ఈ ఏడాది ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు నటుడు సీవీఎల్ నరసింహారావు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఓ వీడియో ద్వారా మేనిఫెస్టోను విడుదల చేశారు.. వాటిలోని ముఖ్యాంశాలు...
► 2011లో ‘మా’ సంక్షేమం కోసం కొన్ని రిజల్యూషన్స్ అనుకున్నాం. అప్పుడు మురళీమోహన్ అధ్యక్షుడిగా ఉన్నారు. అదే మేనిఫెస్టోను అమలు చేయడమే నా తక్షణ కర్తవ్యం.
► ప్రత్యూష మరణించినప్పుడు ఆడపిలల్ల రక్షణ, ఆత్మ గౌరవం కాపాడటం కోసం ‘ఆసరా’ అనే ఆర్గనైజేషన్ ప్రారంభించాం. ఈ ఆర్గనైజేషన్‌ను ఇప్పుడు మా ఆధ్వర్యంలో యాక్టివ్ చేస్తాం. ఇప్పటికే ఓ కమిటీ ఏర్పాటు అయింది.
► ప్రభాకర్‌రెడ్డి, కాంతారావు, పైడి జయరాజ్ వంటి తెలంగాణ నటులను ‘మా’ ద్వారా మళ్లీ మళ్లీ గుర్తు చేయాలని కర్తవ్యంగా పెట్టుకున్నాం. లేకపోతే వారిని మరచిపోయే పరిస్థితి కనిపిస్తోంది.
► ‘మా’లో లక్ష రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకోలేని వారు చాలా మంది ఉన్నారు. అలాంటివారిని కూడా సభ్యులుగా చేర్చే ప్రయత్నం చేస్తాం.
► ప్రస్తుతం ప్యానళ్లలో ఉంటున్న వాళ్లలో 95శాతం మంది ఇప్పటికే ‘మా’ కార్యవర్గాల్లో పనిచేశారు. పదేళ్ల క్రితం తీసుకొచ్చిన రిజల్యూషన్స్‌ని ఎందుకు అమలు చేయడం లేదో వారే సమాధానం చెప్పాలి. చెప్పలేని వాళ్లు ఎన్నికల్లో మళ్లీ పోటీ పడటానికి, పోటీ చేసి గెలవడానికి, గెలిచి మళ్లీ మనల్ని మోసం చేయడానికి అర్హులు కారని నా ఉద్దేశం.
Comments
Please login to add a commentAdd a comment