సాక్షి, తిరుపతి: ఎస్వీ అగ్రికల్చర్ యూనివర్సిటీకి బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. హ్యూమన్ ఐఈడీ బాంబ్ పేరుతో పేల్చేస్తామంటూ గురువారం ఉదయం కళాశాలకు ఆగంతకుడు మెయిల్ చేశాడు. కళాశాల అధికారులు తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అగ్రికల్చర్ కళాశాలకు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. కేరళ రాష్ట్రం నుంచి మెయిల్ వచ్చినట్టు కాలేజీ సిబ్బంది చెబుతున్నారు.
గత రెండు నెలల క్రితం కూడా తమిళనాడు రాష్ట్రం నుంచి మెయిల్ వచ్చింది. తిరుపతి రూరల్ సీఐ చిన్న గోవిందు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో వరసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. గతంలో కూడా పలు హోటళ్లు, ఆలయాలకు వచ్చిన బాంబ్ బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
Comments
Please login to add a commentAdd a comment