సాక్షి, ఢిల్లీ: సీఎం జగన్ మేనిఫెస్టో స్టేటస్కోలా ఉండడంతో క్రెడిబిలిటీ వచ్చిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. సీఎం జగన్ ఉండాలా? లేదా అనే ఫ్యాక్టర్ పైనే ఏపీ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ముస్లిం రిజర్వేషన్ల నిషేధంపై మేము రాజీపడం. అది మా పార్టీ విధానం ’’ అని జీవీఎల్ పేర్కొన్నారు.
ఈసీ నిబంధనల ప్రకారమే సింబల్స్ ఇస్తారు. జనసేన పోటీలో ఉన్న చోటే గాజు గ్లాసు గుర్తు వస్తుందన్నది కోర్టు నిర్ణయం. జనసేన పోటీలో లేని చోటే ఫ్రీ సింబల్. ఇది కూటమికి ఇబ్బందికర పరిణామమే’’ అని జీవీఎల్ చెప్పారు.
తెలంగాణ రాజకీయాలపై మాట్లాడుతూ, ‘‘తెలంగాణలో బీజేపీకి పది సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. ఇటీవల తెలంగాణలో బీజేపీ బాగా పుంజుకుంది. మొదటి రెండు విడతల్లో పోలింగ్ తగ్గినా మోదీకి ఓటు వేశారు. తాము గెలిచే అవకాశం లేకపోవడంతో ప్రతిపక్షాలు డీలా పడ్డాయి. నిరాశలో ఉండడంతో ఓటు శాతం తగ్గింది’’ అని జీవీఎల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment