ఏపీ ఈసెట్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ | Notification for AP Ecet entrance | Sakshi
Sakshi News home page

ఏపీ ఈసెట్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌

Published Thu, Jun 15 2017 1:22 AM | Last Updated on Sat, Aug 18 2018 7:58 PM

Notification for AP Ecet entrance

- జూన్‌ 29 నుంచి ధ్రువపత్రాల పరిశీలన
- 30 నుంచి ఆప్షన్ల నమోదు... జూలై 5న సీట్ల కేటాయింపు
 
సాక్షి, అమరావతి: ఏపీ ఈసెట్‌లో అర్హత సాధించిన (డిప్లొమా, బీఎస్సీ మేథ్స్‌) అభ్యర్థులకు ఇంజనీరింగ్,, ఫార్మా కాలేజీల్లో ప్రవేశాల కోసం రాష్ట్ర ఉన్నత విద్యామండలి బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీరు వెబ్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు వీలుగా 18 హెల్ప్‌లైన్‌ కేంద్రాలు ఏర్పాటుచేశారు. వీరు ఒరిజినల్‌ ధ్రువపత్రాలను ఆయా కేంద్రాల్లో జూన్‌ 29 నుంచి పరిశీలింపచేసుకోవాలి. ధ్రువపత్రాల జిరాక్స్‌ పత్రాలను మాత్రమే కాలేజీల్లో అందించాలని కన్వీనర్‌ పండాదాస్‌ పేర్కొన్నారు.

ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు రూ. 600, ఇతరులు రూ.1200 ప్రాసెసింగ్‌ ఫీజుగా చెల్లించాలన్నారు. ఒకటవ ర్యాంకు నుంచి ఆరు వేల వరకు జూన్‌ 29న, 6,001 నుంచి 14 వేల వరకు జూన్‌ 30న, 14,001 నుంచి 22వేల వరకు జూలై ఒకటిన, 22,001 నుంచి చివరి ర్యాంకు వరకు జూలై 2న పరిశీలన చేస్తారు. దివ్యాంగులు ఇతర ప్రత్యేక కేటగిరీల వారు విజయవాడలోని బెంజ్‌సర్కిల్‌లో ఉన్న పాలిటెక్నిక్‌లోని కేంద్రంలో పరిశీనలకు రావాలి. అభ్యర్ధులు జూన్‌ 30 నుంచి జూలై 3న సాయంత్రం 6 గంటల వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ‘హెచ్‌టీటీపీఎస్‌://ఏపీఈసీఈటీ.ఎన్‌ఐసీ.ఐఎన్‌’ వెబ్‌సైట్లో ఆప్షన్లు ఇవ్వాలి. జూలై 5న సీట్ల కేటాయింపు వివరాలు వెబ్‌సైట్లో పొందుపర్చనున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement