మాట్లాడుతున్న రొక్కం సూర్యప్రకాశరావు
సాక్షి, శ్రీకాకుళం సిటీ : ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం లేదా రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు మాట నిలబెట్టుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రదినిధి రొక్కం సూర్యప్రకాశరావు కోరారు. ఆయన సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత నిరుద్యోగులు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు నిరుద్యోగులకు అందరికీ భృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు నిబంధనలు పెడుతున్నారని, ఇది మో సం కాదా అని ప్రశ్నించారు. తప్పులు తడకలుగా ఉన్న ప్రజాసాధికార సర్వే ప్రకారం ఎలా చేస్తారని అడిగారు.
నిరుద్యోగులకు బకాయి పడిన భృతి అంతా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ప్రకటించిన రూ.2 వేలు నిరుద్యోగభృతి వచ్చే కేబినేట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోకుండా తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు ముంజేటి కృష్ణమూర్తి, యజ్జల గురుమూర్తి, బి రాజేష్, పేడాడ అశోక్, ఆర్‌ఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment