ఏపీ ఈసెట్ కు ఏర్పాట్లు పూర్తి | All set for AP ECET | Sakshi
Sakshi News home page

ఏపీ ఈసెట్ కు ఏర్పాట్లు పూర్తి

Published Sat, May 7 2016 8:14 PM | Last Updated on Sat, Aug 18 2018 7:58 PM

All set for AP ECET

-ప్రిలిమినరీ ‘కీ’ని ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం ఈసెట్ వెబ్‌సైట్‌లో ఉంచుతారు.
-మే 16న ఫలితాలతో పాటు ఫైనల్ ‘కీ’ విడుదల చేసే అవకాశముంది.


అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీఈసెట్)- 2016ను సోమవారం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కన్వీనర్ ఆచార్య పీఆర్ భానుమూర్తి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడు ప్రాంతీయ కేంద్రాల పరిధిలోని 68 కేంద్రాలలో పరీక్ష ఉంటుందని వెల్లడించారు.

అనంతపురంలో 6, కాకినాడలో 16, విజయవాడలో 14, తిరుపతిలో 9, విశాఖపట్నంలో 13, గుంటూరులో 8, విజయనగరంలో 2 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 36,809 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. జేఎన్‌టీయూ (అనంతపురం)లో సోమవారం ఉదయం ఆరు గంటలకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఆచార్య హెచ్. వరదరాజన్ పరీక్ష సెట్ కోడ్‌ను విడుదల చేస్తారని వెల్లడించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement