తిరుపతి: రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో ప్రవేశానికి ఈ నెల 8 నుంచి ప్రారంభం కావాల్సిన ఏపీ ఎడ్సెట్-2016 కౌన్సెలింగ్ ప్రక్రియను వాయిదా వేసినట్లు ఎడ్‌సెట్ కన్వీనర్ టి.కుమారస్వామి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. కొత్తగా వచ్చిన బీఈడీ కళాశాలల వివరాలు, అడ్మిన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (ఏఎఫ్‌ఆర్సీ) నుంచి వివిధ కళాశాలలకు సంబంధించిన ఫీజు వివరాలు రావాల్సి ఉన్నందు వల్ల ఎడ్‌సెట్ కౌన్సెలింగ్‌ను ఈ నెల 16కు వాయిదా వేశామన్నారు. వివిధ హెల్ప్‌లైన్ సెంటర్లు, కళాశాలలు, అభ్యర్థులు కౌన్సెలింగ్ వాయిదా పడిన విషయాన్ని గుర్తించాలని సూచించారు. పూర్తి వివరాలను www.apedcet.apsche.ac.in వెబ్‌సైట్‌లో చూడాలని పేర్కొన్నారు.
ఏపీ ఎడ్సెట్-2016 కౌన్సెలింగ్ వాయిదా
Published Sat, Aug 6 2016 5:59 PM | Last Updated on Sat, Aug 18 2018 7:58 PM
Advertisement
Advertisement