ఎస్వీయూ పరిధిలోని 10 కళాశాలలు 2017–18 విద్యా సంవత్సరానికి అఫిలియేషన్ కోసం ధరఖాస్తు చేయలేదు.
యూనివర్సిటీక్యాంపస్(చిత్తూరు): ఎస్వీయూ పరిధిలోని 10 కళాశాలలు 2017–18 విద్యా సంవత్సరానికి అఫిలియేషన్ కోసం ధరఖాస్తు చేయలేదని అటువంటి కళాశాలల్లో చేరవద్దని ఎస్వీయూ అకడమిక్ ఆడిట్ డీన్ ప్రొఫెసర్ బి.సుధీర్ తెలిపారు. అఫిలియేషన్‌కు ధరఖాస్తు చేయని ఆ కళాశాలలకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. అటువంటి కళాశాలల్లో చేరి నష్టపోవద్దని చెప్పారు.
అఫిలియేషన్‌కు ధరఖాస్తు చేయని కళాశాలల జాబితా ఇలా ఉంది... రాయలసీమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, శ్రీ ఆది శంకర కాలేజ్ ఆప్ ఎడ్యుకేషన్, తిరుపతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యోదయ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ఉమెన్, శ్రీ పద్మావతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్(తిరుపతి), సహాయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ (కొట్రమంగళం), శేషాచల డిగ్రీ కళాశాల (వడమాలపేట), స్కిమ్స్ డిగ్రీ కళాశాల (తొట్టంబేడు), ఎస్వీ డిగ్రీ కళాశాల( చెర్లోపల్లి), ఉషోదయ డిగ్రీ కళాశాల( బంగారుపాలెం).