్తవానికి టీడీపీ.. జనసేన... బీజేపీల కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోను విడుదల చేసే కార్యక్రమానికి చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.దీనికి జాతీయ బీజేపీ నేత సిద్దార్థ నాథ్ సింగ్ సైతం ఢిల్లీ నుంచి వచ్చారు. అయితే ఆ మ్యానిఫెస్టో కాపీ మీద ఎక్కడా మోడీ ఫోటో లేదు. కేవలం చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. అంతేకాకుండా ఆ మ్యానిఫెస్టో కాపీని విడుదల చేసే సమయంలో వరుసగా ఈ ముగ్గురు నాయకులూ నిలబడి ఫోటోలకు.. పత్రికలకు ఫోజులిచ్చారు. అయితే ఆ సందర్భంగా ఆ కాపీని చేత్తో పట్టుకుని బాబు, పవన్ పక్కన నిలబడేందుకు సైతం సింగ్ విముఖత చూపించారు. ఎవరో వచ్చి ఆ కాపీని సింగ్‌కు ఇస్తుండగా అక్కర్లేదు.. అంటూ నేను దాన్ని తాకను అనేలా సంజ్ఞ చేసారు. ఆ తరువాత అయన మీడియాతో మాట్లాడుతూ ఈ మ్యానిఫెస్టో ఈ ఇద్దరిదే.. మా బీజెపికి ఏమీ సంబంధం లేదని చెప్పేసారు. అంతేకాకుండా రాష్ట్ర బిజెపి నుంచి సైతం ఈ కార్యక్రమానికి ఎవరూ.. ఆఖరుకు అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం హాజరు కాలేదు. దీంతో ఇది జస్ట్ పవన్... జనసేనల పొత్తు అని తేలిపోయింది.అసలేం జరిగింది ?గతంలో 2014 లో సైతం ఇలాగే మూడు పార్టీలు పొత్తులో ఎన్నికలకు వెళ్లాయి. అప్పుడు చంద్రబాబు దాదాపు ఆరువందల హామీలు ఇచ్చి.. ఆ తరువాత మాటతప్పి.. మ్యానిఫెస్టోను పార్టీ వెబ్సైట్ నుంచి మాయం చేసారు. ఇప్పుడు ఆ మ్యానిఫెస్టోను సీఎం వైఎస్ జగన్ బయటకు తీసి.. ఒక్కో హామీని ప్రజలకు గుర్తు చేస్తూ ఈ హామీ ఇచ్చారు. అమలు చేసారా అక్కా.. రుణమాఫీ చేసారా అన్నా.. పెన్షన్ ఇచ్చారా తాతా.. డ్వాక్రా రుణాలు మాఫీ చేసారా చెల్లి.. ఉద్యోగాలు ఇచ్చారా తమ్ముడూ.. చూడండి ఈ హామీలకు అప్పట్లో మోడీ.. పవన్ సైతం గ్యారెంటీలుగా ఉన్నారు. వాళ్ళ ఫోటోలు సైతం ఉన్నాయ్. మళ్ళీ అలాంటి వాళ్లకు ఓట్లెద్దామా అంటూ ఊరూరా ప్రచారం చేయడంతో.. చంద్రబాబు ఇచ్చే అమలుసాధ్యం కానీ హామీలవల్ల మేమెందుకు ప్రజలకు జవాబుదారీ కావాలి...? మేమెందుకు పరువుపోగొట్టుకోవాలని భావించిన బీజేపీ ఈసారి ఆ హామీల విషయంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయద్దు నాయుడుగారు.. మీరు మీరు.. ఏదోలా తగలడండి అనేసింది. అంతేకాకుండా దానిమీద మోదీ ఫోటో సైతం వేసేందుకు కేంద్రం ఒప్పుకోలేదని తెలిసింది. అందుకే ఈసారి మ్యానిఫెస్టో మీద కేవలం.. చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉన్నాయ్. మరోవైపు బాబు ఇస్తున్న హామీలకు మా కేంద్రానికి, బీజేపీకి ఎలాంటి బాధ్యత లేదని వాళ్ళు తేల్చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్ల విషయంలో కూడా చంద్రబాబు తమను మోసం చేసినట్లు కేంద్రం గుర్తించింది. పీవీఎన్ మాధవ్, జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు వంటివాళ్లకు టిక్కెట్లు ఇవ్వకుండా కేవలం టీడీపీ నాయకులనే బీజెపి నేతలుగా చూపించి టిక్కెట్లు ఇచ్చుకుని అసలైన బీజెపి నేతలను మోసం చేసారని అధిష్టానం గమనించింది. అంటే ఎన్ని చేసినా.. ఎంత చేసినా కుక్కతోక వంకరే అని.. చంద్రబాబులోని మోసపూరిత గుణం మారదని స్పష్టతకు వచ్చిన కేంద్రం.. అసలు ఈ దరిద్రమే మాకువద్దు. మీ చావు మీరు చావండి. మీ ఎన్నికలు.. మ్యానిఫెస్టోలో మాకు ఏమీ సంబంధం లేదని తేల్చేసింది.:::: సిమ్మాదిరప్పన్న -
సీఎం జగన్ మేనిఫెస్టోకు అందుకే అంత క్రెడిబిలిటీ: జీవీఎల్
సాక్షి, ఢిల్లీ: సీఎం జగన్ మేనిఫెస్టో స్టేటస్కోలా ఉండడంతో క్రెడిబిలిటీ వచ్చిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. సీఎం జగన్ ఉండాలా? లేదా అనే ఫ్యాక్టర్ పైనే ఏపీ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ముస్లిం రిజర్వేషన్ల నిషేధంపై మేము రాజీపడం. అది మా పార్టీ విధానం ’’ అని జీవీఎల్ పేర్కొన్నారు.ఈసీ నిబంధనల ప్రకారమే సింబల్స్ ఇస్తారు. జనసేన పోటీలో ఉన్న చోటే గాజు గ్లాసు గుర్తు వస్తుందన్నది కోర్టు నిర్ణయం. జనసేన పోటీలో లేని చోటే ఫ్రీ సింబల్. ఇది కూటమికి ఇబ్బందికర పరిణామమే’’ అని జీవీఎల్ చెప్పారు.తెలంగాణ రాజకీయాలపై మాట్లాడుతూ, ‘‘తెలంగాణలో బీజేపీకి పది సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. ఇటీవల తెలంగాణలో బీజేపీ బాగా పుంజుకుంది. మొదటి రెండు విడతల్లో పోలింగ్ తగ్గినా మోదీకి ఓటు వేశారు. తాము గెలిచే అవకాశం లేకపోవడంతో ప్రతిపక్షాలు డీలా పడ్డాయి. నిరాశలో ఉండడంతో ఓటు శాతం తగ్గింది’’ అని జీవీఎల్ పేర్కొన్నారు. -
బాబు అలవికాని హామీలు.. మేనిఫెస్టోకు బీజేపీ దూరం
సాక్షి, విజయవాడ: చంద్రబాబు అలవికాని హామీలకు మేం బాధ్యులం కాదంటూ బీజేపీ తప్పించుకుంది. కూటమి మేనిఫెస్టోకు బీజేపీ దూరంగా ఉంది. మేనిఫెస్టోలో మోదీ, బీజేపీ ఫొటోలు వేయొద్దని ఆ పార్టీ అల్టిమేటం జారీ చేసింది.మోదీ, నడ్డా, అమిత్, పురేందేశ్వరి ఫొటోలు లేకుండా కూటమి మేనిఫెస్టోను విడుదల చేశారు. మూడు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో ఇస్తామని ఇన్నాళ్లూ టీడీపీ చెప్పింది. మీడియాను మూడు పార్టీల మేనిఫెస్టో అంటూ పిలిచారు. బీజేపీ ఒప్పుకోకపోవడంతో చంద్రబాబు, పవన్ ఫొటోలతో మేనిఫెస్టో విడుదల చేశారు.మేనిఫెస్టో కాపీని ముట్టుకోవడానికి కూడా బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ ఒప్పుకోలేదు. కూటమి మేనిఫెస్టోకు టీడీపీ, జనసేనదే బాధ్యత అని చంద్రబాబు చెబుతున్నారు. 2014లో మేనిఫెస్టోలో చంద్రబాబు.. మోదీ ఫొటో పెట్టారు.. హామీలు అమలు కాకపోవడంతో మోదీకి చంద్రబాబు చెడ్డపేరు తెచ్చారని బీజేపీ నేతలు అంటున్నారు. బీజేపీ వద్దని గట్టిగా చెప్పడంతోనే మోదీ ఫొటో పెట్టేందుకు చంద్రబాబు సాహసించలేదు.తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బీజేపీ అగ్రనేతలు స్పష్టంగా ముస్లిం రిజర్వేషన్లపై ప్రకటనలు చేస్తున్నారు. తాము అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్నారు. ఆ విషయంలో బీజేపీ, టిడిపి మధ్య పొసగడం లేదని తెలుస్తోంది. అందుకే చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోకు బీజేపీ అధికారికంగా దూరం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. -
వైఎస్సార్సీపీ మేనిఫెస్టో కీలకాంశాలు ఇవే.. (ఫొటోలు)
-
Lok sabha elections 2024: వికసిత భారత్ సంకల్ప పత్రం
సాక్షి, న్యూఢిల్లీ: ‘భాజపా కా సంకల్ప్.. మోదీ కీ గ్యారంటీ–2024’ పేరుతో అధికార బీజేపీ సార్వత్రిక ఎన్నికల సంకల్ప పత్రాన్ని (మేనిఫెస్టో) విడుదల చేసింది. పేదలు, యువత, రైతులు, మహిళలకు (జీవైఏఎన్)లకు మేనిఫెస్టోలో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. చిరు వ్యాపారులు, విశ్వకర్మలు, కారి్మకులకు భరోసా కల్పించారు. సురక్షిత, సమృద్ధ భారత్‌తోపాటు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, అన్ని రంగాల్లో సమగ్ర వికాసం, సాంకేతికత, నవీన ఆవిష్కరణలు వంటి హామీలు ఇచ్చారు. ఆదివారం ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, నిర్మలా సీతారామన్ తదితరులు సంకల్ప పత్రాన్ని విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో లబి్ధపొందిన ఒక మహిళతోపాటు మరో ముగ్గురికి సంకల్ప పత్రం తొలి కాపీలను మోదీ అందజేశారు. అంతకంటే ముందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని నివాళులరి్పంచారు. రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలో 27 మంది కమిటీ సభ్యులు సుమారు 15 లక్షల మంది నుంచి సలహాలు సూచనలు స్వీకరించి, సంకల్ప పత్రాన్ని రూపొందించారు. 24 అంశాలతో కూడిన 57 పేజీలతో మేనిఫెస్టోను సిద్ధం చేశారు. సంకల్ప పత్రంలోని 24 అంశాలు.. ‘2047 నాటికి వికసిత భారత్’ లక్ష్య సాధనే ధ్యేయంగా బీజేపీ మేనిఫెస్టోలో 24 కీలక అంశాలను చేర్చారు. పేద కుటుంబాల సేవ, మధ్యతరగతి కుటుంబాల విశ్వాసం, మహిళా సాధికారత, యువతకు అవకాశాలు, సీనియర్ సిటిజన్లకు ప్రాధాన్యత, రైతులకు గౌరవం, మత్యకార కుటుంబాల సమృద్ధి, కారి్మకులకు గౌరవం, ఎంఎస్‌ఎంఈలక చేయూత, చిరు వ్యాపారులు, విశ్వకర్మల సాధికారత, సబ్కా సాథ్ సబ్ కా వికాస్, విశ్వబంధు భారత్, సురక్షిత భారత్, సమృద్ధ భారత్, గ్లోబల్ తయారీ హబ్, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, ఈజ్ ఆఫ్ లివింగ్, వారసత్వం–అభివృద్ధి, సుపరిపాలన, ఆరోగ్య భారత్, నాణ్యమైన విద్య, క్రీడల వికాసం, అన్ని రంగాల్లో సమగ్ర వికాసం, సాంకేతికత–నూతన ఆవిష్కరణలు, పర్యావరణ అనుకూల భారత్ వంటి అంశాలు ఉన్నాయి. బీజేపీ మేనిఫెస్టోలోని కీలక అంశాలు ► ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావడం ► 80 కోట్ల మంది పేదలకు మరో ఐదేళ్లపాటు ఉచిత రేషన్ ► ఐదేళ్లలో పేదల కోసం మరో మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం ► దివ్యాంగులకు అనుకూలంగా ఇళ్ల నిర్మాణం ► దేశంలో ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో బుల్లెట్ రైళ్లు ► వందేభారత్ రైళ్ల విస్తరణ ► ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్ సరఫరా ► ముద్ర రుణాల పరిమితిని రూ.20 లక్షలకు పెంచడం ► 70 ఏళ్లుపైబడిన వయోజనులకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద రూ.5 లక్షల విలువైన ఉచిత వైద్యం ► వృద్ధుల కోసం ఆయుష్ శిబిరాలు ► రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో పుణ్యక్షేత్రాల సందర్శన కోసం వృద్ధులకు చేయూత ► ట్రాన్స్జెండర్లకు సైతం ఆయుష్మాన్ భారత్ వర్తింపు ► మూడు కోట్ల మంది మహిళలను లఖ్పతీ దీదీలుగా మార్చే ప్రణాళిక ► పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద పేదల నివాసాలకు ఉచిత విద్యుత్ సరఫరా ► మహిళాపారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం ► ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం ► మత్స్య ఉత్పత్తి, ప్రాసెసింగ్ కోసం ప్రత్యేక క్లస్టర్లు ► ఎప్పటికప్పుడు పంటలకు కనీస మద్దతు ధర పెంపు ► ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం ► సేవారంగంలో స్వయం సహాయక సంఘాల అనుసంధానం ► గ్రీన్ ఎనర్జీ, ఫార్మా, సెమీ కండక్టర్, ఎల్రక్టానిక్స్, ఇన్నోవేషన్, లీగల్ ఇన్సూరెన్స్, వాహన రంగాల్లో ప్రపంచస్థాయి హబ్‌ల ఏర్పాటు ► విద్యుత్తు వాహనాల రంగానికి మరింత ప్రోత్సాహం ► రక్షణ, వంటనూనెలు, ఇంధన రంగాల్లో స్వయం సమృద్ధి ► విదేశాల్లోని భారతీయుల భద్రతకు చర్యలు పదేళ్లుగా అభివృద్థి పథంలో భారత్: జేపీ నడ్డా వచ్చే ఐదేళ్లు దేశానికి ఎలా సేవ చేస్తామో చెప్పేదే బీజేపీ మేనిఫెస్టో అని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం పదేళ్లుగా అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, వచ్చే ఐదేళ్లు కూడా ఇది కొనసాగుతుందని నడ్డా వివరించారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తున్నామని, అందరి సహకారం, సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యమని బీజేపీ విశ్వసిస్తోందని పేర్కొన్నారు. ఉమ్మడి పౌరస్మృతి అవసరం: మోదీ దేశంలో ఉమ్మడి ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గత మేనిఫెస్టోల్లోనే ఈ హామీ ఇచి్చనప్పటికీ దాన్ని పూర్తి చేయలేకపోయామని చెప్పారు. గత సంకల్ప పత్రంలో ఇచి్చన ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామ మందిర నిర్మాణం వంటి హామీలను నెరవేర్చామని గుర్తుచేశారు. ఆదివారం మేనిఫెస్టో విడుదల సందర్భంగా మోదీ మాట్లాడారు. సంకల్ప పత్రాన్ని ‘మోదీ కీ గ్యారంటీ’గా అభివరి్ణంచారు. వికసిత భారత్‌లో అంతర్భాగమైన యువ శక్తి, నారీ శక్తి, పేదలు, రైతులు అనే నాలుగు స్తంభాలను తమ సంకల్ప పత్రం బలోపేతం చేస్తుందని అన్నారు. ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ దిశగా అడుగులు వేస్తామన్నారు. దేశాభివృద్ధికి అడ్డుగోడగా మారిన అవినీతిపై యుద్ధం కొనసాగిస్తామని వెల్లడించారు. అవినీతిపరులు ఎంతటివారైనా కటకటాల వెనక్కి పంపిస్తామని, ఇది తన గ్యారంటీ అని స్పష్టం చేశారు. గరీబ్, యువ, అన్నదాత, నారీ(జీవైఏఎన్)ని దృష్టిలో పెట్టుకొని బీజేపీ సంకల్ప పత్రం రూపొందించామని పేర్కొన్నారు. దేశంలోని యువత ఆకాంక్షలను ఈ పత్రం ప్రతిబింబిస్తోందన్నారు. వందేభారత్, బుల్లెట్ రైళ్లను మరింత విస్తరిస్తామని తెలిపారు. ముంబై–అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు మార్గం పూర్తి కావొచి్చందని, ఇక ఉత్తర, దక్షిణ, తూర్పు భారత్‌లో కూడా బుల్లెట్ రైలు మార్గాలు అందుబాటులోకి తీసుకొస్తామని, దీనిపై త్వరలో అధ్యయనం ప్రారంభిస్తామని చెప్పారు. ‘140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలే మోదీ మిషన్. జూన్ 4వ తేదీన ఎన్నికలు ఫలితాలు వచ్చాక వంద రోజుల్లోనే సంకల్ప పత్రాన్ని అమలు చేసే ప్రణాళికతో పని చేస్తున్నాం’ అని ప్రధానమంత్రి మోదీ వివరించారు. బీజేపీ మేనిఫెస్టోని విశ్వసించలేం: ఖర్గే బీజేపీ మేనిఫెస్టోపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం ఘాటుగా స్పందించారు. గత పదేళ్ల కాలంలో పేదల కోసం ఏమీ చేయని ప్రధాని మోదీ ఇప్పుడు కొత్తగా హామీలు గుప్పించడం ఏమిటని ప్రశ్నించారు. అది మేనిఫెస్టో కాదు, జుమ్లా పత్రం అని మండిపడ్డారు. ‘‘రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని గతంలో ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. పంటలకు కనీస మద్దతు ధర పెంచుతానని, చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. గడిచిన పదేళ్లలో దేశంలోని ప్రజలందరికీ మేలు చేసేంత పెద్ద పని ఆయన ఏమీ చేయలేదు. పదేళ్లలో పెరిగిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం గురించి మోదీకి ఏమాత్రం ఆందోళన లేదు. పేదల సంక్షేమం కోసం ఏమీ చేయని ప్రధానమంత్రిని, బీజేపీ మేనిఫెస్టోను విశ్వసించలేం’’ అని ఖర్గే పేర్కొన్నారు. అలాగే ప్రధానమంత్రికి 14 ప్రశ్నలను ‘ఎక్స్’ వేదికగా ఖర్గే సంధించారు. యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైంది? రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశారా? ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామన్న హామీ సంగతేంటి? ఎస్సీ, ఎస్టీలపై నేరాలు 46 శాతం ఎందుకు పెరిగాయి? మహిళా రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయడంలేదు? మహిళలపై అఘాయిత్యాలను ఎందుకు ఆపడం లేదు? 100 కొత్త స్మార్ట్ సిటీల సంగతేంటి? 2020 నాటికి గంగానదిని ప్రక్షాళన చేస్తామన్న హామీ ఎటుపోయింది? అంటూ మల్లిఖార్జున ఖర్గే ప్రశ్నల వర్షం కురిపించారు. -
Lok sabha elections 2024: నేడే బీజేపీ మేనిఫెస్టో విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ మేనిఫెస్టోను బీజేపీ అగ్ర నాయకత్వం ఆదివారం విడుదల చేయనుంది. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సంకల్ప్ పత్రాన్ని ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆవిష్కరిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన అజెండాలుగా నిలిచిన అయోధ్యలో రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు వంటి హామీలను ఇప్పటికే నెరవేర్చిన తరుణంలో ఈసారి అలాంటి ఏఏ కీలకమైన హామీలకు మేనిఫెస్టోలో చోటుకలి్పస్తారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే మేనిఫెస్టోలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తారని తెలుస్తోంది. ప్రధాని మోదీ తరచూ ప్రస్తావించే నాలుగు ప్రధాన కులాలు.. పేదలు, రైతులు, మహిళలు, యువత లక్ష్యంగా హామీలను ప్రస్తావించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మేనిఫెస్టో రూపకల్పనపై కమిటీ ఛైర్మన్, రక్షణ మంత్రి రాజ్నా«థ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యులతో కూడిన కమిటీ ఇప్పటికే రెండుసార్లు భేటీ అయింది. మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలకోసం నమో యాప్ సహా 35 రోజుల ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ఇలా లక్షలాది మంది పార్టీ మద్దతుదారుల నుంచి సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకుని ముఖ్యాంశాలను రూపొందించినట్లు తెలుస్తోంది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా మార్గసూచీని ప్రకటించడంతో పాటు మోదీ గ్యారెంటీలకు సంబంధించిన హామీలను మరోమారు ప్రకటించే అవకాశాలున్నాయి. మతపరమైన అంశాలతో పాటు జాతీయవాద అంశాలను ప్రధానంగా మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశాలున్నాయని కమలనాథులు చెబుతున్నారు. -
Nyay Patra-2024: ఐదు న్యాయాలు.. 25 గ్యారంటీలు
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు ముందు వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలతో కూడిన ఎన్నికల ప్రణాళిక(మేనిఫెస్టో)ను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. యువతకు ఉద్యోగాల కల్పన, నిమ్నవర్గాల సంక్షేమం, సంపద సృష్టి వంటి కీలక హామీలను ప్రకటించింది. పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ఆపన్న హస్తం అందిస్తామని వాగ్దానం చేసింది. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, అగ్నిపథ్ పథకం రద్దు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఎత్తివేత, దేశవ్యాప్తంగా కుల గణన వంటి అంశాలను మేనిఫెస్టోలో చేర్చింది. శుక్రవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు సోనియా గాందీ, రాహుల్ గాందీ, మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ చిదంబరం, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ ‘న్యాయ్ పత్ర–2024’ పేరిట 45 పేజీల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇందులో ప్రధానంగా వివిధ వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఐదు న్యాయాలను ప్రకటించారు. ఒక్కో న్యాయం కింద ఐదు గ్యారంటీల చొప్పున మొత్తం 25 గ్యారంటీలు ఇచ్చారు. ఐదు న్యాయాలు ఏమిటంటే.. నారీ న్యాయ్ ► మహాలక్ష్మీ పథకం కింద దేశవ్యాప్తంగా పేద కుటుంబాల్లోని మహిళకు ఏడాదికి రూ.లక్ష నగదు బదిలీ ► కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ► ఆశ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులకు రెట్టింపు వేతనం ► మహిళ హక్కుల రక్షణ కోసం ప్రత్యేకంగా ‘మైత్రి’ అధికారి నియామకం ► మహిళా ఉద్యోగుల కోసం సావిత్రిబాయి పూలే పేరుతో వసతి గృహాలు కిసాన్ న్యాయ్ ► స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంటలకు కనీస గిట్టుబాటు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత ► రుణమాఫీ కమిషన్ ఏర్పాటు ► పంట నష్టపోయిన 30 రోజుల్లో బీమా పరిహారం చెల్లింపు ► రైతులు లబ్ధి పొందేలా ఎగుమతి, దిగుమతి విధానం ► వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ మినహాయింపు యువ న్యాయ్ ► కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో 30 లక్షల ఉద్యోగాల భర్తీ ► యువత కోసం ‘అప్రెంటీస్íÙప్ హక్కు చట్టం’. డిప్లొమా చదివినవారికి లేదా 25 ఏళ్లలోపు ఉన్న గ్రాడ్యుయేట్‌కు ఏడాదిపాటు అప్రెంటీస్íÙప్ చేసే అవకాశం. వారికి సంవత్సరానికి రూ.లక్ష సాయం. ► ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టేందుకు కఠిన చట్టం ► గిగ్ వర్కర్ల సామాజిక భద్రతకు చర్యలు ► స్టార్టప్ కంపెనీలు ప్రారంభించే యువత కోసం రూ.5,000 కోట్ల నిధి శ్రామిక్ న్యాయ్ ► కార్మికుల కోసం ఆరోగ్య హక్కు చట్టం ► కనీస వేతనం రోజుకు రూ.400. