మెదక్ మున్సిపాలిటీ: మెదక్ పట్టణంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం బీఈడీలో ప్రవేశానికి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన, ర్యాంకు కార్డుల ఆధారంగా కళాశాలల ఎంపిక, వెబ్ ఆప్షన్ల నిర్వహించినట్లు కౌన్సెలింగ్ పరిశీలకులు వెంకట్రాంరెడ్డి తెలిపారు. మొదటి రోజు సోమవారం గణితం సబ్జెక్టుకు సంబంధించి నిర్వహించిన కౌన్సెలింగ్‌కు మొత్తం 167 మంది హాజరయ్యారు. రెండో రోజైన మంగళవారం ఫిజికల్ సైన్సు సబ్జెక్టుకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. ర్యాంకు హోల్డర్లు సంబంధిత ర్యాంకు కార్డులతో పాటు సర్టిఫికెట్స్‌తో హాజరుకావాలని సూచించారు.
నంగునూరులో
మండల పరిధిలోని రాజగోపాల్‌పేటలోని పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం నిర్వహించిన బీఈడీ కౌన్సెలింగ్‌కు పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు. ఉదయం 9 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంబం కాగా తొలి రోజు 182 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి సర్టిఫికెట్లను పరిశీలించారు. మధ్యాహ్నం బీఎస్‌ఎన్‌ఎల్ ఇంటర్నెట్ పనిచేయకపోవడంతో కౌన్సెలింగ్ రెండు గంటల పాటు నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి నెట్ పనిచేయడంతో అధికారులు తిరిగి కౌన్సెలింగ్ నిర్వహించారు. మంగళవారం నుంచి ఈ నెల 30 వరకు కళాశాలలో వెబ్‌ఆప్షన్లు పెట్టుకునేందుకు అధికారులు ఏర్పాటు చేశారు.
ప్రారంభమైన ఎడ్‌సెట్ కౌన్సెలింగ్
Published Mon, Sep 22 2014 11:42 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement
Advertisement