GHMC eletions
-
‘మమ్మీ కంగ్రాట్యులేషన్, ఐ లవ్యూ’
సాక్షి, హిమాయత్‌నగర్ : బల్దియా కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం.. మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక సందర్భంగా గురువారం పలు ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. ► మేయర్ పదవి రావడం లేదనే సమాచారంతో టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయారెడ్డి అసంతృప్తితో దోమలగూడలోని తన తల్లి నివాసానికి వెళ్లిపోయారు. ఎంపీ సంతోష్, హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ కవిత, టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కేకే, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఆమెకు ఫోన్ చేశారు. ►సుమారు పది నిమిషాల పాటు ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేశారు. మేయర్ ఎన్నిక సమయంలోగా ఆమె తిరిగి వచ్చారు. ఈ మాత్రం దానికి అలగడం ఎందుకు.. తిరిగి రావడం ఎందుకంటూ బీజేపీ సభ్యులు మాట్లాడుకోవడం వినిపించింది. ►మేయర్ ఎన్నికకు మద్దతుగా టీఆర్ఎస్కు సభ్యులు చేతులెత్తి ఓట్లు వేయడంతో బీజేపీ సభ్యుల అరుపులతో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. ►ఓ పక్క మంత్రి కేటీఆర్ మజ్లిస్‌తో పొత్తు ఉండదని చెబుతూనే ఇక్కడ మాత్రం కవిత, ఎంపీ సంతోష్‌లు పొత్తు కుదుర్చుకుని, ఏ రకంగా నీతి మాటలు మాట్లాడతారంటూ ఎన్నిక ముగిశాక పలువురు మీడియాతో మాట్లాడారు . ►మేయర్ ఎన్నికకు ముందే హాల్ వెలుపలకు వచ్చిన కొందరు ఎంఐఎం సభ్యులు ఏం చేద్దాం.. అధిష్టానం చెప్పినట్లు మనం వినాల్సిందేగా.. హ్యాండ్స్ రేజ్ చేద్దామంటూ మాట్లాడుకున్నారు. ►ఎన్నిక పూర్తయ్యాక బయటకు వచ్చిన ఎంఐఎం సభ్యులను పలకరిస్తూ మీడియా ప్రతినిధులు టీఆర్ఎస్తో పొత్తు ఉండదని మీ అధినాయకులు చెప్పారని గుర్తుచేయగా, మాకు పర్సనల్ ఇంట్రస్ట్ ఉండదు కదా.. అంటూ వెళ్లిపోయారు. ►కాంగ్రెస్ కార్పొరేటర్లు రజిత, సింగిరెడ్డి శిరిషా రెడ్డిలు ప్రమాణ స్వీకారం ముగియగానే బయటకు వచ్చారు. ►సీఎం కేసీఆర్ చీకటి ఒప్పందాలకు తెరతీశారంటూ ఆరోపించారు. ఢిల్లీ వెళ్లి మోదీ, అమిత్‌షాతో.. ఇక్కడ మజ్లిస్ స్నేహాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు హైడ్రామా క్రియేట్ చేశారన్నారు. ►టీఆర్ఎస్, ఎంఐఎం పొత్తుపై ఎమ్మెల్సీ కవితను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ఇద్దరు మహిళలు మేయర్, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికవ్వడం ఆనందంగా ఉందంటూ సమాధానాన్ని దాటవేశారు. జైతెలంగాణ నినాదాలు చేసుకుంటూ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి కార్పొరేటర్లతో కలిసి వెళ్లారు. ►డిప్యూటీ మేయర్‌గా మోతే శ్రీలత ఎన్నిక కావడంతో ఆమె కుమార్తె తేజస్వి భావోద్వేగానికి గురయ్యారు. హాలు నుంచి బయటకు వచ్చిన తల్లిని హత్తుకుని విషెస్ చెప్పారు. తల్లిని కిస్ చేస్తూ మమ్మీ కంగ్రాట్చులేషన్, ఐ లవ్యూ అంటూ ఎగిరి గంతేశారు. -
వ్యూహ రచన: కేసీఆర్‌తో ఒవైసీ భేటీ
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)పై అధికార టీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది. గత ఎన్నికల్లో సాధించిన ఫలితాలనే మరోసారి పునరావృత్తం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే స్థానిక నేతలను, మంత్రులను రంగంలోకి దించింది. ఓవైపు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తుతూనే రాజకీయంగా వ్యూహరచన చేస్తోంది. పొత్తులు ఎత్తులపై ప్రగతి భవన్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతలతో మంతనాలు చేస్తున్నారు. ఎన్నికల్లో ఎలానైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికలను అధికార పార్టీతో పాటు విపక్షాలు సైతం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ ఇప్పటికే విడతల వారీగా సమావేశాలు నిర్వహించింది. ఇక దుబ్బాక విజయం నేపథ్యంలో అనూహ్యంగా బీజేపీ సైతం రేసులోకి దూసుకొచ్చింది. గ్రేటర్లో 75 స్థానాల్లో విజయం సాధించడమే తమ లక్ష్యమని కాషాయ దళపతి బండి సంజయ్ ఇదివరకే ప్రకటించారు. దుబ్బాక విజయం తమకు రెట్టింపు ఉత్సాహాన్నిచ్చిందని, అదే స్ఫూర్తితో గ్రేటర్‌లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ మరింత అప్రమత్తమైంది. బీజేపీ నుంచి ముంచుకొస్తున్న ముప్పును అంచనా వేసిన గులాబీ బాస్ కేసీఆర్ ఆ మేరకు ఎత్తులు సైతం సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో కేసీఆర్ భేటీ అయ్యారు. గురువారం ప్రగతిభవన్ వేదికగా సాగిన వీరి సమావేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, సీట్లు సర్దుబాటుపై సుదీర్ఘంగా చర్చించనట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో మొత్తం 150 సీట్లకు గాను టీఆర్ఎస్ 99, ఎంఐఎం 40 స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా అవే ఫలితాలను సాధించాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. అయితే ఇరు పార్టీలు ముందగానే అవగాహానకు వచ్చి ఎన్నికల ముందు పొత్తు పెట్టుకుంటాయా, లేక విడివిడిగా పోటీ చేస్తాయా అనేది ఇంకా తేలాల్సి ఉంది. కాగా గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. డిసెంబర్ మొదటివారంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ యోచిస్తోంది. -
అసెంబ్లీ ముట్టడికి యత్నం, ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి బీజేపీ, సీపీఐ, ,నిరుద్యోగ సంఘాల నేతలు యత్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కారొపరేషన్‌కు ఎన్నికలు దగ్గరపడుతుండటంతో జీహెచ్ఎంసీ చట్టాన్ని సవరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు మంగళవారం ఉదయం రాష్ట్ర అసెంబ్లీ సమావేశమైంది. అయితే, జీహెచ్ఎంసీ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇద్దరికి మించి పిల్లలు ఉన్నప్పటికీ పోటీ చేయవచ్చనే చట్టసవరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. రిజర్వేషన్లు చేయకుండా జీహెచ్ఎంసి ఎన్నికలకు వెళ్లకూడదని డిమాండ్ చేశారు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం సీపీఐ, ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు కూడా అసెంబ్లీ వద్ద నిరసనకు దిగారు. కాషాయ పార్టీ, సీపీఐ, నిరుద్యోగ సంఘాల నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా అసెంబ్లీ వైపు దూసుకెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అసెంబ్లీ వద్ద గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా ఉదయం నుంచే అక్కడ పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. (function(w,d,s,u,n,i,f,g,e,c){w.WDMObject=n;w[n]=w[n]||function(){(w[n].q=w[n].q||[]).push(arguments);};w[n].l=1*new Date();w[n].i=i;w[n].f=f;w[n].g=g;e=d.createElement(s);e.async=1;e.src=u;c=d.getElementsByTagName(s)[0];c.parentNode.insertBefore(e,c);})(window,document,"script","//api.dmcdn.net/pxl/cpe/client.min.js","cpe","5f686da28ba2a6d8cbff0ede",{scroll_to_pause: true}); -
టీడీపీ-బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల
-
టీడీపీ-బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల
-
టీడీపీ-బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో పోటీచేస్తున్న టీడీపీ-బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం విడుదల చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలు కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అవినీతిరహిత పాలన అందజేస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను కచ్చితంగా చేసి తీరుతామని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. మేనిఫెస్టో లో పేర్కొన్న అంశాలను మీడియాకు తెలిపారు. టీడీపీ-బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో అంశాలు: ప్రతి ఇంటికి మంచినీరు సరఫరా వైఫై నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దడం పేదలందరికీ ఉచిత నల్లా కనెక్షన్ ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించి ఇవ్వడం నగరంలోని అన్ని ముఖ్య కూడళ్లలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణం ప్రతి ఇంటికి సెట్ టాప్ బాక్స్ సౌకర్యం కల్పించడం