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సైతం వర్తింపు ► పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ పథకం అమలు ► అసంఘటిత రంగాల్లోని కార్మికులకు జీవిత బీమా, ప్రమాద బీమా వర్తింపు ► ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాలు రద్దు హిస్సేదారీ న్యాయ్ ► అధికారంలోకి రాగానే సామాజిక, ఆర్థిక కుల గణన ► ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల విషయంలో 50 శాతం సీలింగ్(పరిమితి) తొలగింపు ► ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు ► జల్, జంగల్, జమీన్‌పై చట్టబద్ధమైన హక్కులు ► గిరిజనులు అధికంగా ఉన్న ప్రాంతాలకు షెడ్యూల్డ్ ఏరియాలుగా గుర్తింపు న్యాయ్ పత్రలోని కీలక హామీలు ► సీనియర్ సిటిజన్లు, వితంతువులకు నెలకు రూ.1,000 చొప్పున పెన్షన్ ► రైల్వే ప్రయాణాల్లో వృద్ధులకు రాయితీ ► ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ ఆలోచనకు చెల్లుచీటి.. ► పదో షెడ్యూల్ సవరణ. పార్టీ ఫిరాయించిన నేతల లోక్‌సభ, అసెంబ్లీ సభ్యత్వాలు రద్దు ► సైన్యంలో నియామకాలకు ఉద్దేశించిన అగ్నిపథ్ పథకం రద్దు ► అన్ని కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు (ఈడబ్ల్యూఎస్) విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం కోటా అమలు. ► జమ్మూకశ్మీర్‌కు, పుదుచ్చేరికి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ► ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎన్నికల తర్వాత ప్రధాని అభ్యర్థి: రాహుల్ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అధికార ఎన్డీయేకు పరాభవం తప్పదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. 2004లో ‘భారత్ వెలిగిపోతోంది’ అంటూ ఎన్నికలకు వెళ్లిన ఎన్డీయే బోల్తా పడిందని, ఈసారి కూడా అదే పునరావృతం కాబోతోందని జోస్యం చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి విజయం ఖాయమని అన్నారు. ఎన్నికల్లో నెగ్గిన తర్వాత తమ ప్రధానమంత్రి అభ్యర్థిని ఉమ్మడిగా నిర్ణయిస్తామని తెలిపారు. తమ పార్టీ మేనిఫెస్టోను ప్రజలే రూపొందించారని, ఇందులో అక్షరాలను మాత్రమే తాము ముద్రించామని వివరించారు. 99 శాతం మంది ప్రజలు కోరుకున్న అంశాలు మేనిఫెస్టోలో ఉన్నాయని తెలిపారు. అదానీ లాంటి కేవలం ఒకటి, రెండు శాతం మంది బడాబాబులు కోరుకున్న అంశాలు బీజేపీ మేనిఫెస్టోలో ఉంటాయని ఎద్దేవా చేశారు. -
రుణ మాఫీ, కుల గణన
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి ఈ నెల 7, 17వ తేదీల్లో రెండు విడతలుగా జరిగే ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. కులగణన, ధాన్యానికి మరింత మద్దతు ధర, రైతులకు రుణామాఫీ, సబ్సిడీ ధరకే వంటగ్యాస్ వంటివి ఇందులో ప్రధాన హామీలుగా ఉన్నాయి. రాజ్‌నందన్‌గావ్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎం బఘేల్ ఎన్నికల హామీలను ప్రకటించారు. మళ్లీ అధికారమిస్తే.. ఎకరానికి 20 క్వింటాళ్ల వరిధాన్యాన్ని రూ.3,200 చొప్పున కొనుగోలు చేస్తామని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందిస్తామని తెలిపారు. తునికాకు స్టాండర్డ్ బ్యాగుకు రూ.4 వేలకు బదులు రూ.6 వేలు చెల్లిస్తామని, సేకరణ దారులకు అదనంగా రూ.4 వేల బోనస్ ఇస్తామని ప్రకటించారు. మహిళలకు వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.500 సబ్సిడీ ఖాతాల్లోనే జమచేస్తామని చెప్పారు. -
ఉచిత బస్సు ప్రయాణం,రూ.3 వేలు నిరుద్యోగభృతి కర్ణాటక మేనిఫెస్టో చూస్తే
-
Karnataka assembly elections 2023: 3 ఉచిత సిలిండర్లు
శివాజీనగర: పోలింగ్‌కు పది రోజులే గడువు ఉందనగా కర్ణాటకలో ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ ప్రకటించింది. ఈసారి మళ్లీ అధికారంలోకి వస్తే ఏకీకృత పౌర స్మృతి, జాతీయ పౌర పట్టీ అమలుచేస్తామని బీజేపీ ప్రకటించింది. ‘ఏకీకృత పౌరస్మృతి దిశగా మేం నడిచేలా రాజ్యాంగం మాకు దారి చూపింది. ‘అందరికీ న్యాయం. బుజ్జగింపులు లేవిక’ అనేదే మా నినాదం’’ అంటూ ఎన్నికల హామీల చిట్టాను సోమవారం బెంగళూరులో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ప్రకటించారు. ‘ఆరు ‘ఏ’లు అంటే ఏ–అన్న(ఆహార భద్రత), ఏ–అక్షర(నాణ్యమైన విద్య), ఏ–ఆరోగ్య(అందుబాటులో ఆరోగ్యం), ఏ–ఆదాయ(ఆదాయ హామీ), ఏ–అభయ(అందరికీ సామాజిక న్యాయం), ఏ–అభివృద్ధి(డెవలప్మెంట్) ఉండేలా బీజేపీ ప్రజా ప్రణాళికను రూపొందించింది’ అని నడ్డా అన్నారు. మేనిఫెస్టోలో మొత్తంగా 103 వాగ్దానాలు ఉన్నాయి. అభివృద్ధికేంద్రంగా మేనిఫెఫ్టో ఉందంటూ మోదీ కొనియాడారు. మేనిఫెస్టోలోని కొన్ని ముఖ్యాంశాలు.. ► ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సు మేరకు రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్(యూసీసీ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సీ) అమలు ► దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఏటా 3 ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు. ► ఈ కుటుంబాలకు ‘పోషణి’ పథకం ద్వారా ఉచితంగా రోజుకు అర లీటరు నందిని పాలు. నెలకు ఐదు కేజీల ‘శ్రీ అన్న– సిరి ధాన్య’. ► రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ వార్డులో ‘అటల్ ఆహార కేంద్రం’ను నెలకొల్పుతాం. అత్యంత కనిష్ట ధరకే నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం. ► మత ప్రాతిపదికన, ఉగ్రవాద వ్యతిరేక కర్ణాటక విభాగం(కే–ఎస్డబ్ల్యూఐఎఫ్టీ) ఏర్పాటు. ► రెవిన్యూ శాఖ గుర్తించిన సొంతిల్లులేని వారికి రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల ఇళ్ల స్థలాలు. ► సామాజిక న్యాయ నిధి పేరిట ఎస్సీ/ఎస్టీ వర్గాల గృహిణులకు గరిష్టంగా రూ.10,000 దాకా ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ల అవకాశం. ► ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రముఖ విద్యావేత్తలు, సంస్థల సౌజన్యంలో విశ్వేశ్వర విద్యా యోజన పథకం ► మిషన్ స్వాస్థ్య కర్ణాటక కింద ప్రతీ వార్డులో నమ్మ క్లినిక్(మన క్లినిక్). ► ఉత్పత్తి ఆధారిత రాయితీ పథకాల ద్వారా మరో 10 లక్షల ఉద్యోగాల కల్పన. ► సివిల్స్, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగ యువతకు ఆర్థికసాయం. ► కర్ణాటకను ఎలక్ట్రిక్ వాహనాల హబ్‌గా మార్చేందుకు చార్జింగ్ స్టేషన్ల స్థాపన, వేయి అంకుర సంస్థలకు ప్రోత్సాహం. ► అన్ని గ్రామ పంచాయతీల్లో చిన్న ఎయిర్ కండిషన్ సదుపాయాలు. వ్యవసాయ ప్రాసెసింగ్ కేంద్రాల స్థాపన. ఇందుకోసం రూ.30 వేల కోట్ల అగ్రిఫండ్ ఏర్పాటు. యడియూరప్ప అసంతృప్తి మేనిఫెస్టో విడుదల సందర్భంగా ప్రసంగించాలని మాజీ సీఎం యడియూరప్పను నేతలు కోరగా.. ప్రణాళికను పూర్తిగా చదవ కుండా ప్రసంగం చేయమంటే ఎలాగని ఆయ న అసంతృప్తిని వ్యక్తంచేశారు. ముందుగానే మేనిఫెస్టో కాపీని ఇవ్వాల్సిందని అనడంతో ఆయనలోని అసంతృప్తి బయటపడింది. అంతా బోగస్: కాంగ్రెస్ విమర్శ ‘అబద్ధపు, లూటీల బీజేపీ మేనిఫెస్టో ఇది. అంతా బోగస్’ అని బీజేపీ హామీల చిట్టాపై కాంగ్రెస్ ఆరోపణలు గుప్పించింది. ‘ మేనిఫెస్టోలో ఉన్న వాటిల్లో 90 శాతం హామీలు 2018లోనే ఇచ్చింది. వీటిని ఇంతవరకు అమలుచేయలేదు. ఇప్పుడు మరో దఫా బోగస్ హామీలిస్తోంది’ అని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా ట్వీట్‌చేశారు. ‘ నందిని బ్రాండ్‌ను అమూల్‌లో కలిపేసి కర్ణాటక ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూసింది. పెను విమర్శలతో ముఖం చెల్లని బీజేపీ ఇప్పుడు అర లీటర్ ఉచితమంటూ ముందుకొచ్చింది. ఇందిర క్యాంటీన్లను మూసేసిన ఇదే సర్కార్ ఇప్పుడు పేరుమార్చి మళ్లీ తెరుస్తానంటోంది. బెంగళూరు బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసి ఇప్పుడు ‘స్టేట్ కేపిటల్ రీజియన్’ అంటూ కొత్తరకం ఫ్యాన్సీ పేర్లతో మభ్యపెడుతోంది. యూపీలో రెండు ఉచిత సిలిండర్లు అన్నారు. ఇంతవరకు దిక్కులేదు. కర్ణాటకలో ఏకంగా మూడు ఇస్తామంటున్నారు’ అని మరో నేత జైరాం రమేశ్ ఎద్దేవాచేశారు. 2013–18 కాలంలో కర్ణాటకలో కాంగ్రెస్ రాష్ట్ర సర్కార్ 95 శాతం హామీలను నెరవేర్చిందని గుర్తుచేశారు. -
