ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. అధికార కూటమి ఉమ్మడి ప్రచారాన్ని ప్రారంభించడానికి కొల్హాపూర్‌లో నిర్వహించిన మహాయుతి ర్యాలీ సందర్భంగా ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మంగళవారం ప్రకటించిన పది హామీల్లో ఈ హామీలు ఉన్నాయి.
వరి రైతులకు హెక్టారుకు రూ. 25,000 బోనస్, వ్యవసాయ రుణాల మాఫీ, లడ్కీ బహిన్ యోజన కింద అర్హులైన మహిళా లబ్ధిదారులకు నెలవారీ ఆర్థిక ప్రయోజనాన్ని రూ.1,500 నుండి రూ.2,100కి పెంపు. 2.5 మిలియన్ల ఉద్యోగాల కల్పన, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం వంటి హామీలు ఇచ్చారు.
राष्ट्रवादी काँग्रेस पार्टी घोषणापत्र प्रकाशनाचे थेट प्रक्षेपण https://t.co/aOTUc1UcyS
— Ajit Pawar (@AjitPawarSpeaks) November 6, 2024
బారామతి డిప్యూటీ సీఎం అజిత్ పవార్.. ఎన్సీపీ మేనిఫెస్టోలో విడుదల సందర్భంగా మాట్లాడారు. ‘లడ్కీ బహిన్ యోజన అనేది మహారాష్ట్ర చరిత్రలో అతిపెద్ద నెలవారీ డీబీటీ బదిలీ పథకం. 2.3 కోట్ల మంది మహిళలకు (ప్రస్తుతం ఏడాదికి రూ. 18,000) సంవత్సరానికి రూ. 25,000 ప్రయోజనాలను అందజేస్తుంది’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment