Edcet counseling
-
ప్రారంభమైన ఎడ్‌సెట్ కౌన్సెలింగ్
మెదక్ మున్సిపాలిటీ: మెదక్ పట్టణంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం బీఈడీలో ప్రవేశానికి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన, ర్యాంకు కార్డుల ఆధారంగా కళాశాలల ఎంపిక, వెబ్ ఆప్షన్ల నిర్వహించినట్లు కౌన్సెలింగ్ పరిశీలకులు వెంకట్రాంరెడ్డి తెలిపారు. మొదటి రోజు సోమవారం గణితం సబ్జెక్టుకు సంబంధించి నిర్వహించిన కౌన్సెలింగ్‌కు మొత్తం 167 మంది హాజరయ్యారు. రెండో రోజైన మంగళవారం ఫిజికల్ సైన్సు సబ్జెక్టుకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. ర్యాంకు హోల్డర్లు సంబంధిత ర్యాంకు కార్డులతో పాటు సర్టిఫికెట్స్‌తో హాజరుకావాలని సూచించారు. నంగునూరులో మండల పరిధిలోని రాజగోపాల్‌పేటలోని పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం నిర్వహించిన బీఈడీ కౌన్సెలింగ్‌కు పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు. ఉదయం 9 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంబం కాగా తొలి రోజు 182 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి సర్టిఫికెట్లను పరిశీలించారు. మధ్యాహ్నం బీఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ పనిచేయకపోవడంతో కౌన్సెలింగ్ రెండు గంటల పాటు నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి నెట్ పనిచేయడంతో అధికారులు తిరిగి కౌన్సెలింగ్ నిర్వహించారు. మంగళవారం నుంచి ఈ నెల 30 వరకు కళాశాలలో వెబ్ఆప్షన్లు పెట్టుకునేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. -
రేపటి నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్
ఖమ్మం, కొత్తగూడెంలో కేంద్రాలు ఖమ్మం: బీఎడ్‌లో చేరే విద్యార్థుల కోసం ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కొత్తగూడెంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని క్యాంప్ ఆఫీసర్, ప్రిన్సిపాల్ డాక్టర్ బి.సుధాకర్, కోఆర్డినేటర్ సుదర్శన్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పీహెచ్, ఎన్సీసీ, సీఏపీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు హైదరాబాద్, వరంగల్‌ల్లోని నిర్దేశిత కేంద్రాల్లో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు. కొత్తగూడెం, ఖమ్మం కేంద్రాల్లో కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజనల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల అటెస్టెడ్ జిరాక్స్‌లను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని తెలిపారు. ఎడ్‌సెట్ హాల్‌టికెట్, ర్యాంక్‌కార్డు, డిగ్రీ, ఇంటర్మీడియెట్, టెన్త్ క్లాస్ మెమోలు, స్టడీ సర్టిఫికెట్లు, కుల,ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, డిగ్రీ టీసీ వెంట తీసుకురావాల్సిందిగా వివరించారు. -
నేటి నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్
నిజామాబాద్‌అర్బన్ : ప్రభుత్వ గిరిరాజ్ కళాశాలలో శనివారం నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ లింబాగౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కౌన్సెలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. కౌన్సెలింగ్‌కు వచ్చే ప్రతి విద్యార్థి అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని ఆయన సూచించారు. ఈనెల 28వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. తేదీ సబ్జెక్టు ర్యాంకు 21-9-2014 మ్యాథమెటిక్స్ 2501 నుంచి 5000 వరకు, 7501 నుంచి 10,000 22-9-2014 మ్యాథమెటిక్స్ 14001 నుంచి 18000 వరకు 24001 నుంచి చివరిర్యాంకు వరకు 23-9-2014 ఫిజికల్ సైన్స్, ఇంగ్లిష్ 2501 నుంచి 5000 వరకు 9501 నుంచి చివరి ర్యాంకు వరకు 24-9-2014 బయోలాజికల్ సైన్స్ 4001 నుంచి 8000 వరకు 12001 నుంచి 16000 వరకు 25-9-2014 బయోలాజికల్ సైన్స్ 20001 నుంచి 24000 వరకు 30001 నుంచి చివరి ర్యాంకు వరకు 26-9-2014 సోషల్స్టడీస్ 5001 నుంచి 10000 వరకు 15001 నుంచి 20000 వరకు 27-9-2014 సోషల్స్టడీస్ 25001 నుంచి 30000 వరకు 35001 నుంచి 40000 వరకు 28-9-2014 సోషల్స్టడీస్ 45001 నుంచి 50000 వరకు 58001 నుంచి చివరి ర్యాంకు వరకు -
బీఈడీ.. అంతా వ్యాపారమే!
దూరవిద్యను తలపిస్తున్న రెగ్యులర్ బీఈడీ - తరగతుల నిర్వహణ అస్తవ్యస్థం - కౌన్సెలింగ్ నాటికి అఫిలియేషన్స్ శాతవాహన యూనివర్సిటీ: ఉన్నతాధికారుల పర్యవేక్షణలోపం, రాజకీయ ఒత్తిళ్లతో ఉపాధ్యాయ విద్య భ్రష్టుపడుతోంది. రెగ్యులర్ బీఈడీ కోర్సు దూరవిద్యా విధానాన్ని తలపిస్తోంది. కళాశాలల్లో సౌకర్యాల లేమి, అధ్యాపకుల నియామకాల్లో నిబంధనలు పాటించని పక్షంలో యూనివర్సిటీ అఫిలియేషన్ రాదని నిబంధనలున్నా.. తీరా వార్షిక పరీక్షల సమయానికి కోర్టు నుంచి అనుమతి తీసుకుని వాటి మనుగడ సాగిస్తున్నాయి. 2014-15 విద్యాసంవత్సరానికి ఈనెల 21 నుంచి 28 వరకు ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. జిల్లాలోని 19 బీఈడీ కళాశాలల పర్యవేక్షణ పూర్తయిందని, వాటి అఫిలియేషన్‌ను కౌన్సెలింగ్‌కు ముందే అందించే యోచనలో ఉన్నట్లు శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్ కోమల్‌రెడ్డి తెలిపారు. ఎన్నో ఆరోపణలు జిల్లాలోని చాలా బీఈడీ కళాశాలలు ఉపాధ్యాయ విద్యను వ్యాపార కోణంలోనే చూస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఆటస్థలం, లైబ్రరీ, సెమినార్హాళ్లు, అర్హత గల అధ్యాపకులు లేకున్నా నెట్టుకొస్తున్నాయి. కన్వీనర్ కోటా నుంచి వచ్చే ఫీజు రీయింబర్స్మెంట్, మేనేజ్మెంట్ కోటాతో వచ్చే డబ్బులను అప్పన్నంగా మింగేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఫీజు వివరాలు కన్వీనర్ కోటాలో సీటు పొందిన ఉపాధ్యాయ విద్యార్థి పైసా చెల్లించకుండానే కోర్సు పూర్తి చేసుకోవచ్చు. కళాశాల స్థాయిని బట్టి ఒక్కొక్కరికి రూ.14,400 నుంచి రూ.16,500 వరకు రీయింబర్స్మెంట్ వస్తోంది. స్కాలర్షిప్ రూపేణ రూ.4500- రూ.5 వేలు ప్రభుత్వం చెల్లిస్తోంది. 2013-14లో బీఈడీ అభ్యసించిన వారికిఫీజు రీయింబర్స్మెంట్ రాలేదని యాజమాన్యాలు తెలిపాయి. ఎవరి కోటా ఎంత? బీఈడీ కళాశాలలో మొత్తం వంద సీట్లు ఉంటాయి. కన్వీనర్ కోటాలో 75 శాతం, మేనేజ్మెంట్కు 25 శాతం సీట్లు కేటాయించింది. గతంలో మేనేజ్మెంట్ కోటాలో సీట్ల అమ్మకాలు రూ.25 వేల నుంచి రూ.70 వేల వరకు ఉంటే ప్రస్తుతం రెండింతలైనట్లు తెలుస్తోంది. కోర్సు విధానం కోర్సులో చేరిన విద్యార్థులు తరగతులకు కనీసం 80 శాతం హాజరు కావాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో మాక్రో టీచింగ్ కోసం కళాశాల కేటాయించిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో ఛాత్రోపాధ్యాయులుగా బోధన చేయాలి. యూనివర్సిటీ ప్రకారం పరీక్ష ఫీజులు అన్ని కలిపి మొత్తంగా రూ.2,530 చెల్లించాలి. నిబంధనలకు నీళ్లు జిల్లాలో 19 బీఈడీ కళాశాలల్లో 2 వేల మంది ఉపాధ్యాయ కోర్సు అభ్యసిస్తున్నారు. పలు కళాశాలల్లో సిబ్బంది సరిగాలేకపోవడంతో విద్యార్థులు తరగతులకు హాజరుకావడం లేదు. అన్ని మెథడ్స్ బోధించే అధ్యాపకులు మెజార్టీ కళాశాలలో లేకున్నా యాజమాన్యాలు ప్రభుత్వానికి ఏవో పేర్లు చూపి గుర్తింపును కాపాడుకుంటున్నాయి. లేని వసతులకు ఫీజులు అనేక కళాశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌లు లేవు. ఉన్నా అవి అలంకారప్రాయమేననే విమర్శలున్నాయి. లేనివాటికి కంప్యూటర్ రికార్డ్స్ ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. పర్యవేక్షణ కొరవడడంతోనే బీఈడీ ప్రమాణాలు పడిపోయాయనే వాదన వినిపిస్తోంది. ఎన్సీటీఈ ప్రకారం కళాశాలకు సొంత భవనం ఉండాలి. కాని నేటికీ కొన్ని అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. కొన్ని ప్రైవేట్ కళాశాలలు ఏడాదిలో కనీస తరగతులు కూడా నిర్వహించే స్థితిలో లేవు. వార్షిక పరీక్షకు హాజరు విషయాల్లోనూ విద్యార్థుల నుంచి డబ్బులు దండుకుంటున్నాయి. బయోమెట్రిక్ అటెండెన్స్ ఈ విద్యాసంవత్సరం బీఈడీ కళాశాలలో విద్యార్థులకు, అధ్యాపకుల హాజరును బయోమెట్రిక్ సిస్టమ్‌తో నమోదు చేస్తాం. ఈ విధానం అమలుకు ఎస్‌యూ వీసీ గత విద్యాసంవత్సరమే సిద్ధమైనా కొన్ని కారణాలతో చేయలేకపోయాం. ఈసారి కచ్చితంగా అమలు చేస్తాం. నిబంధనలు పాటించని కళాశాలలను ఉపేక్షించేది లేదు. - ప్రొఫెసర్ మహేందర్ రెడ్డి, ఎడ్యుకేషన్ డీన్ ఫ్యాకల్టీ, కేయూ వరంగల్