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో రిలీజ్
-
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
-
అందుకే ప్రకాశ్ రాజ్ మేనిఫెస్టో విడుదల చేయలేదు: జీవిత
మూవీ ఆర్టిస్ట్ అసోసియేసన్(మా) ఎన్నికలకు ఇంకా కొన్ని గంటలే మిగిలున్నాయి. అయిన ఇప్పటి వరకు ప్రకాశ్ రాజ్ ప్యానల్ తమ మేనిఫేస్టోని ప్రకటించకపోవడం గమనార్హం. గతంలో తమ మేనిఫెస్టో చూస్తే మోహన్ బాబు నేరుగా వచ్చి ఓటు వేస్తారని చెప్పిన ఆయన ఇంతవరకు తమ మేనిఫెస్టోను విడుదల చేయకపోవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఎన్నికలు రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రుకాశ్ రాజ్ ప్యానల్ నుంచి జనరల్ సెక్రెటరీ పదవి పోటీ చేస్తున్న జీవిత రాజశేఖర్ తాజాగా సాక్షితో టీవీతో మాట్లాడారు. ఈ సందర్భంగా తమ మ్యానిఫెస్టో విడుదల చేయకపోవడంపై ఆమె వివరణ ఇచ్చారు. చదవండి: ‘మా’ సభ్యులకు మోహన్ బాబు వాయిస్ మెసెజ్, ఏం అన్నారంటే ఈ మేరకు జీవిత.. మేనిఫేస్టో విడుదల చేయడంపై ప్రకాశ్ రాజ్ గారితో తాను మాట్లాడానని చెప్పారు. దీనికి ఆయన ఇప్పటికే మనం టీవీ ఇంటర్వ్యూ, యూట్యూబ్ చానల్లో, ‘మా’ సభ్యులతో తరచూ కలిసి మన మ్యానిఫెస్టో గురించి మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఎజెండా ఎంటన్నది క్రిస్టల్ క్లియర్‌గా వివరించామని, ఇక దీనినే మనం పేపర్లో పెట్టి ఇదే మా మేనిఫెస్టో అని చెప్పడం అంతా సెన్సిబుల్ అనిపించడం లేదని అన్నట్లు ఆమె తెలిపారు. ఇక విష్ణు రూ. 10 వేలు ఇచ్చి ఓటు వేయించుకుంటున్నాడని మెగా బ్రదర్ నాగబాబు చేసిన కామెంట్స్, ఓట్లు కొనుగోలు అంశంపై జీవిత స్పందిస్తూ.. ఈ విషయం తనకు తెలియదన్నారు. చదవండి: MAA Elections 2021: మంచు విష్ణు ప్యానల్ మేనిఫెస్టో ఇదే నాగబాబు గారు మాట్లాడరనేది నిజమే కానీ ఆయనకు ఏం ఫీలర్ వచ్చిందో తనకు తెలియదన్నారు. ఇలాంటి వార్తలు ఎన్నో పుట్టుకోస్తున్నాయి, పోస్టల్ బ్యాలెట్‌పై కూడా పలు రూమర్స్ వచ్చాయన్నారు. దీనిపైనే ఆయన మాట్లాడి ఉంటారని, ఏం జరుగుతుందన్నది సభ్యులు తెలుసుకుంటారని, అలాంటిది ఏమైన జరుగుతుంటేర్స్ సరైనదో కాదో మెంబర్స్ తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని జీవిత అన్నారు. అయితే ఒక ఎవిడెన్స్, ఫ్రూఫ్ లేకుండా మాత్రం సభ్యులు డబ్బులు తీసుకుంటున్నారనేది చెప్పలేమని ఆమె పేర్కొన్నారు. అనంతరం ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె కోరారు. -
అలాంటివాళ్లు పోటీకి అర్హులు కాదు
ఈ ఏడాది ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు నటుడు సీవీఎల్ నరసింహారావు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఓ వీడియో ద్వారా మేనిఫెస్టోను విడుదల చేశారు.. వాటిలోని ముఖ్యాంశాలు... ► 2011లో ‘మా’ సంక్షేమం కోసం కొన్ని రిజల్యూషన్స్ అనుకున్నాం. అప్పుడు మురళీమోహన్ అధ్యక్షుడిగా ఉన్నారు. అదే మేనిఫెస్టోను అమలు చేయడమే నా తక్షణ కర్తవ్యం. ► ప్రత్యూష మరణించినప్పుడు ఆడపిలల్ల రక్షణ, ఆత్మ గౌరవం కాపాడటం కోసం ‘ఆసరా’ అనే ఆర్గనైజేషన్ ప్రారంభించాం. ఈ ఆర్గనైజేషన్‌ను ఇప్పుడు మా ఆధ్వర్యంలో యాక్టివ్ చేస్తాం. ఇప్పటికే ఓ కమిటీ ఏర్పాటు అయింది. ► ప్రభాకర్‌రెడ్డి, కాంతారావు, పైడి జయరాజ్ వంటి తెలంగాణ నటులను ‘మా’ ద్వారా మళ్లీ మళ్లీ గుర్తు చేయాలని కర్తవ్యంగా పెట్టుకున్నాం. లేకపోతే వారిని మరచిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ► ‘మా’లో లక్ష రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకోలేని వారు చాలా మంది ఉన్నారు. అలాంటివారిని కూడా సభ్యులుగా చేర్చే ప్రయత్నం చేస్తాం. ► ప్రస్తుతం ప్యానళ్లలో ఉంటున్న వాళ్లలో 95శాతం మంది ఇప్పటికే ‘మా’ కార్యవర్గాల్లో పనిచేశారు. పదేళ్ల క్రితం తీసుకొచ్చిన రిజల్యూషన్స్‌ని ఎందుకు అమలు చేయడం లేదో వారే సమాధానం చెప్పాలి. చెప్పలేని వాళ్లు ఎన్నికల్లో మళ్లీ పోటీ పడటానికి, పోటీ చేసి గెలవడానికి, గెలిచి మళ్లీ మనల్ని మోసం చేయడానికి అర్హులు కారని నా ఉద్దేశం. -
సోనార్ బంగ్లా నిర్మిస్తాం: అమిత్‌షా
కోల్‌కతా: తాము అధికారంలోకి వస్తే సోనార్ బంగ్లా(బంగారుబెంగాల్) నిర్మిస్తామని భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చింది. అలాగే ఇంటికొక ఉద్యోగం కల్పిస్తామని, పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) అమలు చేస్తామని పేర్కొంది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ మేనిఫెస్టో ‘సోనాల్ బంగ్లా సంకల్ప పత్ర’ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం కోల్‌కతాలో విడుదల చేశారు. ప్రజలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, సామాజిక భద్రత పథకాలను బలోపేతం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. సీఏఏ అమలుపై కొత్త ప్రభుత్వంలో తొలి కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి వంటి వాటిని బెంగాల్లో అమల్లోకి తీసుకొస్తామని అమిత్ షా ఉద్ఘాటించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింది రాష్ట్రంలో 75 లక్షల మంది రైతులకు రూ.18 వేల చొప్పున ఏరియర్స్ ఇస్తామన్నారు. రైతుల ఆర్థిక భద్రత కోసం రూ.5 వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. సన్నకారు రైతులకు, మత్స్యకారులకు రూ.3 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని వివరించారు. నోబెల్ బహుమతి తరహాలో కళలు, సాహిత్యంలో లబ్ధప్రతిష్టులకు టాగూర్ బహుమతి ప్రదానం చేస్తామని తెలిపారు. ఇందుకోసం రూ.11 వేల కోట్లతో సోనార్ బంగ్లా నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు కేజీ నుంచి పీజీ దాకా విద్యనందిస్తామన్నారు. ప్రజా రవాణా వ్యవస్థలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేందుకు వీలు కల్పిస్తామని చెప్పారు. అలాగే విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ.20 వేల కోట్లతో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఫండ్ ఏర్పాటు చేస్తామని అమిత్ షా పేర్కొన్నారు. సోనార్ బంగ్లా నిర్మించడానికి తమకు ఐదేళ్లు అవకాశం ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు. -
ఉచితంగా కోవిడ్ టీకా
పట్నా: బిహార్‌లో ప్రజలకు ఉచితంగా కోవిడ్–19 వ్యాక్సిన్‌ను అందిస్తామని భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఐసీఎంఆర్ ఆమోదం లభించగానే కోవిడ్–19 వ్యాక్సిన్‌ను ఒకసారి ఉచితంగా అందిస్తామన్నారు. ‘‘కరోనాపై పోరాటంలో బిహార్‌లో ఎన్డీయే ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచింది. కరోనా టీకా ఉచితంగా పంపిణీ చేసే బాధ్యత బీజేపీ తీసుకుంటుంది. ఐసీఎంఆర్ వ్యాక్సిన్‌కి అనుమతినివ్వగానే ప్రజలకు ఉచితంగా అందిస్తాం’’అని నిర్మలా సీతారామన్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా చెప్పారు. భారత్‌లో మూడు టీకాలు వివిధ దశల్లో ప్రయోగాల్లో ఉన్నాయని, అవి విజయవంతమైతే భారీగా టీకా డోసుల్ని ఉత్పత్తి చేయడానికి భారత్ సన్నద్ధంగా ఉందని అన్నారు. వ్యాక్సినేషన్‌కు అనుమతిరాగానే బిహార్ ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. యువతకు 19 లక్షల ఉద్యోగాలు బీజేపీతోనే భరోసా అన్న ట్యాగ్‌లైన్‌తో రూపొందించిన ఎన్నికల హామీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకున్న ఇమేజ్ను పూర్తిగా వాడుకునే ప్రయత్నం చేశారు. వచ్చే అయిదేళ్లలో యువతకి 19 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, పప్పు ధాన్యాలకు కనీస మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విపక్షాల దాడి కరోనా మహమ్మారిని అధికార పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ అంశంలో ఎన్నికల సంఘం పార్టీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ప్రజలంతా వ్యాక్సిన్ తీసుకోవడానికి తమ రాష్ట్రానికి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూడాలా అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఆర్జేడీ, కాంగ్రెస్, శివసేన, సమాజ్‌వాదీ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ తదితర పార్టీలన్నీ కోవిడ్ వ్యాధిని అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. -
హామీల వలలో ఓటరు ఎటు ?
న్యూఢిల్లీ: ఎన్నికల్లో ప్రచారం వేరు, ఇచ్చిన హామీలు వేరు. పోలింగ్‌కు కొద్ది రోజుల ముందు తటస్థ ఓటర్లను ఆకర్షించడానికి ప్రచారాంశాలు దోహద పడతాయి. కానీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే ఎప్పుడైనా అత్యంత కీలకం. ప్రచారంలో జాతీయ భావాన్ని రెచ్చగొడుతున్న బీజేపీ మేనిఫెస్టో దగ్గరకి వచ్చేసరికి స్థానిక అంశాలకే పెద్ద పీట వేసింది. ప్రచార పర్వంలో వెనుకబడ్డ కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో యువత, మైనార్టీ ఓట్లపైనే దృష్టి కేంద్రీకరించింది. ఆప్ గురువారం మేనిఫెస్టో విడుదల చేసినప్పటికీ చాలా రోజుల కిందటే ఇచ్చిన గ్యారంటీ కార్డులతో పాటుగా దేశభక్తి అంశాన్ని చేర్చింది. బీజేపీ: ప్రచారంలో జాతీయ భావం ఎజెండాగా తీసుకొని మాటల తూటాలు పేలుస్తున్న బీజేపీ మేనిఫెస్టోలో స్థానిక అంశాలకే ప్రాధాన్యం ఇచ్చింది. అభివృద్ధి, సంక్షేమాన్ని సమతూకం పాటిస్తూ తూర్పు ఢిల్లీలో వలస కార్మికులు నివసిస్తున్న కాలనీల అభివృద్ధికి డెవలప్మెంట్ బోర్డు, ట్యాంకర్లపై ఆధారపడకుండా ఇంటింటికీ రక్షిత మంచినీరు, మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 10 కోట్లు కేటాయింపు, నిరుపేదలకు రూ.2 కే కిలో గోధుమ పిండి, ఆడపిల్ల పుడితే రూ. 2 లక్షల రూపాయలు, నిరుపేద విద్యార్థులకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు వంటి హామీలు ఇచ్చింది. కాంగ్రెస్: కాంగ్రెస్ పార్టీ ఈసారి ప్రచారంలోనూ, హామీలివ్వడంలో కూడా బీజేపీ, ఆప్ కంటే వెనుకబడింది. మైనార్టీల ఓటర్లనే అత్యధికంగా నమ్ముకున్న ఆ పార్టీ తాము అధికారంలోకి వస్తే సీఏఏకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. యువ స్వాభిమాన్ యోజనకింద నిరుద్యోగులకు రూ.5 వేల నుంచి రూ.7,500 వరకు భృతి ఇస్తామని తన మేనిఫెస్టోలో వెల్లడించింది. అంతేకాకుండా యువత స్టార్టప్‌లు ప్రారంభించడం కోసం రూ.5 వేల కోట్లు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. నెలకి 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వనుంది. ఇక ఢిల్లీ వార్షిక బడ్జెట్లో కాలుష్య నివారణకు ప్రత్యేకంగా నిధులు కేటాయించనుంది. ఆప్: యువత, మహిళా సాధికారత దిశగా ఆప్ ముందుకు వెళుతోంది. హిందూ ఓట్లు చేజారినా కష్టమేనని భావించిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలపై చాలా సంయమనంతో వ్యవహరిస్తున్నారు. హిందూత్వపై కాస్త సానుకూలంగానే ఉంటూ బీజేపీ, కాంగ్రెస్‌కు మధ్యే మార్గంగా అడుగులు వేస్తున్నారు. ఇది మేనిఫెస్టోలో ప్రతిఫలించేలా చర్యలు తీసుకున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఢిల్లీ స్కూళ్లలో దేశభక్తికి సంబంధించిన పాఠ్యాంశాలను ప్రవేశపెడతామన్నారు. తనని అధికార అందలం ఎక్కిస్తాయనుకున్న ఉచిత పథకాల్ని కొనసాగిస్తానంటూ ఇప్పటికే 28 పాయింట్ల గ్యారంటీ కార్డులు ఇచ్చారు. నాణ్యమైన విద్య, నెలకి 200 యూనిట్ల ఉచిత కరెంట్, నెలకి 20 కిలోలీటర్ల ఉచిత నీరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇంటి వద్దకే రేషన్, 10 లక్షల మంది సీనియర్ సిటిజన్లకు ఉచిత తీర్థయాత్ర, పారిశుద్ధ్య కార్మికులు విధి నిర్వహణలో మరణిస్తే కుటుంబానికి కోటి రూపాయల నష్ట పరిహారం వంటి హామీలకే మేనిఫెస్టోలో ప్రధానంగా చోటు కల్పించారు. 24 గంటలు మార్కెట్లను తెరిచి ఉంచడాన్ని ప్రయోగాత్మకంగా చేపడతామని కూడా ఆప్ హామీ ఇచ్చింది. -
నిరుద్యోగ భృతి, క్యాష్‌బ్యాక్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. పార్టీ అధికారంలోకి వస్తే యువ స్వాభిమాన్ యోజన కింద నిరుద్యోగులకు నెలకు రూ. 5,000–7,500 వరకు నిరుద్యోగ భృతి ఇస్తామంది. కరెంటు, నీటిని ఆదా చేసే వినియోగదారులకు క్యాష్‌బ్యాక్ పథకాలు అమలు చేస్తామంది. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని ప్రకటించింది. బడ్జెట్లో 25 శాతం నిధులను కాలుష్యంపై పోరాటానికి, రవాణా సౌకర్యాలను మెరుగుపర్చడానికి కేటాయిస్తామని, 300 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందజేస్తామని తెలిపింది. 100 ఇందిరా క్యాంటీన్లను ఏర్పాటు చేసి రూ.15 కే భోజనం అందిస్తామని వెల్లడించింది. ఈ మేరకు ‘ఐసీ హోగీ హమారీ ఢిల్లీ’ పేరిట కాంగ్రెస్ నాయకులు తమ మేనిఫెస్టోను పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. -
కాంగ్రెస్ గెలిస్తే నిరుద్యోగ భృతి ఎంతో తెలుసా..!
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చోప్రా, కాంగ్రెస్ నేతలు ఆనంద్ శర్మ, అజయ్ మాకెన్‌లు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని ఇళ్లకూ నెలకు 300 యూనిట్ల విద్యుత్‌ను, 20 వేల లీటర్ల మంచి నీటిని ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతి నెలా ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్, 20 వేల లీటర్ల నీటిని అందిస్తామని హామీ ఇవ్వగా... దానికి ప్రతిగా కాంగ్రెస్ 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని మాటిచ్చింది. ఆటోలు, ఈ-రిక్షాలపై ఉన్న రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. ఆహార భద్రత చట్టం కింద ప్రస్తుతం ఇస్తోన్న బియ్యం, గోధుమలను రెట్టింపు చేస్తామని తెలిపింది.ఇందులో నిరుద్యోగ భృతి, ఉచిత విద్యుత్‌కు హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే గ్రాడ్యుయేట్లకు రూ.5,000, పోస్ట్ గ్రాడ్యుయేట్లకు రూ.7.500 చొప్పున ప్రతి నెలా నిరుద్యోగ భృతి కల్పిస్తామని ఈ మేనిఫెస్టోలో భరోసా ఇచ్చింది. 'అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న రూపంలో ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ను అమలు చేసేది లేదు' అని పేర్కొంది. సుప్రీంకోర్టులో సీఏఏను సవాలు చేస్తామని తెలిపింది. గతంలో షీలాదీక్షిత్ ముఖ్యమంత్రిగా వరుసగా మూడు సార్లు ఢిల్లీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పోయింది. కాగా, ఈనెల 8న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, 11న ఓట్లు లెక్కింపు అనంతరం ఫలితాలు ప్రకటిస్తారు. -
లేఅవుట్ల అనుమతులకు సింగిల్ విండో వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్: అవినీతి నియంత్రణలో భాగంగా పారదర్శక పాలనకు ఇళ్లు, లేఅవుట్ల అనుమతుల కోసం పటిష్ట సింగిల్ విండో వ్యవస్థ ఏర్పాటు చేస్తామని తెలంగాణ జనసమితి (టీజేఎస్) తన మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీనిచ్చింది. ఈ ఎన్నికల ప్రణాళికలో అవినీతిరహిత ఆదర్శ మున్సిపాలిటీల కోసం పౌరసంఘాలతో నిఘా వ్యవస్థ (అంబుడ్స్‌మన్) ఏర్పాటు, రాజకీయ, అధికార యంత్రాంగం పనితీరుపై అన్ని కార్యాలయాల్లో పనితీరు పట్టిక, వారానికోసారి ‘ఇంటింటికీ కౌన్సిలర్’కార్యక్రమం, ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణల తొలగింపు, ఉల్లం ఘనులపై చర్యలు, టీజేఎస్ కౌన్సిలర్లు ఆక్రమణలు, అవినీతికి పాల్పడిన పక్షంలో పార్టీ నుంచి సస్పెన్షన్ తదితర అంశాలను పొందుపరిచింది. శనివారం పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు కోదండరాం మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నేతలు గెలిస్తే సంపాదనే లక్ష్యంగా ఉంటారని, రాష్ట్ర ఖజానా ఖాళీ అయినందున ప్రభుత్వం నిధులివ్వదని, మున్సిపాలిటీలను పనిచేయనివ్వరని, అక్రమార్జనకు మున్సిపాలిటీలను వాడుకుంటారని ఆరోపించారు. మేనిఫెస్టోలోని ఇతర ముఖ్యాంశాలు... కాలుష్యరహిత పట్టణాల కోసం పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యం రక్షిత మంచినీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు మురుగునీటి నిర్వహణ అమలు ద్వారా ప్రాణాంతక వ్యాధులు రాకుండా నివారణ పట్టణాల్లో సులభ్ తరహాలో మరుగుదొడ్లు, మహిళలకు ప్రత్యేక మరుగుదొడ్లు మున్సిపల్ స్కూళ్ల సమర్థ నిర్వహణ నిధులు, విధులు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో పౌర సంఘాలకు పాత్ర నాణ్యమైన సత్వరమైన వైద్య సదుపాయాలతో బస్తీ క్లినిక్‌ల ఏర్పాటు పట్టణ పేదలకు గృహ వసతి, మురికి వాడలకు కనీస వసతులు -
రూ.10కి భోజనం.. రూ.1కే వైద్యపరీక్షలు
సాక్షి ముంబై: మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో శివసేన పార్టీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే శనివారం మేనిఫెస్టోను విడుదల చేశారు. ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నట్టే రూ. 10కే భోజనం అందించనున్నట్టు పేర్కొన్నారు. ఒకే వంటశాలలో తయారుచేసిన భోజనాన్ని చుట్టుపక్కల ప్రాంతాలకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పొదుపు సంఘాల మహిళలను కూడా ఇందులో చేర్చుకోనున్నట్టు తెలిపారు. మరోవైపు ఇళ్లలో వినియోగించే విద్యుత్ చార్జీలలో 300 యూనిట్ల వరకు వచ్చే బిల్లులపై 30 శాతం రాయితీ కల్పించనున్నట్టు ప్రకటించారు. ఆరోగ్యం..విద్య.. ప్రజలకు అందుబాటులో లేని 200 రకాల ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు కేవలం ఒక్క రూపాయికే అందించనున్నట్లు తెలిపారు. పేద రైతులకు ప్రతి సంవత్సరం రూ.10వేలు నేరుగా అకౌంట్లో జమ చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని 15 లక్షల పట్టభద్రులైన యువకులకు ‘యువ ప్రభుత్వం ఫెలో’ ద్వారా స్కాలర్షిప్ అందిస్తామన్నారు. ఉపాధి కల్పించే శిక్షణ సంస్థలను ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామాల నుంచి పాఠశాల వరకు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఎక్స్‌ప్రెస్ బస్సులను ప్రారంభించనున్నట్టు తెలిపారు. విద్యార్థులందరికి మానసిక, శారీరక పరీక్షలు నిర్వహించనున్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిని భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటు వంటి విషయాలు మేనిఫెస్టోలో ఉన్నాయి. ముంబైలోని ఆరే కాలనీలో చెట్ల నరికివేత గురించి మేనిఫేస్టోలో లేదు. -
రాష్ట్ర హోదానే మా ప్రధాన ఎజెండా
న్యూఢిల్లీ: ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఎజెండాతోనే లోక్‌సభ ఎన్నికలకు వెళుతున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్, ఢిల్లీ సీఎంæ కేజ్రీవాల్ తెలిపారు. మోదీ–అమిత్‌షా ద్వయాన్ని అధికారానికి దూరంగా ఉంచేందుకు ఏ లౌకికవాద కూటమికైనా మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. మే 12న ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేజ్రీవాల్ గురువారం ఆప్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇచ్చే కూటమికి తాము మద్దతు ఇస్తామని ఆయన ప్రకటించారు. జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్) ప్రజలకు కళాశాలలు, ఉద్యోగాల్లో 85 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని మేనిఫెస్టోలో వెల్లడించారు. ఈ మేనిఫెస్టోను ఆప్ రెండుగా విభజించింది. ఒక విభాగంలో పూర్తిస్థాయి రాష్ట్ర హోదా లేకుండానే గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం ఏం సాధించిందో వివరించింది. ఒకవేళ హోదా లభిస్తే ఏమేం చేస్తామో మరో భాగంలో ప్రస్తావించింది. రాహులే కారణం.. ఢిల్లీకి రాష్ట్రహోదా ఇస్తామని చెప్పి బీజేపీ ప్రజలను మోసం చేసిందని కేజ్రీవాల్ మండిపడ్డారు. లండన్, బెర్లిన్, మాస్కో, వాషింగ్టన్ వంటి నగరాల్లో పోలీసులతో పాటు ఇతర అధికారుల నియామకాలు, బదిలీలు, నగర ప్రణాళిక విషయంలో స్థానిక ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయనీ, అక్కడ ఎదురుకాని ఇబ్బందులు ఇక్కడెందుకు వస్తాయని ప్రశ్నించారు. ఒకవేళ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే దానికి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తమతో పొత్తు కుదర్చుకోకుండా మాటలకే పరిమితమైందన్నారు. కాంగ్రెస్ కోరినట్లు 3 లోక్‌సభ స్థానాలను ఇచ్చుంటే వాటిని బీజేపీ గెలుచుకునేదన్నారు. -
కాంగ్రెస్ హామీలకు ఏటా అయ్యే ఖర్చెంత?
