AP Assembly Elections 2024: BJP Not Involved At AP Alliance Manifesto Release, Modi Stamp Missing | Sakshi
Sakshi News home page

TDP Janasena Manifesto: టచ్ మీ నాట్... దూరం జరగండమ్మా

Published Wed, May 1 2024 9:12 AM | Last Updated on Wed, May 1 2024 12:45 PM

BJP Not involved At ap Alliance Manifesto Release Modi stamp missing

నన్ను ఇన్వాల్వ్ చేయకండి నాయుడుగారు

మీ దారిద్రంతో మాకు సంబంధం లేదు

ఉమ్మడి మ్యానిఫెస్టోను తాకనైనా తాకని బిజెపి నేత

మొత్తానికి రాష్ట్రంలో టీడీపీ సారధ్యంలో ఏర్పడిన ఎన్డీయే కూటమి మనసులు కలవని బలవంతపు కాపురం అని తేలిపోయింది. తప్పనిసరి తంతు తప్ప అందులో తమకేం పెద్ద పాత్ర లేదని బీజేపీ భావిస్తోంది. అందుకే మీ పాట్లేవో మీరు పడండి... అందులో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి నాయుడుగారు అని స్పష్టంగా చెబుతోంది. వాస్తవానికి టీడీపీ.. జనసేన... బీజేపీల కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోను విడుదల చేసే కార్యక్రమానికి చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.

దీనికి జాతీయ బీజేపీ నేత సిద్దార్థ నాథ్ సింగ్ సైతం ఢిల్లీ నుంచి వచ్చారు. అయితే ఆ మ్యానిఫెస్టో కాపీ మీద ఎక్కడా మోడీ ఫోటో లేదు. కేవలం చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. అంతేకాకుండా ఆ మ్యానిఫెస్టో కాపీని విడుదల చేసే సమయంలో వరుసగా ఈ ముగ్గురు నాయకులూ నిలబడి ఫోటోలకు.. పత్రికలకు ఫోజులిచ్చారు. అయితే ఆ సందర్భంగా ఆ కాపీని చేత్తో పట్టుకుని బాబు, పవన్ పక్కన నిలబడేందుకు సైతం సింగ్ విముఖత చూపించారు. ఎవరో వచ్చి ఆ కాపీని సింగ్‌కు ఇస్తుండగా అక్కర్లేదు.. అంటూ నేను దాన్ని తాకను అనేలా సంజ్ఞ చేసారు. ఆ తరువాత అయన మీడియాతో మాట్లాడుతూ ఈ మ్యానిఫెస్టో ఈ ఇద్దరిదే.. మా బీజెపికి ఏమీ సంబంధం లేదని చెప్పేసారు. అంతేకాకుండా రాష్ట్ర బిజెపి నుంచి సైతం ఈ కార్యక్రమానికి ఎవరూ.. ఆఖరుకు అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం హాజరు కాలేదు. దీంతో ఇది జస్ట్ పవన్... జనసేనల పొత్తు అని తేలిపోయింది.

అసలేం జరిగింది ?
గతంలో 2014 లో సైతం ఇలాగే మూడు పార్టీలు పొత్తులో ఎన్నికలకు వెళ్లాయి. అప్పుడు చంద్రబాబు దాదాపు ఆరువందల హామీలు ఇచ్చి.. ఆ తరువాత మాటతప్పి.. మ్యానిఫెస్టోను పార్టీ వెబ్‌సైట్‌ నుంచి మాయం చేసారు. ఇప్పుడు ఆ మ్యానిఫెస్టోను సీఎం వైఎస్ జగన్ బయటకు తీసి.. ఒక్కో హామీని ప్రజలకు గుర్తు చేస్తూ ఈ హామీ ఇచ్చారు. అమలు చేసారా అక్కా.. రుణమాఫీ చేసారా అన్నా.. పెన్షన్ ఇచ్చారా తాతా.. డ్వాక్రా రుణాలు మాఫీ చేసారా చెల్లి.. ఉద్యోగాలు ఇచ్చారా తమ్ముడూ.. చూడండి ఈ హామీలకు అప్పట్లో మోడీ.. పవన్ సైతం గ్యారెంటీలుగా ఉన్నారు. వాళ్ళ ఫోటోలు సైతం ఉన్నాయ్. మళ్ళీ అలాంటి వాళ్లకు ఓట్లెద్దామా అంటూ ఊరూరా ప్రచారం చేయడంతో.. చంద్రబాబు ఇచ్చే అమలుసాధ్యం కానీ హామీలవల్ల మేమెందుకు ప్రజలకు జవాబుదారీ కావాలి...? మేమెందుకు పరువుపోగొట్టుకోవాలని భావించిన బీజేపీ ఈసారి ఆ హామీల విషయంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయద్దు నాయుడుగారు.. మీరు మీరు.. ఏదోలా తగలడండి అనేసింది. 

అంతేకాకుండా దానిమీద మోదీ ఫోటో సైతం వేసేందుకు కేంద్రం ఒప్పుకోలేదని తెలిసింది. అందుకే ఈసారి మ్యానిఫెస్టో మీద కేవలం.. చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉన్నాయ్. మరోవైపు బాబు ఇస్తున్న హామీలకు మా కేంద్రానికి, బీజేపీకి ఎలాంటి బాధ్యత లేదని వాళ్ళు తేల్చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్ల విషయంలో కూడా చంద్రబాబు తమను మోసం చేసినట్లు కేంద్రం గుర్తించింది. పీవీఎన్ మాధవ్, జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు వంటివాళ్లకు టిక్కెట్లు ఇవ్వకుండా కేవలం టీడీపీ నాయకులనే బీజెపి నేతలుగా చూపించి టిక్కెట్లు ఇచ్చుకుని అసలైన బీజెపి నేతలను మోసం చేసారని అధిష్టానం గమనించింది. అంటే ఎన్ని చేసినా.. ఎంత చేసినా కుక్కతోక వంకరే అని.. చంద్రబాబులోని మోసపూరిత గుణం మారదని స్పష్టతకు వచ్చిన కేంద్రం.. అసలు ఈ దరిద్రమే మాకువద్దు. మీ చావు మీరు చావండి. మీ ఎన్నికలు.. మ్యానిఫెస్టోలో మాకు ఏమీ సంబంధం లేదని తేల్చేసింది.

:::: సిమ్మాదిరప్పన్న

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement