చేతకాకపోతే రాజీనామా చెయ్‌ | Telangana: YS Sharmila Comments On CM KCR About Job Notification | Sakshi
Sakshi News home page

చేతకాకపోతే రాజీనామా చెయ్‌

Published Wed, Oct 13 2021 4:59 AM | Last Updated on Wed, Oct 13 2021 4:59 AM

Telangana: YS Sharmila Comments On CM KCR About Job Notification - Sakshi

నల్లగొండ టూటౌన్‌/నల్లగొండ: ‘రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వాలి. 3.81 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 54 లక్షల మంది ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్నరు.. కార్పొరేషన్‌ ద్వారా రుణాల కోసం 8 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నరు.. ఇంటికో ఉద్యోగం ఇచ్చేవరకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఈ హామీలు నెరవేర్చడం చేతకాకపోతే ముఖ్యమంతి పదవికి కేసీఆర్‌ రాజీనామా చేసి దళితుడిని సీఎంగా చేయాలి’ అని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు.

నల్లగొండ జిల్లా కేంద్రంలో మంగళవారం ఆమె నిరుద్యోగ నిరాహారదీక్ష చేశా రు. షర్మిల మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా సీఎం కేసీఆర్‌ తన ఇంట్లో వందశాతం ఉద్యోగాలు ఇచ్చుకున్నా రని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన కేసీఆర్‌ 30 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించి రోడ్డున పడేశారని అన్నారు. దళితులకు మూడెకరాల చొప్పున ఇస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న సీఎం కేసీఆర్‌.. తాను హామీ ఇవ్వలేదని ఇటీవల శాసనసభలో అనడం దుర్మార్గమని, తరచూ యశోదా ఆసుపత్రికి వెళ్లే మీరు మతిమరుపు చికిత్స కూడా చేయించుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల భూములపై టీఆర్‌ఎస్‌ నేతల కన్ను పడిందని వైఎస్‌ షర్మిల అన్నారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ వద్ద మీడియాతో మాట్లాడుతూ వర్సిటీ భూములపై కన్నెసి టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్టుల ఖాళీలను భర్తీ చేయకుండా వాటిని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement