
టీడీపీ-బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో పోటీచేస్తున్న టీడీపీ-బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం విడుదల చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలు కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అవినీతిరహిత పాలన అందజేస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను కచ్చితంగా చేసి తీరుతామని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. మేనిఫెస్టో లో పేర్కొన్న అంశాలను మీడియాకు తెలిపారు.
టీడీపీ-బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో అంశాలు:
ప్రతి ఇంటికి మంచినీరు సరఫరా
వైఫై నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దడం
పేదలందరికీ ఉచిత నల్లా కనెక్షన్
ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించి ఇవ్వడం
నగరంలోని అన్ని ముఖ్య కూడళ్లలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణం
ప్రతి ఇంటికి సెట్ టాప్ బాక్స్ సౌకర్యం కల్పించడం