యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి) : రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే ఎడ్‌సెట్-2016ను మే 23న 18 పట్టణాల్లో నిర్వహించనున్నట్టు ఎడ్‌సెట్ కన్వీనర్ టి.కుమారస్వామి తెలిపారు. ఎస్వీ యూనివర్సిటీ ఏపీ ఎడ్‌సెట్-2016 ను నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రవేశ పరీక్ష కోసం ఫిబ్రవరి 10న నోటిఫికేషన్ విడుదల చేశామని తెలిపారు. ఓసీ, బీసీలు రూ.400, ఎస్సీ, ఎస్టీలు రూ.200 ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చునని తెలిపారు. ఏప్రిల్ 23వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు.
2013-16 సంవత్సరాల్లో డిగ్రీ సిలబస్ ఆధారంగా ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. గణితం, ఫిజిక్స్, బయాలజీ, సోషల్ స్టడీస్, ఇంగ్లీషు సబ్జెక్టులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. మే 23న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, చిత్తూరు, తిరుపతి, కుప్పం, కడప, ప్రొద్దుటూరు, అనంతపురం, నంద్యాల, కర్నూలు పట్టణాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలను www.aped-cet-org వెబ్‌సైట్ నుంచి పొందవచ్చన్నారు.
మే 23న ఎడ్‌సెట్
Published Tue, Mar 22 2016 7:49 PM | Last Updated on Sat, Aug 18 2018 7:58 PM
Advertisement
Advertisement