Rs 2000
-
సమీపిస్తున్న గడువు.. రూ. 2వేల నోట్లపై ఆర్బీఐ ప్రకటన
చలామణి నుంచి ఉపసంహరించిన రూ. 2000 కరెన్సీ నోట్లలో 93 శాతం బ్యాంకులకు తిరిగి చేరినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) శుక్రవారం వెల్లడించింది. కేవలం రూ.0.24 లక్షల కోట్ల విలువైన రూ. 2000 నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ఆర్బీఐ గత మే నెల 19వ తేదీన క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ.2000 నోటును చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. తక్షణమే ఈ నోట్ల జారీని నిలిపివేయాలని బ్యాంకులను కోరింది. తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను వెనక్కి ఇచ్చేసి మార్చుకోవాలని ప్రజలకు సూచించింది. ఇందుకు సెస్టెంబర్ 30వ తేదీ వరకు గడువు విధించింది. ఇదీ చదవండి: Mera Bill Mera Adhikar: ‘జీఎస్టీ లక్కీ డ్రా’ షురూ.. రెడీగా రూ. 30 కోట్లు! అదృష్టం ఎవరిని వరిస్తుందో.. బ్యాంకుల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఆగస్టు 31 నాటికి చలామణి నుంచి వెనక్కి వచ్చిన రూ. 2000 నోట్ల మొత్తం విలువ రూ. 3.32 లక్షల కోట్లు అని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం నోట్లలో 93 శాతం నోట్లు వెనక్కి రాగా ఇక ప్రజల వద్ద ఉన్న రూ. 2000 నోట్ల విలువ కేవలం రూ. 0.24 లక్షల కోట్లు. -
రూ.500 నోటు రద్దు, మళ్లీ చలామణిలోకి రూ.1000.. కేంద్ర ప్రభుత్వం రిప్లై ఇదే!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది మే మధ్యలో ₹2,000 కరెన్సీ నోట్లను చెలామణి నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఉపసంహరణ తర్వాత రూ.500 నోటు కూడా త్వరలోనే రద్దు చేస్తారని పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఎప్పుడు ఆర్బీఐ సమావేశం జరిగిన ఈ తరహా నోట్టు రద్దుకు సంబంధించిన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా వీటిపై స్పష్టతనిచ్చింది. రూ.500 నోట్ల రద్దు.. కేంద్రం రిప్లై ఇదే ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సెషన్లో, రూ.500 నోట్ల రద్దు, ఆర్థిక వ్యవస్థలో రూ.1,000 నోట్లను మళ్లీ ప్రవేశపెట్టడంపై పలువురు లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థికశాఖ బదులిచ్చింది. వీటికి ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి.. ఆర్థిక వ్యవస్థలో అత్యధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లను (అంటే ₹500 నోట్లు) రద్దుని కొట్టి పారేశారు. ఈ మేరకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. అంతేకాకుండా,‘ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఆర్థిక లావాదేవీల్లో అంతరాయాన్ని నివారించడానికే కరెన్సీ విధానాన్ని తీసుకొచ్చారు. కాలానుగుణంగా వాటిలో మార్పులు చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుత సంవత్సరం అవసరానికి అనుగుణంగా ₹2000 నోట్ల ఉపసంహరణ తర్వాత ప్రజల అవసరాలను తీర్చడానికి దేశవ్యాప్తంగా ఇతర డినామినేషన్ల నోట్లు (రూ.500) సరిపడా ఉందని తెలిపారు. ఈ సమాచారంతో, ఆర్థిక వ్యవస్థలో ₹1,000 నోట్లను మళ్లీ ప్రవేశపెట్టే ఆలోచన లేదని కేంద్రం స్పష్టం చేసింది. మరోవైపు ఉపసంహరించుకున్న రూ.2000 నోట్లను సెప్టెంబరు 30లోగా మార్చుకోవాలని, ఆ తేదీని పొడిగించబోమని ఆర్థికశాఖ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. చదవండి ఫోన్‌పే యూజర్లకు గుడ్‌న్యూస్.. సరికొత్త ఫీచర్, అదనపు బెనిఫిట్స్ కూడా -
రూ.2000 నోట్లు మార్పిడి.. 90 లక్షలు నష్టం.. ఎలాగంటే!
పార్వతీపురం: ‘రెండు వేల రూపాయల నోట్లు రూ.కోటి ఇస్తాం. మీరు రూ.500 నోట్లు రూ.90లక్షలు ఇవ్వండి చాలు..’ అని నమ్మబలికిన ఇద్దరు వ్యక్తులు మోసం చేశారు. రూ.పది లక్షలు లాభం ఆశ చూపించి రూ.90లక్షలతో ఉడాయించారు. ఈ ఘటన పార్వతీపురంలో సోమవారం జరిగింది. పార్వతీపురం రూరల్ ఎస్ఐ వై.సింహాచలం తెలిపిన వివరాల ప్రకారం... పార్వతీపురానికి చెందిన ఆబోతుల అనిల్‌కుమార్, ఎల్.అనిల్‌కుమార్ ఓ ప్రైవేట్ బ్యాంకులో రుణాలు ఇప్పిస్తుంటారు. వారి వద్దకు స్థానిక వడ్డీ వ్యాపారుల ద్వారా వారం రోజుల కిందట ఎన్.చక్రపాణి(కాకినాడ), ఎస్కే నజీమ్(భీమవరం) వచ్చి కలిశారు. తమకు తెలిసినవారి వద్ద రూ.2వేల నోట్లు ఉన్నాయని, రూ.500 నోట్లు రూ.90 లక్షలు ఇస్తే... రూ.2వేల నోట్లు రూ.కోటి ఇస్తారని చెప్పారు. ఆ తర్వాత ఇద్దరిని పార్వతీపురం పిలిపించి ఆబోతుల అనిల్‌కుమార్, ఎల్.అనిల్‌కుమార్‌లతో మాట్లాడించారు. ఒకే రోజు రూ.10 లక్షలు వస్తుందని ఆశతో ఆబోతుల అనిల్‌కుమార్, ఎల్.అనిల్‌కుమార్ వారితో ఒప్పందానికి అంగీకరించారు. తమ వద్ద ఉన్న నగదుతోపాటు స్నేహితులు, బంధువుల వద్ద కొంత తీసుకువచ్చి రూ.90 లక్షలను సోమవారం ఆ వ్యక్తులకు ఇచ్చారు. కొద్దిసేపు ఇక్కడే ఉంటే రూ.కోటి తెస్తామని చెప్పి వెళ్లిన ఇద్దరు తిరిగి రాలేదు. దీంతో తాము మోసపోయినట్టు గుర్తించిన ఆబోతుల అనిల్‌కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మధ్యవర్తులుగా వ్యవహరించిన చక్రపాణి, నజీమ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పట్టుకుంటామని ఎస్ఐ తెలిపారు. చదవండి: ఏపీలో బంగారం తవ్వకాలు! ఎన్ఎండీసీ రూ. 500 కోట్ల వ్యయం.. -
రూ.2 వేల నోట్ల మార్పిడి పేరిట టోకరా
సాక్షి,దొండపర్తి (విశాఖ దక్షిణ): విశాఖ నగరంలో రూ.2 వేల నోట్ల మార్పిడి పేరిట రూ.60 లక్షలతో ఉడాయించిన గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు రహస్యంగా దర్యాప్తు చేస్తున్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. విశాఖకు చెందిన ధర్మరాజు అనే వ్యక్తి రూ.90 లక్షల విలువైన రూ.500 నోట్లు ఇస్తే.. రూ.కోటి విలువైన రూ.2 వేల నోట్లు ఇస్తామంటూ తనకు తెలిసిన వారిని నమ్మించాడు. విషయం తెలుసుకున్న భీమిలికి చెందిన ఎం.రామారావు అనే వ్యక్తి తన స్నేహితుల ద్వారా విజయవాడ నుంచి రూ.90 లక్షల విలువైన రూ.500 నోట్లు తెప్పించారు. వాటిని భీమిలికి చెందిన కొయ్య అప్పలరెడ్డి సహాయంతో శనివారం సాయంత్రం గొల్లలపాలెం ఎస్బీఐ బ్యాంక్ వద్దకు వెళ్లి.. అప్పటికే అక్కడకు చేరుకున్న ధర్మరాజు, అతని స్నేహితులు కాకినాడకు చెందిన ఎండీ అహ్మద్, సునీల్ అలియాస్ చిన్నాను కలిశారు. నగదు మారుస్తామని చెప్పిన ధర్మరాజు, అతని స్నేహితులు అహ్మద్, సునీల్ కలిసి రామారావు నుంచి రూ.60 లక్షలు తీసుకుని మోటార్ సైకిల్‌పై ఉడాయించారు. వారి కోసం వెతికినా కనిపించకపోవడం, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో మోసపోయానని గ్రహించి రామారావు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు గంట వ్యవధిలోనే ధర్మరాజుతో పాటు అతని గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకుని రూ.60 లక్షలు రికవరీ చేశారు. ఈ గ్యాంగ్ వెనుక ఉన్న సూత్రధారులెవరు, ఎంతమందిని మోసం చేశారనే విషయాలపై పోలీసులు రహస్యంగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఇదే తరహాలో రాజమండ్రిలో కూడా ఒక కేసు నమోదైనట్టు తెలుస్తోంది. చదవండి: Tanguturi Prakasam Pantulu: పుష్పగుచ్చం ఇచ్చి సన్మానం.. పూలకు బదులు పండ్లు తెస్తే తినేవాడినంటూ -
రూ 2000 నోటు మార్చుకుంటున్నారా?, సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తున్న బ్యాంక్‌లు!
ప్రజలు నేటి నుంచి రూ.2000 నోట్లను మార్చుకునేందుకు బ్యాంకుల ఎదుట బారులు తీరారు. అయితే నోట్లను మార్చుకుంటే బ్యాంక్‌లు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయవని ఆర్బీఐ ప్రకటించింది. బ్యాంక్ ఖాతాలో జరిగే డిపాజిట్లపై సాధారణ నిబందనలే వర్తిస్తాయని తెలిపింది. దీంతో బ్యాంక్‌లు రూ.2000 నోట్ల డిపాజిట్లపై సర్వీస్ ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఎక్కువ శాతం బ్యాంక్‌లు ప్రతి రోజు జరిగే డిపాజిట్లు, విత్ డ్రాయిల్స్‌పై లిమిట్ దాటితే అదనపు ఛార్జీలు విధిస్తాయి. ఇప్పుడా ఛార్జీలు రూ.2000 డిపాజిట్లపై వర్తించనున్నాయి. ఆ ఛార్జీలు వివిధ బ్యాంక్‌ల్లో ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్బీఐ బ్యాంక్ సర్వీస్ ఛార్జీలు దేశీయ ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తన అధికారిక వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. ఎస్బీఐ సేవింగ్ అకౌంట్, సురభి సేవింగ్స్ అకౌంట్లలో నెలలో మూడుసార్లు డిపాజిట్లను ఉచితంగా చేసుకోవచ్చు. ఆపై జరిపే ప్రతి డిపాజిట్‌పై రూ.50 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంక్ హోం బ్రాంచ్‌లో కాకుండా మిగిలిన బ్రాంచ్‌లలో ప్రతి రోజు రూ.2లక్షలు డిపాజిట్ చేయొచ్చు. అత్యవసర పరిస్థితుల్లో బ్రాంచ్ మేనేజర్ అనుమతితో రూ.2 లక్షలు అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అదనపు ఛార్జీలు పడతాయి. డిపాజిట్ మెషిన్లో క్యాష్ డిపాజిట్ ఉచితంగా చేయొచ్చు. కానీ, డెబిట్ కార్డ్‌ను ఉపయోగించి థర్డ్ పార్టీ అకౌంట్ల ద్వారా క్యాష్ డిపాజిట్ చేస్తే మాత్రం ప్రతి ట్రాన్సాక్షన్‌కు రూ.22 ప్లస్ జీఎస్టీని వసూలు చేస్తారు బ్యాంక్ అధికారులు. No forms, ID cards needed for exchange of Rs 2000 banknotes: SBI Read @ANI Story | https://t.co/GE6YvmB0ls#Rs2000 #SBI #RBI #LegalTender #Currency pic.twitter.com/IyJ0u2uyR2 — ANI Digital (@ani_digital) May 21, 2023 హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సర్వీస్ ఛార్జీలు హెచ్డీఎఫ్సీ ప్రతి నెల నాలుగు ట్రాన్సాక్షన్ల వరకు ఉచితంగా చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తుంది. వాటిల్లో మీ బ్యాంక్ అకౌంట్ నుంచి లేదంటే థర్డ్ పార్టీ ద్వారా విత్ డ్రాయిల్ చేసుకుంటే ఎలాంటి ఛార్జీల్ని వసూలు చేయదు. అయితే, నిర్ధేశించిన లిమిట్ దాటితే ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ.150 వరకు చెల్లించాల్సి ఉంటుంది. నెలలో చేసే డిపాజిట్ రూ. 2 లక్షలకు మించితే, ప్రతీ వెయ్యి రూపాయలకు రూ.5 నుంచి గరిష్టంగా రూ.150 ప్లస్ జీఎస్టీ చెల్లించాలి. ఇక, థర్డ్ పార్టీ క్యాష్ ట్రాన్సాక్షన్ లిమిట్ రోజుకు రూ.25,000 వరకు చేసుకోవచ్చు. కార్డ్ బేస్డ్ డిపాజిట్లను రూ.1లక్ష వరకు చేసుకోవచ్చు. సేవింగ్ అకౌంట్లో డిపాజిట్లు రోజుకు రూ.2 లక్షల వరకు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి బ్యాంక్‌లు. CSC HDFC Bank Advisory on 2000 Denomination Bank Note! HDFC Bank BCA now exchange the 2000 currency.. Please read the advisory for better understanding..#cscfinancialservices #csc #digitalindia #hdfcbank pic.twitter.com/lvb1wS7gRp — CSC Parivar (@CscParivar) May 22, 2023 ఐసీఐసీఐ బ్యాంక్ సర్వీస్ ఛార్జీలు ఐసీఐసీఐ బ్యాంక్ నెలలో నాలుగు క్యాష్ ట్రాన్సాక్షన్లను ఫ్రీగా చేసుకోవచ్చు. వాటిలో డిపాజిట్లు, విత్ డ్రాయిల్స్ ఉన్నాయి. లిమిట్ దాటితే ఒక్కో ట్రాన్సాక్షన్‌పై రూ.150 చెల్లించాలి. నెలలో రూ.1లక్షల వరకు సేవింగ్ అకౌంట్లో ఉచితంగా డిపాజిట్ చేసుకునే వీలుంది. లిమిట్ దాటితే రూ.1000కి రూ.5 నుంచి గరిష్టంగా రూ.150 వరకు ఛార్జీలు వసూలు చేయనునున్నట్టు వెబ్సైట్లో పేర్కొంది. 2/3 Banks may exchange 2000 Rupees Banknotes upto a limit of 20,000 Rupees at a time Reason stated is 2000 Rupee notes not commonly used for transactions; Other Currency denominations adequate to meet Currency needs of public. — ICICIdirect (@ICICI_Direct) May 19, 2023 ఇక, హోం బ్రాంచ్ కాకుండా వేరే బ్రాంచ్ బ్యాంక్ రూ.1000 రూ.5, రూ.25,000 దాటితే రోజుకు రూ.150 అదనపు ఛార్జీలు చెల్లించాలి. థర్డ్ పార్టీ ట్రాన్సాక్షన్లు రూ.25,000కే పరిమితం చేసింది. ఇంకా, ప్రతి థర్డ్-పార్టీ లావాదేవీకి బ్యాంక్ రూ.150 సర్వీస్ ఛార్జీని వసూలు చేస్తుంది. పైన పేర్కొన్న ఈ ఛార్జీలు హోమ్ బ్రాంచ్‌కు (ఖాతా తెరిచిన లేదా పోర్ట్ చేయబడిన బ్రాంచ్), బ్రాంచ్‌లలో డిపాజిట్లు, విత్ డ్రాయిల్, రీసైక్లర్ మెషీన్లలోని డిపాజిట్లకు వర్తిస్తాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ సర్వీస్ ఛార్జీలు కోటక్ మహీంద్రా బ్యాంక్ విత్ డ్రాయిల్, డిపాజిట్లు లేదా రూ. 3 లక్షలతో సహా ఐదు ఉచిత లావాదేవీలను అనుమతిస్తుంది. మీరు ఈ పరిమితిని దాటిన తర్వాత, బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం, మీరు రూ. 1000కి రూ. 4.5 లేదా కనిష్టంగా రూ. 150 సర్వీస్ ఛార్జీని చెల్లించాలి. ఈ ఛార్జీలు బ్రాంచ్ లేదా క్యాష్ డిపాజిట్ మెషీన్లో నగదు లావాదేవీలకు వర్తిస్తాయి. అదేవిధంగా, ఇతర బ్యాంకులు కూడా మీ ఖాతాలో డబ్బును డిపాజిట్ చేయడానికి నిర్దిష్ట ఛార్జీలను విధించవచ్చు. చదవండి👉రూ.2000 నోట్లను వదిలించుకోవడానికి వీళ్లంతా ఏం చేశారో చూడండి! -
వరంగల్‌లో నకిలీ నోట్ల కలకలం.. గుట్టలుగా రూ.2 వేల కట్టలు
సాక్షి, వరంగల్: వరంగల్‌లో దొంగ నోట్లు ముద్రిస్తున్నముఠా గుట్టు రట్టయ్యింది. ఈ మేరకు జిల్లా పోలీసులు పెద్ద ఎత్తున నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీస్ కమీషనర్ సీపీ తరుణ్ జోషీ మీడియాకు వెల్లడించారు. అరెస్టయిన నిందితుల నుంచి రూ. 2 వేల నకిలీ కరెన్సీ నోట్లను సుమారు రూ. 6లక్షల వరకు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అలాగే ఏడు సెల్ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలతో పాటు నకిలీ నోట్ల తయారు చేసే సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు నిందితులు సయ్యద్ యూకుబ్, అలియాస్ షకీల్, గడ్డం ప్రవీన, గుండా రజనీగా ప్రకటించారు. వీరంతా ఒక కిడ్నాప్ కేసులో రామగుండం సబ్‌జైలులో శిక్ష అనుభవించినట్లు చెప్పారు. అక్కడే దొంగ నోట్లు ముద్రించే సభ్యులతో పరిచయం పెంచుకుని ఈ నకిలీ నోట్ల తయారీ ప్రారంభించినట్లు చెప్పారు. ఈ నకిలీ నోట్లను యూట్యూబ్ సాయంతో తయారు చేసినట్లు తెలిపారు. రద్దీగా ఉండే వ్యాపార కూడళ్ల తోపాటు కిరాణా, బట్టలషాపు, బెల్టు షాపుల్లో ఈ నకిలీ నోట్లను చెలామణి చేసేవారని తెలిపారు. (చదవండి: కలలు.. కల్లలయ్యాయి.. జీవితమెంత విచిత్రమైంది) -
నిరుద్యోగభృతి రూ.2వేలు ఇవ్వాలి’
సాక్షి, శ్రీకాకుళం సిటీ : ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం లేదా రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు మాట నిలబెట్టుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రదినిధి రొక్కం సూర్యప్రకాశరావు కోరారు. ఆయన సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత నిరుద్యోగులు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు నిరుద్యోగులకు అందరికీ భృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు నిబంధనలు పెడుతున్నారని, ఇది మో సం కాదా అని ప్రశ్నించారు. తప్పులు తడకలుగా ఉన్న ప్రజాసాధికార సర్వే ప్రకారం ఎలా చేస్తారని అడిగారు. నిరుద్యోగులకు బకాయి పడిన భృతి అంతా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ప్రకటించిన రూ.2 వేలు నిరుద్యోగభృతి వచ్చే కేబినేట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోకుండా తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు ముంజేటి కృష్ణమూర్తి, యజ్జల గురుమూర్తి, బి రాజేష్, పేడాడ అశోక్, ఆర్ఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
గుజరాత్లో నకిలీ నోట్ల భాగోతం
సాక్షి, అహ్మదాబాద్: దేశంలో జ(పె)రుగుతున్న అవినీతి, నల్లధనాన్ని నిరోధించడానికి ప్రధాని నరేంద్రమోడీ పెద్ద నోట్ల రద్దును(రూ.500, 1000) చేస్తున్నట్లు 2016 నవంబర్ 8న ప్రకటించారు. అదే విధంగా భారత ఆర్థిక వ్యవస్థ పాలిట శాపంలా తయారైన నకిలీనోట్ల దందాకు చెక్ పెట్టొవచ్చు అని భావించారు. అయితే ఇది ఏమాత్రం ప్రభావం చూపడంలేదు. ప్రధాని స్వరాష్ట్రంలోనే నకిలీ నోట్లను భారీ మొత్తంలో పట్టుకున్నట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. కేంద్ర హోం శాఖ తాజా నివేదికల ప్రకారం గుజరాత్లో ఇప్పటి వరకూ చలామణిలో ఉన్న నకిలీ రూ.2000 నోట్లలో సుమారు 40శాతం నోట్లను సీజ్ చేసినట్లు ప్రకటించింది. 2016 నవంబర్ 9 నుంచి 2017 మార్చి 7 వరకు ఒక్క గుజారాత్‌లోనే సుమారు రూ.26 లక్షల 42 వేలు విలువైన రూ. 2000 నోట్లను పట్టకున్నట్లు ప్రకటించింది. దేశం మొత్తం మీద సుమారు రూ.67లక్షల విలువ చేసే నకిలీ నోట్లను పట్టుకున్నారు. గుజరాత్ నుంచి దేశ వ్యాప్తంగా నకిలీ నోట్ల సరఫరా చేస్తున్న 12మందిని అరెస్టు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దేశ వ్యాప్తంగా 64 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు హోంశాఖ ప్రకటించింది. దేశంలో చలామణి అవుతున్న నకిలీ నోట్లు బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాళ్ నుంచి వస్తున్నట్లు గుజరాత్‌కు చెందిన పోలీసు అధికారి తెలిపారు. దేశ వ్యాప్తంగా ప్రముఖ నగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్, కోల్‌కతా నగరాల్లోనకిలీ నోట్లు చలామణి అధికంగా ఉందన్నారు. -
రూ. 2000 నోటును కలర్ జిరాక్స్ తీసి...
ముంబై: ఒక పక్క జనం కొత్త నోట్ల కోసం నానా తిప్పలు పడుతుంటే మరోపక్క కలర్ జిరాక్స్ చేసిన నోట్లు ఖర్చు చేసేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడిన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. జిరాక్స్ తీసిన రూ.2,000 నోటును మద్యం షాపులో ఇచ్చేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై నగర శివారు ప్రాంతమైన విరార్‌లో సోమవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. విరార్ ప్రాంతానికి చెందిన తుషార్ చికలే (26) అంధేరిలోని ఓ నోటరీ వకీలు కార్యాలయంలో పని చేస్తున్నాడు. సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే ముందు కార్యాలయంలో ఉన్న జిరాక్స్ మెషన్‌లో కొత్తగా వచ్చిన రూ.2,000 నోటును ఇరువైపులా కలర్ జిరాక్స్ తీశాడు. అనుమానం రాకుండా రెండు ముక్కలను ఒక్కటిగా అతికించాడు. విరార్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న రాజా వైన్స్ వద్ద విపరీతంగా రద్దీ ఉంది. ఇదే అదనుగా కలర్ జిరాక్స్ చేసిన రెండు వేల నోటును వైన్ షాపు సిబ్బందికి అందజేసి ఓ బీరు కావాలని అడిగాడు. కాని, ఆ నోటు చేతితో పట్టుకున్న సిబ్బంది అది నకిలీదని వెంటనే గ్రహించడంతో విషయం బయటపడింది. దీంతో అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తుషార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అన్నీ నాణేలే ఇచ్చారు.. అవి తీసుకునే దిక్కెవరు?
పెద్ద నోట్ల రద్దు వ్యవహారం ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళలకు కొత్త కష్టాలనే తీసుకొచ్చి పెట్టింది. అసలకే భర్తను కోల్పోయి, ఉన్న ఒక్కానొక్క కొడుకు క్యాన్సర్‌తో భాదపడుతూ ఉంటే... నోట్ల మార్పిడి అంశం సర్జు దేవీకి మరింత కృంగదీసింది. రూ.2000 పాత కరెన్సీని మార్చుకోవడానికి లక్నో నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోహన్‌లాల్ గంజ్ ప్రాంతంలోని బ్యాంకుకు వెళ్లిన ఆమెకు, బ్యాంకు వారు మొత్తం ఒక్క రూపాయి నాణేలతో కూడిన బ్యాగును అందించారు. 17కేజీల బరువున్న నాణేల బ్యాగును చూసుకుని ఆవేదన చెందిన ఆమె, ఇంటివరకు మోసే శక్తి లేకపోవడంతో,వాటికి బదులుగా వేరేవి ఇవ్వాలని అభ్యర్థించింది. ఆమె అభ్యర్థనను పట్టించుకోని బ్యాంకులోని ఓ మహిళా సిబ్బంది రూడ్‌గా సమాధానమిచ్చింది. ఇచ్చిన డబ్బును తీసుకెళ్లాలంటూ మూర్ఖంగా సమాధానం చెప్పినట్టు సర్జు పేర్కొంది. అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమారుడి రాం కుమార్ యాదవ్ రిపోర్టులు చూపినప్పటికీ ఎలాంటి దయాగుణం చూపించలేదని తెలిపింది. తన కుమారుడికి క్యాన్సర్ ఉన్నట్టు గతేడాది నిర్థారణ అయిందని, అప్పడు వైద్యచికిత్స కోసం రూ.1 లక్ష నగదును వైద్య చికిత్స కోసం ప్రభుత్వం జారీచేసినట్టు సర్జు చెప్పింది. పెద్ద నోట్లను రద్దుచేస్తూ నవంబర్ 8న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో, వైద్యం చేపిండానికీ, కనీసం చెక్‌అప్‌లకు ఎలాంటి నగదు దొరకడం లేదని ఆవేదన వ్యక్తంచేసింది. ప్రస్తుతం తన కొడుకుకు రేడియో థెరపీ జరుగుతుందని, మూడు రోజుల నుంచి ఏ ఆసుపత్రివారు ఆ రూపాయి నాణేలను అంగీకరించడం లేదని, వారికి ఆ నాణేలను లెక్కించే ఓపిక లేదని తెలిపింది. కేవలం సర్జు మాత్రమే కాక, మోహన్‌లాల్‌గంజ్‌లో చాలామంది ఇలాంటి బాధలే పడుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా వివాహా వేడుకలు నిర్వర్తించేవారు పడరాని పాట్లు పడుతున్నారు. ఎవరూ చెక్స్‌ను అంగీకరించడం లేదని, నగదురహిత లావాదేవీలను ప్రజలు నమ్మడం లేదని ఓ వ్యక్తిచెప్పాడు.