నిజామాబాద్‌అర్బన్ : ప్రభుత్వ గిరిరాజ్ కళాశాలలో శనివారం నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ లింబాగౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కౌన్సెలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. కౌన్సెలింగ్‌కు వచ్చే ప్రతి విద్యార్థి అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని ఆయన సూచించారు. ఈనెల 28వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.
తేదీ సబ్జెక్టు ర్యాంకు
21-9-2014 మ్యాథమెటిక్స్ 2501 నుంచి 5000 వరకు, 7501 నుంచి 10,000
22-9-2014 మ్యాథమెటిక్స్ 14001 నుంచి 18000 వరకు 24001 నుంచి చివరిర్యాంకు వరకు
23-9-2014 ఫిజికల్ సైన్స్, ఇంగ్లిష్ 2501 నుంచి 5000 వరకు 9501 నుంచి చివరి ర్యాంకు వరకు
24-9-2014 బయోలాజికల్ సైన్స్ 4001 నుంచి 8000 వరకు 12001 నుంచి 16000 వరకు
25-9-2014 బయోలాజికల్ సైన్స్ 20001 నుంచి 24000 వరకు 30001 నుంచి చివరి ర్యాంకు వరకు
26-9-2014 సోషల్‌స్టడీస్ 5001 నుంచి 10000 వరకు 15001 నుంచి 20000 వరకు
27-9-2014 సోషల్‌స్టడీస్ 25001 నుంచి 30000 వరకు 35001 నుంచి 40000 వరకు
28-9-2014 సోషల్‌స్టడీస్ 45001 నుంచి 50000 వరకు 58001 నుంచి చివరి ర్యాంకు వరకు
నేటి నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్
Published Sat, Sep 20 2014 2:08 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 PM
Advertisement
Advertisement