మూవీ ఆర్టిస్ట్ అసోసియేసన్(మా) ఎన్నికలకు ఇంకా కొన్ని గంటలే మిగిలున్నాయి. అయిన ఇప్పటి వరకు ప్రకాశ్ రాజ్ ప్యానల్ తమ మేనిఫేస్టోని ప్రకటించకపోవడం గమనార్హం. గతంలో తమ మేనిఫెస్టో చూస్తే మోహన్ బాబు నేరుగా వచ్చి ఓటు వేస్తారని చెప్పిన ఆయన ఇంతవరకు తమ మేనిఫెస్టోను విడుదల చేయకపోవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఎన్నికలు రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రుకాశ్ రాజ్ ప్యానల్ నుంచి జనరల్ సెక్రెటరీ పదవి పోటీ చేస్తున్న జీవిత రాజశేఖర్ తాజాగా సాక్షితో టీవీతో మాట్లాడారు. ఈ సందర్భంగా తమ మ్యానిఫెస్టో విడుదల చేయకపోవడంపై ఆమె వివరణ ఇచ్చారు.
చదవండి: ‘మా’ సభ్యులకు మోహన్ బాబు వాయిస్ మెసెజ్, ఏం అన్నారంటే
ఈ మేరకు జీవిత.. మేనిఫేస్టో విడుదల చేయడంపై ప్రకాశ్ రాజ్ గారితో తాను మాట్లాడానని చెప్పారు. దీనికి ఆయన ఇప్పటికే మనం టీవీ ఇంటర్వ్యూ, యూట్యూబ్ చానల్లో, ‘మా’ సభ్యులతో తరచూ కలిసి మన మ్యానిఫెస్టో గురించి మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఎజెండా ఎంటన్నది క్రిస్టల్ క్లియర్‌గా వివరించామని, ఇక దీనినే మనం పేపర్లో పెట్టి ఇదే మా మేనిఫెస్టో అని చెప్పడం అంతా సెన్సిబుల్ అనిపించడం లేదని అన్నట్లు ఆమె తెలిపారు. ఇక విష్ణు రూ. 10 వేలు ఇచ్చి ఓటు వేయించుకుంటున్నాడని మెగా బ్రదర్ నాగబాబు చేసిన కామెంట్స్, ఓట్లు కొనుగోలు అంశంపై జీవిత స్పందిస్తూ.. ఈ విషయం తనకు తెలియదన్నారు.
చదవండి: MAA Elections 2021: మంచు విష్ణు ప్యానల్ మేనిఫెస్టో ఇదే
నాగబాబు గారు మాట్లాడరనేది నిజమే కానీ ఆయనకు ఏం ఫీలర్ వచ్చిందో తనకు తెలియదన్నారు. ఇలాంటి వార్తలు ఎన్నో పుట్టుకోస్తున్నాయి, పోస్టల్ బ్యాలెట్‌పై కూడా పలు రూమర్స్ వచ్చాయన్నారు. దీనిపైనే ఆయన మాట్లాడి ఉంటారని, ఏం జరుగుతుందన్నది సభ్యులు తెలుసుకుంటారని, అలాంటిది ఏమైన జరుగుతుంటేర్స్ సరైనదో కాదో మెంబర్స్ తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని జీవిత అన్నారు. అయితే ఒక ఎవిడెన్స్, ఫ్రూఫ్ లేకుండా మాత్రం సభ్యులు డబ్బులు తీసుకుంటున్నారనేది చెప్పలేమని ఆమె పేర్కొన్నారు. అనంతరం ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె కోరారు.
Comments
Please login to add a commentAdd a comment