కాంగ్రెస్ పార్టీ మంగళవారం విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో కనీస ఆదాయ పథకం నుంచి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, రైతులకు ప్రత్యేక బడ్జెట్,ఆరోగ్య సంరక్షణ వరకు అనేక హామీలు ఇచ్చింది.అయితే, ఈ హామీల అమలుకు ఏటా పది లక్షల కోట్ల రూపాయలు కావలసి ఉంటుందని, అది దేశ ఆర్థిక వ్యవస్థనే కుదేలు పరుస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ► కనీస ఆదాయ పథకం (న్యాయ్) ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న 20శాతం నిరుపేద కుటుంబాలకు ఏటా 72వేల చొప్పున ఇవ్వాలి.అయితే, దీన్ని యథాతథంగా అమలు చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థే తల్లకిందులవుతుందని నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.కనీస ఆదాయ పథకం కోసం ఏటా 3.60 లక్షల కోట్లు కావాలి. మొదటి సంవత్సరం దీనికయ్యే ఖర్చు దేశ జీడీపీలో దాదాపు 1శాతం ఉంటుంది. రెండో ఏడాది అది 1.5శాతానికి పెరుగుతుంది. ► జీడీపీలో 6శాతం విద్యకే కావాలి విద్యారంగం వ్యయాన్ని పెంచడం మంచిదే.ఈ సొమ్ములో అధికభాగం మౌలిక సదుపాయాలు, టీచర్లకు వేతనాల కోసం వెచ్చించాల్సి ఉంటుంది.ప్రస్తుతం ప్రభుత్వం జీడీపీలో 4.6శాతాన్ని విద్యకోసం వెచ్చిస్తోందని హెచ్ఆర్డీ మంత్రి ప్రకాశ్‌జవదేకర్ చెబుతున్నారు. ఇది 8.76 లక్షల కోట్లకు సమానం.కాంగ్రెస్ తాజా హామీ అమలు పరచాలంటే అదనంగా ఏటా మరో 2.66 లక్షల కోట్లు అవసరం.అంటే, ఏటా మొత్తం 11.4 లక్షల కోట్ల రూపాయలు కావాలన్నమాట. ► ఆరోగ్య సంరక్షణకు 5 లక్షల కోట్లు 2023–24నాటికి ఆరోగ్య సంరక్షణ కోసం జీడీపీలో 3శాతం వరకు వెచ్చించనున్నట్టు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొంది. ప్రస్తుత వ్యయం కంటే ఇది రెండింతలు ఎక్కువ.నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం ప్రస్తుతం ఆరోగ్యంపై ఏటా 2.47 లక్షల కోట్లు (జీడీపీలో1.3శాతం) ఖర్చు చేస్తున్నారు. పౌరులందరికీ ఉచితంగా ఆరోగ్య సంరక్షణ కల్పించడం, వైద్య సదుపాయాలను మెరుగుపరచడం వంటి రాహుల్ గాంధీ హామీలను అమలు పరచాలంటే ఏటా 5.71లక్షల కోట్లు అవుతుంది. మొత్తం మీద కాంగ్రెస్ ఎన్నికల హామీలు వార్షిక బడ్జెట్‌పై 10 లక్షల కోట్ల అదనపు భారాన్ని వేస్తాయి. 2019–20 సంవత్సరంలో బడ్జెట్ వ్యయం 27.84 లక్షల కోట్లు మాత్రమే. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే రాహుల్ హామీలు ఎంత భారమో అర్థమవుతుంది. ప్రభుత్వ ఆదాయం ఏటా 12 నుంచి 14శాతం పెరుగుతోంది. 2018–19లో 24.57 లక్షల కోట్లు ఉన్న ఆదాయం 2023–24 నాటికి 45 లక్షల కోట్లకు పెరుగుతుంది. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అయితే, హామీల అమలుకు ఏటా 10లక్షల కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఇప్పటికే సిబ్బంది వేతనాలు, వడ్డీల చెల్లింపులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, సామాజిక పథకాల వ్యయం మొదలయిన వాటికి అయ్యే ఖర్చు ఆదాయానికి మించిపోతోంది. ఇలాంట పరిస్థితుల్లో ఏటా అదనంగా పది లక్షల కోట్లు భరించడం భారమేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సర్కారీ కొలువుల భర్తీ భారం 8వేల కోట్లకుపైనే.. 2020 మార్చి నాటికి 4 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, రాష్ట్రాలు మరో 20 లక్షల ఖాళీలు భర్తీ చేసేలా చూస్తామని కాంగ్రెస్ మానిఫెస్టో హామీ ఇచ్చింది.7వ వేతన సంఘం సిఫారసు ప్రకారం ఉద్యోగి కనీస వేతనం 18వేలు. అంటే ఏడాదికి 2.16లక్షలు. రాహుల్ చెప్పినట్టు 4లక్షల మందిని నియమిస్తే వారికి కనీస వేతనం లెక్కన చూసినా ఏడాదికి 8,640 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.రాష్ట్రాలు కూడా మరో 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే ఈ భారం తడిసిమోపెడవుతుంది. -
కనీస వేతనం 18వేలు చేస్తాం
న్యూఢిల్లీ: కనీస వేతనం నెలకు రూ.18 వేలు ఉండేలా చట్టం, పౌరులపై ప్రభుత్వ సంస్థల నిఘా ఎత్తివేత, టెలికం సంస్థలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల గుత్తాధిపత్యానికి అడ్డుకట్ట. ఇవీ సీపీఎం మేనిఫెస్టోలో ప్రధానాంశాలు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు గాను గురువారం సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే పౌరుల గోప్యతా హక్కుకు భంగం కలిగించేలా ఉన్న ఐటీ చట్టంలోని 69వ సెక్షన్‌ను తొలగిస్తుందని ఏచూరి తెలిపారు. ‘పౌరుల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా/ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పడకుండా నివారిస్తాం. ఆధార్, బయో మెట్రిక్ సమాచారాన్ని సంక్షేమ పథకాలకు వినియోగించుకోవటాన్ని నిలిపివేస్తాం. రైతులు తమ ఉత్పత్తులను కనీస మద్దతు ధరకు విక్రయించుకునేలా హక్కు కల్పిస్తాం’ అని తెలిపారు. కొన్ని టెలికం సంస్థల గుత్తాధిపత్య ధోరణిని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నెలకు రూ.18 వేలకు తక్కువ కాకుండా వేతనం ఉండేలా చట్టం చేస్తామని తెలిపారు. ప్రజా పంపిణీ విధానం ద్వారా కుటుంబానికి నెలకు 35 కేజీల ఆహార ధాన్యాలు అందించటంతోపాటు వృద్ధాప్య పింఛను రూ.6 వేలకు పెంచుతామన్నారు. ఎలక్టోరల్ బాండ్లకు బదులు అభ్యర్థుల ఎన్నికల ఖర్చును ప్రభుత్వమే భరించేలా చట్టం చేస్తామన్నారు.